* * *
ఆంధ్రలో ఉండే అమ్మమ్మ ఊరికి ప్రయాణమయ్యాడు బిట్టూ, అమ్మ సునందతోపాటు. మూడేళ్లైంది, వాడు అమ్మమ్మ ఊరికి రాక! అందుకని ఈ సారి వాళ్లకి ఇంకెక్కడికీ వెళ్ళే పని లేదు: అమ్మమ్మ ఊరొక్కటే.
అమ్మమ్మ వాళ్ల ఊరు పేరు పోరంకి. ఊరు చిన్నదే, ఐనా పట్టణానికి బాగా దగ్గర. అందుకే అక్కడ పల్లె అందాలూ కనిపిస్తాయి; పట్టణ సౌకర్యాలూ ఉంటాయి: రెండు ప్రపంచాలన్నమాట.
అమ్మమ్మ, తాతయ్య కాకుండా ఆ ఇంట్లో తాతమ్మ కూడా ఉంటుంది. ఆవిడకి తొంభై రెండు సంవత్సరాలు. ఆవిడ బిట్టుని చూసి తెగ మురిసిపోయింది. మనవరాలి కొడుకు కదా, ఢిల్లీ నుంచి వచ్చాడు! ‘దగ్గర కూర్చోరా, కబుర్లు చెబుతా, రా’ అని పిలుస్తుండేది. తాతమ్మకి ఒక్క పన్నూ లేదు. బిట్టూకేమో విచిత్రంగా ఉంది- ఆవిడ తింటున్నా, మాట్లాడుతున్నా! కొడుకుని అక్కడ వదిలి పెట్టి, సునంద మళ్ళీ ఢిల్లీ వెళ్ళిపోయింది: ‘సెలవులు చక్కగా గడుపు; అమ్మ-నాన్న లేరు కదా అని అల్లరి చెయ్యకు; అమ్మమ్మని విసిగించకు; తాతయ్య ఆఫీసునుంచి వచ్చాక రోజూ ఆయనతో ఛెస్ ఆడు; ఆయనతోపాటు ఉదయపు నడకకి వెళ్తూండు; తాతయ్య దగ్గర కూర్చుని లెక్కలు, తెలుగు నేర్చుకో; చుట్టుప్రక్కల అందరితో స్నేహంగా ఉండు’ లాంటి జాగ్రత్తలు అన్నీ చెప్పేసి.
మామూలుగా ఐతే పెద్ద అల్లరి చేసే అబ్బాయి కాదు బిట్టూ. కానీ అమ్మమ్మ, తాతయ్య గారాబం చేస్త్రారు కదా, అందుకని ఢిల్లీలో కంటే కాస్త ఎక్కువ…
View original post 465 more words
Very lively!!!
LikeLiked by 1 person