భవానీ ద్వీపం – విజయవాడ నగరానికి ఒక అలంకారం

* * * భవానీ ద్వీపం పేరు మీరు వినే ఉంటారు. విజయవాడ సమీపంలో కృష్ణానదిలో ఉంది ఇది. పెద్ద పెద్ద నదీ ద్వీపాల్లో భవానీ ద్వీపం ఒకటి. విజయవాడ లాటి ఊళ్లో ప్రజలకి ఒక పిక్నిక్ లాటిది జరుపుకుందుకు ఎలాటి బహిరంగ ప్రదేశం లేదనే వారికి ఇది చక్కని ఆటవిడుపు. దశాబ్దం క్రితం అభివృధ్ధి చేసినా ప్రజలకి అంతగా దీనిపట్ల అవగాహన లేదని చెప్పవచ్చు. * ఒక మూడు సంవత్సరాల క్రితం  కార్తీక మాసం వనభోజనం …

Continue reading భవానీ ద్వీపం – విజయవాడ నగరానికి ఒక అలంకారం

ఆదుర్రు – గోదావరి ఒడ్డున నిశ్శబ్దంలో బుధ్ధుని మూలాలు

* * * తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు తాలూకాలో ఉన్న ఆదుర్రు గ్రామం అతి నిశ్శబ్దంగా కనిపిస్తుంది. అక్కడ బౌధ్ధ మతానికి చెందిన అత్యంత విలువైన నిర్మాణాలున్నాయని ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాటి శ్రధ్ధ చూపకపోవటంతో అక్కడి విలువైన బౌధ్ధ స్థూపం అలా ఎదురుచూస్తోంది. అది పదిహేడు అడుగుల వ్యాసం కలిగి జెయింట్ వీల్ ఆకారంలో నిర్మించబడింది. చుట్టూ వేదిక, ఆయకాలు నిర్మించబడి ఉన్నాయి. దీనిని మహాక్షేత్రం అంటారు. * మొదటిసారిగా …

Continue reading ఆదుర్రు – గోదావరి ఒడ్డున నిశ్శబ్దంలో బుధ్ధుని మూలాలు

పొగమంచు

* * * తెలతెల వారుతుంటే పొగమంచు ముసుగులో ప్రకృతిని చూస్తున్నా.... ప్రపంచ అస్థిత్వం మసక, మసకగా................. జీవితానికి అర్థం చెబుతోందా? క్రితం సాయంత్రం నీకోసం కూర్చిన జాజుల మాల ప్రకృతిలో వైరాగ్యాన్ని చూసి, చేజారి, విడివడి, సంకెళ్లని త్రెంచుకున్న అనుభూతుల వానచినుకలై మనసునెటో లాక్కెళుతుంటే..... ఏయ్, జ్ఞాపకాల జడివానలో తడుస్తూ నన్ను మరుస్తున్నావా? అంటూ తెల్లని పొగమంచు నన్ను కమ్మేశింది! * * *  

లయ

  * * * తిండి, నిద్ర...ఈ జీవితమింతే అనుభవాల ఖజానా ఖాళీ అయింది, అనుభూతుల రసస్పర్శలు జీవరహితం అయ్యాయి! హృదయపు స్పందన సవ్వడి ఆగిపోయింది. బ్రతుకు బాటలో నైరాశ్యపు గాలుల మధ్య చిన్నబుచ్చుకున్న మనసుతో అడుగులు వేస్తున్నా.... ఏదో సడి!................... వసంతాగమనంలా నువ్వు! చివుళ్లు తొడుక్కున్న ప్రకృతి పరవశించిపోతూ సువాసనల చైతన్యంతో సాక్షాత్కారం! జీవితం మళ్లీ మొదలైంది అనిపించిన క్షణం.! అంతలో వ్యథాపూరిత భావం.... ఈ బాటలో నీవెందాకా? నా అడుగుల్లో ఈ లయ ఎందాకా? …

Continue reading లయ

అస్తిత్వం

* * * వేకువల్నీ, వేదనల్నీ అధిగమించి నిత్య పథికులమై, నిరంతరాన్వేషణార్థులమై ఎటు వెళ్తున్నాం, ఏమై పోతున్నాం? నిన్నూ, నన్నూ సమస్త ప్రపంచాన్ని ఆవరించిన కాలం మహా మౌనిలా, లిప్తలు, లిప్తలుగా కంటి చూపుల వెంట, ఒకటి కాని దారుల వెంట ప్రయాణమై వెళ్తుంటే నీకేమనిపిస్తోంది? ఆ నిశ్శబ్దంలో అడుగులు లెక్కెట్టుకుంటూ-- కుడి, ఎడమలమై నువ్వూ నేనూ అనుసరిస్తూనే ఉన్నాం! గమ్యం అర్థం కాక అయోమయంలో పడుతూనే ఉన్నాం! * * *