* * * ఆకెళ్ల మాణిక్యాంబ ఇప్పుడిప్పుడు ఆత్మకథలు మళ్లీ వస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు రాస్తున్న సమగ్రమైన ఆత్మకథలు. చిన్న వయసులోనే పెళ్లిళ్లై, కుటుంబమే ప్రపంచంగా జీవించిన స్త్రీలు రాసిన జీవిత కథలు. అప్పటి సామాజిక పరిస్థితులలో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం పెద్దగా లేదు. యుక్తవయస్కురాలవుతూనే కుటుంబ జీవితంలోకి ప్రవేశించే ఆడపిల్లలకు ఎలా ఉండాలన్నది ప్రత్యేకం నేర్పిందేమీ లేదు. చిన్నతనంలో చూసిన తమ కుటుంబ వాతావరణమే వారికి ఎన్నో విషయాల్లో మార్గదర్శి. జీవన ప్రవాహంలోకి …