మూడువేల అల్లికలు – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Apr, 2021

* * *       సామాన్య ప్రజలు - అసాధారణ జీవితాలు రచనః సుధామూర్తి సాఫ్ట్ వేర్ రంగంలో ‘’ఇన్ఫోసిస్’’ పేరు దేశ, విదేశాల్లోని వారికందరకూ తెల్సినదే. అలాగే దేశ వ్యాప్తంగా అనేక సేవా కార్యక్రమాలు చేస్తున్న ఇన్ఫోసిస్ ఫౌండేషన్ కు ఛైర్ పర్సన్ గా ఉన్న శ్రీమతి సుధామూర్తిని తెలియని వారుండరేమో! ఆమె ఒక రచయిత్రన్న విషయం కూడా మనందరకూ తెల్సినదే. ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం సుధామూర్తి రాసిన ‘’మూడువేల అల్లికలు’’. ఈ …

Continue reading మూడువేల అల్లికలు – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Apr, 2021

ఆదర్శం – బిట్టు కథ, పదవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Apr, 2019

ద్వైతాద్వైతం

* * *

జరిగిన కథ : బిట్టు ఢిల్లీ కుర్రాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరు పోరంకికి వచ్చాడు, వేసవి సెలవలు గడిపి వెళ్ళేందుకు. ఇక్కడ వాడు రకరకాల సంగతులు నేర్చుకుంటున్నాడు. మొన్న పిచ్చుకలు దొరికాయి వాడికి. అంతకుముందు ఓ కుక్క దొరికింది. దానికి రెయిన్ బో అని పేరు పెట్టుకున్నాడు. పక్కింటి అమ్మమ్మ పేరు జయమ్మమ్మ. ఆవిడే, పిచ్చుకల్ని బయట పడేసింది.. ఇక చదవండి.

మర్నాడు జయమ్మమ్మ వచ్చింది- రమ్యనీ, రాహుల్ ని తీసుకుని. ఆవిడ వచ్చేసరికి బిట్టు పిచుకల దగ్గర ఉన్నాడు. ‘నేను బయట పడేసిన పిచుకల్ని నువ్వు ఇంట్లోకి తెచ్చుకున్నావా?’ అని జయమ్మమ్మ తిడుతుందేమో అనుకొని కొంచెం చిన్నబోయాడు బిట్టు.

‘ఏమిటి, ఆ పిచుకల్ని ఇక్కడ తెచ్చిపెట్టావా?’ అంది ఆమె కొంచెం ఆశ్చర్య పోతున్నట్లు. బిట్టు అమ్మమ్మ వైపు చూసాడు. ‘అవును జయా, వీడు ఎప్పుడూ పిచుకల్ని చూడలేదుట. వీడు ఉన్నన్నాళ్లూ వీటిని పెంచుకుంటాడట’ అంటూ నవ్వింది అమ్మమ్మ, వాతావరణాన్ని తేలిక చేస్తూ.

బిట్టూ రమ్యని, రాహుల్ని దగ్గరికి పిలిచి పిచుక పిల్లల్ని చూపించాడు. వాళ్ల వెనకే ఇల్లంతా తిరుగుతున్నాడు రెయిన్బోగాడు. జయమ్మమ్మ కొంచెం విసుక్కుంది: ‘ఈ పిచ్చి కుక్క ఎక్కడిది? పెంచుకోవాలంటే మంచి జాతి కుక్కని తెచ్చి పెట్టుకోవాల్సింది’ అని.

బిట్టుకి జయమ్మమ్మ మాటలు నచ్చలేదు. కానీ తాతయ్య చెప్పారు కదా, పెద్దవాళ్ల మాటలకి కోపం తెచ్చుకోకూడదని?! అందుకని ‘ఎలాగైనా సరే, రెయిన్బోగాడు జయమ్మమ్మకి కూడా…

View original post 900 more words

…మాయలు నీవే కప్పి – దునియా, మన తెలంగాణా ఆదివారం పత్రిక, 27 Oct, 2019

ద్వైతాద్వైతం

* * *

వర్షం ఆగకుండా నిలబడి కురుస్తోంది.ఎందుకో మనసంతా దిగులు దిగులుగా ఉంది.తెలవారిందో లేదో తెలియనీయని చిక్కని మబ్బులు తమ సొద ఏదో చెప్పుకుంటూ ఈ వర్షపు ఉదయయానికి గుబులు పులుముతున్నాయి.

బాల్కనీలోకి చిన్నజల్లు కూడా రావటంలేదు.ఉయ్యాలలో మరింత సర్దుకుని కూర్చుంది శైలజ.ఆమెభర్త చంద్ర పనుందంటూ పెందరాళే ఆఫీసుకి బయలుదేరాడు.సంవత్సరం గ్యాప్ తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు రాహుల్ రెండురోజులు మురిపించి వెళ్లిపోయాడు.ఒంటరితనం ఒక్కటే బెంగల్ బెంగల్ కి కారణమా? కాదులే,అది కూడా ఒక కారణమంతే.
బెంగల్, బెంగల్… పుష్కరం క్రితం ఈపదాన్ని కనిపెట్టింది రేణు కదూ.అమ్మానాన్నలకి, తమ్ముడికి బై బై చెప్పి యూనివర్సిటీ చదువుకి హాయిగా వెళ్లిపోయింది. భోజన సమయంలో కన్నీళ్లెట్టుకునే భార్య బెంగల్ చూడలేక డైనింగ్ టేబిల్ దగ్గర కూతురురేణు కూర్చునే నాలుగో కుర్చీ తీసి కంటికి కనిపించకుండా దాచేసేడు చంద్ర. హాస్టల్ లో ఉన్న రేణుని ఫోన్ లో పలకరించినపుడు కిలకిలా నవ్వుతూ కబుర్లు చెప్పేది, ‘ఎందుకమ్మా బెంగల్ బెంగల్ నీకు’ అని అడిగేది పైగా. ఈ పిల్లకి తల్లి బాథ అర్థం కాదా అని వాపోయేది ఆమె.

ఇంట్లో అన్నేళ్లుగా విసిగించిన పిల్లలఅల్లరి మిస్ అవటం ఆమెకి మరింత అలసటని, అసహనాన్ని కలిగించేవి. ఆ తర్వాత రాహుల్ చదువుకోసం దూరంగా వెళ్లినప్పుడు ముందులా కాకుండా కొంచెం స్థితప్రజ్ఞతతో తీసుకోగలిగింది. అదేదో సహజమైనదే అన్న తెలివిడి వచ్చి గంభీరంగా ఉండిపోయింది. ఈ పిల్లలు ఇంతే. మనసంతా ఒక…

View original post 1,191 more words

జమా మసీదు – దిల్లీ, నైనితాల్, బరేలి, తాజ్ యాత్రా విశేషాలు – Apr, 2019

ద్వైతాద్వైతం

* * *

ఎప్పటిలాగే దేశంలో మరో క్రొత్త ప్రదేశాన్ని చూసేందుకు బయలుదేరాలనుకుంటుంటే ఒక పంజాబీ మిత్రుడు తాను స్థిరపడిన బరేలీ రమ్మని ఆహ్వానించారు. ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తున్న ప్రయాణానికి వేసవి విడిది నైనితాల్ ని కూడా కలుపుకుని నాలుగు రోజులు యాత్రని సిధ్ధం చేసుకున్నాం.

ముందుగా విజయవాడ నుంచి ఆకాశదారిలో దిల్లీ  చేరి, అక్కడొక రోజు మజిలీ చేసేం. ఏప్రిల్ నెల మూడో వారం దిల్లీ నగరమింకా వేసవి వేడిని ఆహ్వానించినట్టులేదు. వాతావరణం బావుంది. ఆ శుక్రవారం సాయంత్రం దిల్లీలో గడిపిన పాత రోజుల్ని దిగులు, దిగులుగా తలుచుకుంటూ తీరిగ్గా జమా మసీదును చూసేందుకు బయల్దేరేం. IMG_20190419_180610935IMG_20190419_180255363IMG_20190419_181237447IMG_20190419_181604869మొఘల్ చక్రవర్తి షాజహాన్ కట్టించిన ఈ మసీదు భారతదేశంలోని ప్రసిధ్ధి చెందిన మసీదుల్లో ఒకటి. విశాలంగా కొన్ని వేలమంది సరిపోయేంత ఆవరణలో ఉన్న ఈ మసీదు అందమైన ఎర్రరాయి, తెల్లని పాలరాయి మేళవించి కట్టిన నిర్మాణము. ఆవరణలో పెద్దలు, పిల్లలు ఆనందంగా తిరుగాడుతూ కనిపించారు. ఆనందంతో వెలిగే ముఖాలు చూస్తుంటే ఎంత బావుంటుంది!

మసీదు ముందు అనేక చిన్న చిన్న దుకాణాలు బట్టలు, గాజులు, క్లిప్పులు, బొమ్మలు, బ్యాగ్ లు, పాదరక్షలు, ఇంకా అనేకరకాల వస్తువుల్ని అమ్మేందుకు సిధ్ధంగా ఉన్నాయి. చిన్నచిన్న పిల్లలు కూడా దుకాణాల్లో వ్యాపారం చేస్తూ కనిపించారు. ఎదగడానికి తొందరలేకపోయినా, జీవితం బలవంతంగా నేర్పుతున్న జీవిత పాఠాల్ని అనాయాసంగానే అందుకుంటున్నారు.

మరోప్రక్క రకరకాల తినుబండారాలను తయారు చేసే దుకాణాలు హడావుడిగా కనిపించాయి.

View original post 859 more words

బిట్టు-పిచ్చుకలు – తొమ్మిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Feb. 2019

ద్వైతాద్వైతం

* * *

ఆరోజు బిట్టు నిద్ర లేచేసరికి ఇంటి ప్రహరీ గోడ మీది నుండి ప్రక్కింటి వాళ్లతో మాట్లాడుతోంది అమ్మమ్మ. బిట్టుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇంట్లో ఎవరుంటారు? తను వచ్చి ఇన్నాళ్ళైంది కదా, ఇప్పటిదాకా ఆ ఇంట్లోవాళ్ళు ఎవ్వరూ తనకు కనిపించనే లేదు!

కొద్ది సేపటికి అమ్మమ్మ కబుర్లు పూర్తిచేసుకొని లోపలికి వచ్చింది కదా, అప్పుడు ఆవిడ చేతిలో అరటికాయలు కనిపించాయి బిట్టుకి. ‘అవేమిటి? ఎక్కడివి?’ అంటూ ప్రశ్నలు వేసాడు అమ్మమ్మని.

‘ప్రక్కింటి జయమ్మమ్మ వాళ్లు ఇన్నాళ్ళూ ఊరెళ్ళారు కదా, ప్రొద్దున్నే వచ్చారు. వాళ్ల పెరట్లో కాసాయట, అరటి కాయలు. మనకు కొన్ని ఇచ్చారు. వాళ్ల మనవడు, మనవరాలు రేపు వస్తున్నారుట, ఇల్లంతా శుభ్రం చేయించుకుంటున్నారు. పిల్లలు వచ్చాక వాళ్లని మనింటికి తీసుకొస్తానంది జయమ్మమ్మ. చిట్టి, దావీదులతో పాటు వాళ్ళు కూడా నీతో కలిసి ఆడుకుంటారు.’

అమ్మమ్మ మాటలతో బిట్టుకి క్రొత్త ఉత్సాహం వచ్చింది. కొత్త స్నేహితులొస్తున్నారనమాట! మధ్యాహ్నానికల్లా కొంచెం హడావుడి వినిపించి ప్రక్కవాళ్ల ఇంటి వైపుగా చూసాడు. ఓసారి వాళ్ళింటికే వెళ్లి చూసి వద్దామని కూడా అనుకున్నాడు. ఆ మాటే పైకి అనేసాడు; కానీ అమ్మమ్మ వెళ్లొద్దంది: ‘వాళ్ళు ఈ పూటే కదా వచ్చింది?! ఇల్లంతా సర్దుకునే హడావుడిలో ఉంటారు. నువ్వు వెళ్లి అడ్డం పడకు. రేపు కలవచ్చులే’ అని. సాయంత్రం నాలుగవుతోంది. ప్రక్క వాళ్ళింట్లో జయమ్మమ్మ కాబోలు, పెద్ద పెద్దగా ఏదో అంటోంది కమలమ్మతో. చిట్టి అక్కడే…

View original post 820 more words

ముసురు – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Mar, 2021

                                                   * * *                                                             అనుభవాలు – జ్ఞాపకాలు – ఆలోచనలు                                                                   (ఆత్మకథ) శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి రచన ఈనెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం ఒక ఆత్మకథ. ఉన్నత చదువులు చదివి, డాక్టరేట్ పొంది, అధ్యాపక వృత్తిని ఎంతో ఇష్టంగా నిర్వర్తించి, అసోసియేట్ ప్రొఫెసర్ గా పదవీ విరమణ చేసిన శ్రీమతి ముదిగంటి సుజాతారెడ్డి గారి ఆత్మకథ ‘’ముసురు’’ చాలా చాలా ప్రత్యేకమైనది.  ఆమె పదిలంగా దాచుకున్న జ్ఞాపకాలు, జీవితం పొడవునా చూసిన అనుభవాలు, …

Continue reading ముసురు – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Mar, 2021