* * * దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో రచయిత్రి శిరీష రాసిన కథలను ఎంపిక చేసి ‘’కొత్త స్వరాలు’’ కథా సంపుటిని 2018 లో తీసుకొచ్చారు. ఇందులో కథలన్నీ మనవీ, మన తోటివారివీ. ఆమె పరిశీలన, సహానుభూతి ఈ కథలను రాయించాయి. చుట్టూ ఉన్న మనుషులని, వాళ్ల చిన్న, పెద్ద సంతోషాలనీ, ఆశలనీ, దుఃఖాలనీ, అసంతృప్తులనీ గమనిస్తూ జీవితం వ్యక్తులు కోరుకున్నట్టు ఎందుకుండదు అని దిగులు పడతారు రచయిత్రి. జీవితంలో ఎదురయ్యే అనేకానేక …
Month: March 2022
కిచ్చు – పిల్లల ఉత్తమ కథలు, నారంశెట్టి బాల సాహిత్య పీఠం, Feb. 2022
* * * ఊరికి దూరంగా ఒక ఇల్లుంది. ఇంటి వెనకున్న తోటలో గులాబీ, మల్లె, చేమంతి, నందివర్ధనంలాంటి పూలమొక్కలు, వేప, మామిడిలాటి పెద్దచెట్లు ఉన్నాయి. “ఇల్లంతా దుమ్ము పట్టి, నాకళ్లు మసకబారాయి. ఇంట్లోకి ఎవరైనా వస్తే సేవ చేస్తాను. అలికిడిలేదని పక్షీ, పిట్టా కూడా రావట్లేదు.’’ ఇల్లు దిగులుగా తోటకి చెప్పింది. “మాకు దాహం వేస్తే నీళ్లిచ్చేవాళ్లు లేరు. వాననీళ్లని దాచుకుని తాగుతున్నాం. మొక్కలు చిగుళ్లేయటం మరిచిపోతున్నాయి. పువ్వు, పిట్టపాట లేని తోట …
Continue reading కిచ్చు – పిల్లల ఉత్తమ కథలు, నారంశెట్టి బాల సాహిత్య పీఠం, Feb. 2022
శిరీష, శిరీష కోమలం సంకలనం – వ్యాసం, Dec.2021
* * * కమ్మగా కూనిరాగాలు తీస్తుంది, అందమైన కథలూ రాస్తుంది. కానీ భావోద్వేగాల్ని మాత్రం తన గాంభీర్యం మాటున దాచుకుంటుంది. అంత నిండుగా ఉండటం ఎలా సాధ్యం అంటే మాత్రం చిరునవ్వే సమాధానం. పేరు ఎంత సున్నితమో అంతే సున్నితమైన వ్యక్తి ఆమె. తనను ఒక్కమాటలో నిర్వచించమంటే ‘’స్నేహం’’ అని చెబుతాను. ఆమె ప్రపంచం విశాలమైంది. ఆమె సంభాషణలో ఎందరెందరి ప్రస్తావనలో వస్తుండేవి. వారి సమస్యలు, వారి సుఖదుఃఖాలు అన్నీ ఆమెవే. …
Continue reading శిరీష, శిరీష కోమలం సంకలనం – వ్యాసం, Dec.2021
భారతదేశం పక్షాన – పుస్తకావిష్కరణ, 2nd March, 2022
* * * వేదికపైనున్న భారత ఉపరాష్ట్రపతి గౌరవనీయులు శ్రీ ఎం. వెంకయ్య నాయుడు గారికి, ఆంధ్రప్రదేశ్ పూర్వ ఉపసభాపతి శ్రీ మండలి బుద్ధ ప్రసాద్ గారికి, సిద్ధార్థ అకాడెమీ అధ్యక్షులు శ్రీ డా. సి. నాగేశ్వరరావు గారికి, సభలోని పెద్దలందరికీ నమస్కారములు. మన దేశానికి స్వతంత్రం వచ్చి 75 సంవత్సరాలు అవుతున్న సందర్భంగా జరుపుకుంటున్న అమృతోత్సవ సమయంలో దేశ స్వతంత్రపోరాటం గురించి, ఆనాటి భారతీయుల నిస్వార్థ త్యాగాల గురించి మాట్లాడుకోబోతున్నామన్నది సంతోషం …
Continue reading భారతదేశం పక్షాన – పుస్తకావిష్కరణ, 2nd March, 2022