బాధావీచికలా ఓ జ్ఞాపకం!

* * * విశ్వవిద్యాలయపు పట్టాకోసం ఆఖరి సెమిస్టర్ అయిందనిపించి వీడ్కోలు దిగుళ్లను గోదారి గాలుల మధ్య దూదిపింజెలా ఎగరేసి అమ్మ ఒడిలో బధ్ధకంగా ఎడతెగని శెలవులకి నాంది పలుకుతూ యథాలాపంగా పెరట్లో తలెత్తి చూస్తే............... నిన్ను ఏ జ్ఞాపకం ఉక్కిరిబిక్కిరి చేసిందో! మరుపు పొరల్లోకి ఇంకా జారని కాలేజ్ క్యాంపస్ ఏ మెరుపు జాడని కళ్లముందుకు తెచ్చిందో! చౌరాసియా వేణువు తీయనిపరిమళమై నిన్ను చుట్టుముట్టిన క్షణం! చిరు తగవుతో మొదలైన పరిచయం.......... నిముషాలు, గంటలు, రోజులు, …

Continue reading బాధావీచికలా ఓ జ్ఞాపకం!

బార్టర్ సిస్టమ్

* * * మనసును వేగించే ప్రశ్నే లేకపోతే నిరాహారంగా మెదడు! కలత నిద్రెరుగని నిద్రా ఒక నిద్రేనా? సంధించే వాగ్బాణాలూ, పులుముకునే ఆడంబరాలూ ప్రపంచ శత్రువునెదుర్కొనే సమాధానాలు నీకు! మంచి మిత్రుడిలాటి పెరటిగాలి మాత్రం శూన్య హృదయాన్ని ఎంతకని నింపుతుంది? వెన్నెల చల్లగా కాక ఇంకెలా ఉంటుంది? మన కక్ష్యలు సమాంతరాలని తెలుసు నీకు! దారి మళ్లించబోతావెందుకు? ఈ దారినిండా పరుచుకున్న ముళ్లు, ఆ దారి కడ్డుగా పోగుపడిన పరిమళాలు రెండూ రెండే! రెండు విభిన్న …

Continue reading బార్టర్ సిస్టమ్

చిగురించిన స్ఫూర్తి!

* * * ఓ బోలుతనపు శూన్య చిత్రం మనసంతా ఆక్రమించినపుడు- మరో తోచనీయని ఖాళీతనం గుండెలోకి తొంగి చూసినపుడు- ఉస్సురంటూ వాలిందో ఎర్రతోక నల్లపిట్ట, ఎక్కడేక్కణ్ణుంచో ఏ సందేశాల బరువులు మోసుకొచ్చిందో! నా లోలోపల ఏదో వెదుకులాడుతుంది. నన్ను వింటుందా? తనని వినమంటుందా? నిలవనీయని ఏ స్మృతి రేగిందో అంతలోనే రివ్వుమంటూ ఎగిరిపోయింది! కమ్ముకొచ్చే సంధ్య చీకటి వెలుగుపూల అమావాస్యని తోడు తెచ్చింది బ్రతుకంతా ఆవరించినా ఏ నాడూ పలుకరించని అల్లరి గాలి ఏమనుకుందో ఏమో?... …

Continue reading చిగురించిన స్ఫూర్తి!

ఇల్లొక ఆత్మీయ బంధువు – కౌముది – గులాబీల తోట నవల – 2014

* * * మనసు, మాయ పర్యాయ పదాలని తెలుసు మళ్లీ మళ్లీ రంగురంగుల ఆశ నిరాశల్నిఅద్దుతుంటాయనీ తెలుసు! నారింజరంగు సూర్యోదయాలు చైతన్య రహదారుల్ని పరుస్తుంటే, ఊదారంగు సాయంత్రాలు మాత్రం గుండె నిండా గుబులు మబ్బుల్ని నింపుతూ ఉంటాయి! అయినా.............. అన్ని రుతువులతో సహవాసం చేసే పెరటి పచ్చదనం ఎర్రెర్రని ఆశల్ని పూస్తూనే ఉంటుంది! ప్రకృతి పంచే సందేశాల విందు వెన్నంటి ఉండే ఆర్ధ్రతవుతుంది! తూర్పున బయలుదేరిన ఉత్సాహం పడమటి దిక్కుగా నిస్త్రాణ అవుతుంది! నిశీధి నిశ్శబ్దం …

Continue reading ఇల్లొక ఆత్మీయ బంధువు – కౌముది – గులాబీల తోట నవల – 2014

అక్కచెల్లెళ్లు – కౌముది – గులాబీల తోట నవల- 2014

* * * నీరాకనంటే ఎన్నాళ్ళు ఉంటావులే అన్న నిర్లిప్తత! నువ్వొస్తున్నావన్న కబురుతో పాటు వెళ్లిపోతావన్న దిగులు! నిజం చెప్పనా........... ఎప్పుడో, బహుశా ఏ జన్మలోదో అనిపించే జ్ఞాపకం! ధనుర్మాసపు చిరుచలిలో.............. వరండా అంచునో, డాబా పిట్టగోడ మీద నీలాకాశం క్రిందో కూర్చుని వాకిలి ముందు క్రితం రాత్రి వేసిన ముగ్గుల్ని, గొబ్బెమ్మల సిగలో తురిమిన బంతి పువ్వుల్ని చూస్తూ కబురులాడే తీరిక లేదంటావ్! ఎందుకో అలలు అలలుగా నవ్వులు పూచే ఆ పసితనాలు ఏమయ్యాయో!? ఒక …

Continue reading అక్కచెల్లెళ్లు – కౌముది – గులాబీల తోట నవల- 2014

చిరంజీవులు – కౌముది – గులాబీల తోట – 2014

* * * ఈ సాయంసంధ్య మనసునెందుకో తడువుతోంది, శూన్యంలోకి సారించిన చూపులు అప్రయత్నంగా చిక్కుపడ్డాయి అభావంగా ఉన్న మనసులో చలనం!.. సంచలనం! దూరంగా, కనుచూపుమేరలో పెంకుల కప్పు కూలుతూ ఓ ‘బడి’ లేత వెన్నెల కాంతిలో ఆ శిధిలాల మధ్య పరుచుకున్న మిలమిలలు! ఒకర్నొకరు తోసుకుంటూ, బడిగంటకు తూనీగల్లా పరుగులు తీసిన చిన్నారులు, ఎప్పటిదో పాతఫోటో ఫ్రేమ్ లా.............అయినా స్పష్టంగా.............. ఎందుకో  ఈ చిత్రం ఇంత సజీవంగా ఉంది?! అనుభవాల రుతువులన్నీఆవాహన చేసుకుని, పరిపూర్ణత్వంతో వెలుగుతున్నఈ …

Continue reading చిరంజీవులు – కౌముది – గులాబీల తోట – 2014

నువ్విక్కడే ఉన్నావ్! – కౌముది – గులాబీల తోట – 2014

* * * ఆశల రెక్కల విమానమెక్కుతూ అనుబంధాల నిచ్చెన ప్రక్కకి జరిపేవ్! వెనక్కి తిరిగి చూస్తే, భౌతిక దూరాలు వాస్తవాలయ్యేయి! అక్కున చేర్చుకునే ఆత్మీయతలు మాత్రం అధివాస్తవాలవుతున్నాయంటావా?! లేదు... ప్రవాహపు ఒడిలోనే ఉన్నావు, ఒడ్డుచేరేందుకు సమయముంది! కాస్తంత ఓరిమితో నీటి వాలునే కదులు, దారిపొడవునా నిన్నంటే నీటి బిందువులు మాత్రం సున్నితంగానైనా విదిలించెయ్యాలి సుమా! * * *

అందాల కాశ్మీరం

* * * ఈ ఆదివారం హిందూ లో ‘ఆషిష్ కౌల్’ రాసిన ‘ది స్టోన్ పెల్టర్స్’ అనే వ్యాసం చదువుతుంటే ఎన్ని ఆలోచనలో! కాశ్మీరు గురించి ఇక్కడ దక్షిణాదిన ఉన్న మనకి ఏమి తెలుస్తుంది? నిజమే. ఈ వ్యాసంలో కొన్ని వాక్యాలు మనసుని గాయపరుస్తున్నాయి. అనంతనాగ్ ప్రాంతాన్ని ఇస్లామాబాద్ గా అక్కడి విధ్వంసకారులు పిలుస్తుండటం, స్కూళ్లు, కాలేజీలు లేకుండా చదువులు ప్రస్తావనే లేని ఎదుగుతున్న పిల్లలు, వాళ్లు ప్రతిరోజూ తెలవారుతూనే ఇంటినుండి బయటకొచ్చి రోడ్లమీద రాళ్లు …

Continue reading అందాల కాశ్మీరం

ఒఠ్ఠి మాయ!

* * * అనుకున్నంతా అయింది, నిండా మూడేళ్ళు లేవు, అమ్మని, నాన్ననీ సరే, నానమ్మనీ ఆవాహన చేసేసుకుంది చూడు! తాతయ్యదే కాదూ అసలు తప్పు.......... పాపాయి తలుచుకున్నప్పుడు, తలుచుకోనప్పుడు కూడా పాపాయి వెంట పరుగెట్టేందుకు ప్రయాణ మవుతుంటే వద్దని మరి చెప్పొద్దూ ?! అంటే పూర్తిగా తప్పు పాపాయిదీ కాదు, ఆ మెత్తని స్పర్శ, ఆ మెరిసే కళ్ళు ఆ చిట్టి పలుకులు, ఆ అల్లరి పరుగులు, ఆ కథ చెప్పించుకునే వైనం ................. అవునులే, …

Continue reading ఒఠ్ఠి మాయ!

పురాతన జ్ఞాపకం

* * * సూర్యాస్తమయం వెంటనే సూర్యోదయాన్ని ఎవరైనా చూసేరా? ఇడిగో, సప్త రథాల్నెక్కి మరీ వచ్చాడు ఈ బుల్లి అతిథి! వెలుతురు పారిజాతాల్ని మూటగట్టి మరీ తెచ్చాడు! ఆ నల్లని కనుపాపలు ప్రపంచాన్ని విస్మయంగా పరికిస్తుంటాయి! ఏవో రహస్యాల్ని చెప్పాలన్నట్టు విడివడని గుప్పెళ్లు ఊరిస్తుంటాయి! ఒకే ఒక్కసారి..........వాడి సమీపానికొచ్చామా!.... వాడి మాయలో పడకూడదన్న నిబంధనలేమీ పనిచెయ్యవు! తన అస్తిత్వాన్ని ప్రదర్శించే ఆ చేతులు, కాళ్లు చేసే విన్యాసాలు ఏ నృత్య రీతులకి అందుతాయి? సూర్యుడి చుట్టు …

Continue reading పురాతన జ్ఞాపకం