* * *
Continued from Part II
ద్వారకలో రెండురోజుల మజిలీ తర్వాత మేము సోమనాథ్ కి రోడ్దు దారిలో ప్రయాణమయాం. అది దాదాపు 4-5 గంటల ప్రయాణం. దారి పొడవునా విండ్ మిల్స్ దర్శనమిస్తాయి. రాష్ట్రంలో విద్యుత్తును పుష్కలంగా తయారుచేసేందుకు ఇవి బాగా తోడ్పడుతున్నాయి. రోడ్డు బావుంది. చుట్టూ విశాలమైన ఖాళీ భూములే కాని ఎక్కడా పంట పొలాలు కన్పించకపోవటం గమనార్హం. సోమనాథ్ వెళుతూ మధ్యలో గాంధీజీ జన్మస్థలమైన పోర్బందరు చూసేం.
ఇక్కడ బాపూ పుట్టిన భవంతిని ‘కృతి మందిర్’ అని అంటారు. దీనిని కొద్ది మార్పుచేర్పులతో అతి భద్రంగా సంరక్షిస్తున్నారు. గాంధీ జన్మించిన గదిలో ఆయన పుట్టిన స్థలంలో ఒక స్వస్తిక్ గుర్తు పెట్టబడి ఉంది. విశాలమైన రెండు అంతస్థుల భవనం అది. బాపు చదువుకున్న గది, ఇప్పటిలా అరుగులు, అల్మరలతో సౌకర్యవంతంగా ఉన్నవంట గది, అతిథులకోసం ఉన్నగదులు, ఇలా అనేక గదులతో ఉన్న చాలా పెద్ద భవంతి అది. వెనుక వైపు సందర్శకులకోసం మరుగుదొడ్లు, మంచి నీటి సౌకర్యం ఉన్నాయి. ఆ పరిసరాల్ని నిరంతరం శుభ్రపరుస్తూ అక్కడ ఇద్దరు ముగ్గురు యువకులు, స్వచ్చంద సేవకులు కాబోలు కనిపించారు. ఆ భవనాన్ని ఆనుకునే వెనుక వీధిలో కస్తూర్బా తల్లిదండ్రుల ఇల్లు ఉంది. ఆవిడ పుట్టిన గదిని, ఆ భవంతిని శుభ్రంగా సంరక్షిస్తున్నారు. అది కూడా అన్ని సౌకర్యాలతో, అనేక గదులున్న రెండు అంతస్థుల భవంతి .
విజిటర్స్ బుక్…
View original post 1,078 more words