ఉచితం – వెలకట్టలేనిది! – బడి బయటి పాఠాలు

* * *                                                                  కొందరు పిల్లలు ప్రైవేటు స్కూళ్లనుంచి గవర్నమెంటు స్కూళ్లకి మారారు. నాకు సంతోషమనిపించింది. దానికి కారణముంది. సాయంకాలం క్లాసులకి వచ్చేపిల్లలందరికీ ఆర్థికపరమైన ఇబ్బందులున్నాయి. ముఖ్యంగా, తల్లిదండ్రులిద్దరూ పనులకి వెళ్లినా నిత్యం సమస్యలతో నలుగు తుండటం చూస్తున్నాను. క్రితం సంవత్సరం ప్రైవేట్ స్కూల్లో చదివే హారిక, ఆమె చెల్లెలు హరీష మొదటి టర్మ్ అయినతర్వాత స్కూలుకి వెళ్లటం మానేసారు. సాయంత్రాలు క్లాసుకి కూడా రావటం మానేసారు. ఎప్పుడూ ఆటల్లో మునిగిపోయి కనిపించేవారు. ఎందుకు …

Continue reading ఉచితం – వెలకట్టలేనిది! – బడి బయటి పాఠాలు

మా నాయన బాలయ్య – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Nov. 2021

* * *                                                      పుస్తకం అంటే మంచి మిత్రుడుగా చెబుతాం. ఒక పుస్తకం చదివినపుడు కొత్త ఎరుకని కలిగి, కొత్త లోకపు దారులలోకి ప్రయాణించటం పుస్తకాన్ని ప్రేమించేవారందరికీ అనుభవమే. ఈ పుస్తకం చెప్పే కబుర్లు సాధారణమైనవి కావు. సమాజపు అంచుల్లో జీవించిన, ఇంకా జీవిస్తున్న వారి కష్టసుఖాలు, మంచి చెడులు మన కళ్ల ముందుకు తెస్తుంది. సమాజపు పైస్థాయి జీవితానుభవాలు మాత్రమే తెలిసినవారికి ఈ రకమైన జీవితాల్లో ఉన్న వ్యథ, పోరాటం చెబుతుంది. ఈ …

Continue reading మా నాయన బాలయ్య – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Nov. 2021

అనుభవైకవేద్యం – ప్రతిలిపి, Apr. 2021

* * *                                                         “సౌమ్యా” అన్న కేక వినిపించి, “అదిగో అమ్మ పిలుస్తోంది. ఇంక వెళ్తాను” అంటూ అయిష్టంగానే లిఫ్ట్ దగ్గరకి పరుగెత్తింది సౌమ్య. స్కూల్ బస్ దిగి స్నేహితులతో కాస్సేపు కబుర్లు చెప్పటం సౌమ్యకి అలవాటే. పిలవకపోతే అలా గంటలు గడిచిపోతాయి. రెండు కిలోమీటర్ల దూరమైనాలేని స్కూల్ కి సైకిల్ మీద వెళ్లమంటే స్నేహితులతో బస్ లోనే వెళ్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మెట్లెక్కి రాదు. భార్గవికి కూతురు గురించిన ఈ చిన్న విషయాలే …

Continue reading అనుభవైకవేద్యం – ప్రతిలిపి, Apr. 2021