రేసిస్ట్ – సారంగ వెబ్ మ్యాగజైన్, 15 Mar. 2023

 * * * “అరె, నేను ఏమన్నానండీ. అంత సీరియస్ అవుతారెందుకు?” సుజిత్ తేలిగ్గా నవ్వబోయాడు. “చెప్పానుకదా, నన్ను పేరుతోనే ప్రస్తావించండి. అంతే.” మల్లిక గొంతులోని తీవ్రతకి సుజిత్ కూడా అంతే తీవ్రంగా అన్నాడు. “మేడమ్, మనం చిన్నప్పుడు భాష నేర్చుకుంటూ నామవాచకాలు, సర్వనామాలు అంటూ నేర్చుకున్నాం. ప్రతిసారీ పేరు చెప్పక్కర్లేకుండా సర్వనామాల్ని వాడతాం. నేను అదే చేసాను ఇప్పుడు. అందులో అంత తప్పు ఏముంది?’ “తప్పొప్పుల గురించి నేను మాట్లాడటం లేదు. నా విషయం వచ్చినప్పుడు …

Continue reading రేసిస్ట్ – సారంగ వెబ్ మ్యాగజైన్, 15 Mar. 2023

ఊర్వశి – పుస్తక సమీక్ష, పుస్తకం. నెట్, Mar. 2023

* * *                                                                                 కాళిదాసు నాటకానికి నవలారూపం                                                                                                      శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి                                                            భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచనల గురించి విననివారుండరు. ముఖ్యంగా దృశ్యరూపంలో రసజ్ఞులను అలరించేందుకు రచించిన అద్భుతమైన నాటకాలు గురించి విన్నప్పటికీ వాటిని సంస్కృతంలో చదవి ఆస్వాదించగలిగే పాఠకులు అరుదే. సాహిత్యాభిమానుల కోసం మాళవికాగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం ఇప్పటికే తెలుగులో నవలారూపంలోకి తీసుకొచ్చిన అనల్ప ప్రచురణకర్తలు విక్రమోర్వశీయం నాటకానికి కూడా తెలుగు నవలారూపం ఇవ్వాలని సంకల్పించారు. …

Continue reading ఊర్వశి – పుస్తక సమీక్ష, పుస్తకం. నెట్, Mar. 2023

మరపురాని మనీషి – పుస్తక సమీక్ష, పుస్తకం.నెట్, 9 Feb. 2023

* * *                                                 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు                                                                  తిరుమల రామచంద్ర ప్రకృతి అందించిన భౌగోళికమైన ప్రత్యేకతలతో ఒక ప్రాంతం సహజంగా రూపుదిద్దుకుంటుంది. భౌతికమైన అసిత్వాన్ని దాటి తనదైన భాషా, సంస్కృతుల్నిపెంపొందించుకుని క్రమక్రమంగా ఒక విశిష్టమైన గుర్తింపును తెచ్చుకుంటుంది. ఆ విశిష్టతకు కారణమైన ఎందరో మహానుభావుల కృషి, త్యాగాలు ఒక అపురూపమైన వారసత్వాన్ని భావితరాలకి అందిస్తాయి.   ఇప్పుడు మనం మాట్లాడుకునే పుస్తకం ఇలాటి అపురూపమైన …

Continue reading మరపురాని మనీషి – పుస్తక సమీక్ష, పుస్తకం.నెట్, 9 Feb. 2023

బడి బయటి పాఠాలు, తొమ్మిదవ ఎపిసోడ్ – ఉచితం – వెలకట్టలేనిది – ఆడియో కథ

* * * మనం బడిలో పాఠాలు నేర్చుకుంటాం కదూ. బడి బయట కూడా పాఠాలు నేర్చుకుంటాం. కాకపోతే బడిలో మనకు తెలిసి పాఠాలు నేర్చుకుంటాం. నిజం! బడి బయట నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలు. వీటిని బడిలో నేర్పరు. మన జీవితాన్ని అందంగా, బయట ప్రపంచానికి, మనకి కూడా ఉపయోగకరంగా మలచుకోవాలంటే ఈ పాఠాలు అవసరం. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటాయి . ఒక …

Continue reading బడి బయటి పాఠాలు, తొమ్మిదవ ఎపిసోడ్ – ఉచితం – వెలకట్టలేనిది – ఆడియో కథ

ప్రియ శరణార్థీ! నా జీవితం ఇలా నడవనీ…- కవిత్వం (అనువాదం) – సారంగ వెబ్ మ్యాగజైన్, 15 Dec.2022

* * *   నన్నల్లుకున్న వెచ్చని కార్డిగన్, మెత్తని నా అరచేతుల మధ్య పొగలు కక్కే ‘లికరస్’ టీ……… పౌర హక్కుల్ని పగటికలలుగా కనేందుకు ఈ నేపథ్యం సహజంగా లేదూ? నువ్వూ, నేనూ పంచుకున్న ఆకాశం కప్పు క్రింద, నా గది కిటికీ లో నీ వైపు నుంచి తళుక్కుమంటూ నడిచొస్తున్న నక్షత్రాలు! కానీ, దైన్యంతో అలసిన నీ ముఖంలోని కన్నీరు మాత్రం ఈ నేల మీద అగోచరంగానే ఉంది. తల మీద కప్పుకోసం నువ్వు పేర్చుకుంటున్న …

Continue reading ప్రియ శరణార్థీ! నా జీవితం ఇలా నడవనీ…- కవిత్వం (అనువాదం) – సారంగ వెబ్ మ్యాగజైన్, 15 Dec.2022

గూడెం – ఒక దశాబ్దకాల పరిచయం! – వ్యాసం – సంచిక వెబ్ మ్యాగజైన్, 18 Dec.2022

  * * *                   2023! కొత్త సంవత్సరం ఒక్క నెల దూరంలో ఉంది. ఎప్పటిలాగే కొత్త సంవత్సరం అంటే ఒక ఉత్సాహం. రేపటిలోకి తొంగిచూసేద్దామన్న ఒక తొందర మనసంతా. ఒక దశాబ్ద కాలం ఎలా గడిచిపోయిందో అని ఆలోచించుకుంటే నా జీవితంలోనే ఒక అతి ముఖ్యమైన సందర్భం ఇప్పుడే, ఇక్కడే జరిగిందని తోచి భలే సంతోషం వేసింది. వెంటనే అదంతా రాసి పెట్టుకోవాలన్న ఆలోచనే ఈ పోస్ట్ ... అవును, ఒక పదేళ్ల క్రితం …

Continue reading గూడెం – ఒక దశాబ్దకాల పరిచయం! – వ్యాసం – సంచిక వెబ్ మ్యాగజైన్, 18 Dec.2022

 అరకు లోయ – ఆదివాసీల స్వర్గం! – యాత్రా సాహిత్యం – సంచిక వెబ్ మ్యాగజైన్, 14Aug.2022

                   * * *                                       విశాఖ నుంచి డ్రైవ్ చేసుకుంటూ అరకు బయలుదేరేం. ప్రయాణమంతా ఆహ్లాదకరమైన దారివెంట నడిచింది. ఎన్నాళ్లుగానో కలలుగన్న అరకులోయ చూడటం ఇప్పటికి కుదిరింది. ప్రకృతి చూపును తిప్పుకోనివ్వదు. ఒక హాయి ఏదో మనల్ని చుట్టేస్తుంది. రంగులు, కొండలు, లోయలు, పచ్చని చెట్లలోంచి వినవచ్చే కమ్మని రాగాలు, ఆకాశం నుంచి స్వేచ్ఛగా దూసుకొచ్చే సూర్యకాంతులు... ఎన్నింటినని కాచుకోగలం?! ప్రకృతిమధ్య మనం ఎంత చిన్నవాళ్లమో మరీమరీ అర్థమవుతుంది. ఏదో తెలియని ఒక తాత్త్వికత మనలోకి …

Continue reading  అరకు లోయ – ఆదివాసీల స్వర్గం! – యాత్రా సాహిత్యం – సంచిక వెబ్ మ్యాగజైన్, 14Aug.2022

తమిళనాట తెలుగునుడి పల్లెకతలు – 1.కుటుంబ కథలు – పుస్తకం.నెట్, 15 Dec 2022

* * *                                              సేకరణ డా. సగిలి సుధారాణి                                    భూగోళమంతా నైసర్గికంగా, రాజకీయంగా, సంస్కృతీ పరంగా, భాషాపరంగా అనేక సమాజాలుగా విడిపోయి చాలాకాలమే అయింది. అయితే ఈ విభజనలు మనుషిని కట్టి పడెయ్యలేకపోయాయి. ఉపాధి, జీవికలకోసమో, వ్యాపార వ్యవహారాల కోసమో మనిషి వలసదారి పడుతూనే ఉన్నాడు. స్వంత ఊరిని, మనుషుల్ని వదిలి వెళ్లినా తనదైన అస్తిత్వానికి పునాదులైన భాషా సంస్కృతుల్ని మాత్రం తన స్వంతమని అక్కున చేర్చుకునే ఉన్నాడు. తరం తర్వాత తరానికి …

Continue reading తమిళనాట తెలుగునుడి పల్లెకతలు – 1.కుటుంబ కథలు – పుస్తకం.నెట్, 15 Dec 2022

అసింట – ఒక అభిప్రాయం – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, ౦9 Dec. 22

* * *                                                                                                  స్పందించే హృదయానికి ఒక సన్నివేశమో, ఒక సందర్భమో, ఒక అనుభవమో ఏది ఎదురైనా ఉన్నపాటున తనను తాను వ్యక్తీకరించుకోకుండా నిలవలేదు. ఆనందమో, విషాదమో, మరే భావోద్వేగమైనా సరే అభివ్యక్తికి తనకు తెలిసిన భాషను వెతుక్కోవలసిందే. ఈ అవసరం కవికి తప్పనిసరవుతుంది.  తీవ్రమైన భావావేశంతో కవి వర్షాకాలపు మేఘమై, జడివానై కురవాల్సిందే.                                                                    అయితే దీనికంతకూ కావలసింది ముందుగా ఒక స్పందన. ఒక అనుభూతి. ఒక ఆస్వాదన. ఒక చెమర్చే …

Continue reading అసింట – ఒక అభిప్రాయం – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, ౦9 Dec. 22

బడి బయటి పాఠాలు, ఎనిమిదవ ఎపిసోడ్ – కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020 – ఆడియో కథ

* * * మనం బడిలో పాఠాలు నేర్చుకుంటాం కదూ. బడి బయట కూడా పాఠాలు నేర్చుకుంటాం. కాకపోతే బడిలో మనకు తెలిసి పాఠాలు నేర్చుకుంటాం. నిజం! బడి బయట నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలు. వీటిని బడిలో నేర్పరు. మన జీవితాన్ని అందంగా, బయట ప్రపంచానికి, మనకి కూడా ఉపయోగకరంగా మలచుకోవాలంటే ఈ పాఠాలు అవసరం. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటాయి . ఒక …

Continue reading బడి బయటి పాఠాలు, ఎనిమిదవ ఎపిసోడ్ – కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020 – ఆడియో కథ