బొట్టెట్టి – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Feb, 2021

     * * *                                ‘’బొట్టెట్టి’’ కథల పుస్తకం రచయిత్రి చంద్రలతగారికి పరిచయం అక్కరలేదు. తానా వారు 1997లో మొదటిసారిగా పెట్టిన నవలల పోటీలో ఆమె రాసిన ‘’రేగడివిత్తులు’’ నవల బహుమతి పొందిందన్నది ఆమె పేరు పరిచయమున్న అందరికీ తెలిసున్న విషయం. ఆమె నడుపుతున్న ‘’ప్రభవ’’ పిల్లల ప్రపంచానికి ఒక కానుక. పిల్లల సహజ కుతూహలాల్ని అర్థం చేసుకుంటూ ప్రకృతి ఒడిలో వారి ఎదుగుదలకు పునాదులు వేస్తున్న సరికొత్త ప్రపంచం అది. బొట్టెట్టి కథా సంపుటిలో పదమూడు కథలున్నాయి. …

Continue reading బొట్టెట్టి – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Feb, 2021

బిట్టు- కవిత్వం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Sep, 2017

ద్వైతాద్వైతం

* * *

బిట్టు వాళ్లు ఢిల్లీలో ఉంటారు. వాడికి తొమ్మిదేళ్ళు. వాళ్ళ అమ్మ సునంద ఒక ఐటీ కంపెనీలో పని చేస్తుంది; నాన్న శివ బ్యాంకులో.

బిట్టు మరీ పసివాడుగా ఉన్నప్పుడంతా వాడి అమ్మమ్మ, నానమ్మ వంతులు వేసుకుని వచ్చి ఉండేవాళ్ళు. కాస్త ఊహ తెలిసాక వాణ్ణి ‘క్రెష్’ లో అలవాటు చేసేరు అమ్మానాన్నలు.

“తీరికలేని ఉద్యోగాలలో పడి, పిల్లవాణ్ని సరిగా పెంచుకోలేక పోతున్నామేమో” అని ఒక్కోసారి బాధ పడుతుంటారు వాళ్ళు. అట్లాంటప్పుడే, సాధారణంగా తల్లులు ఉద్యోగం మానేసేది! కానీ అట్లా ఉద్యోగం మానేసి పిల్లవాణ్ణి చూసుకుందామని అనుకోలేదు సునంద. ‘చదువుకున్న చదువుకు సార్థకత ఉండాలంటే తను ఉద్యోగం చేయాల్సిందే’ అని ఆమె నమ్మేది. “ఆడవాళ్ళు ఆర్థికంగా స్వతంత్రంగా ఉండాలి” అని ఆమె ఎప్పుడూ చెబుతుండేది.

బిట్టు ఐదో క్లాసుకొచ్చాడు. చుట్టూ ఉన్న ప్రపంచాన్ని చూడటమంటే వాడికి చాలా ఇష్టం. అందరు పిల్లల్లాగా వాడు నిద్ర లేచేందుకు మారాం చేసేవాడు కాదు;. అమ్మ లేపగానే ఛెంగున లేచేవాడు; నవ్వు ముఖంతో మంచం దిగేవాడు. చక్కగా బడికి రెడీ అయిపోయేవాడు. అందరితోటీ మాట్లాడాలనీ, అవసరమున్న వారికి సాయం చెయ్యాలనీ ఉత్సాహం వాడికి. కానీ అమ్మ, నాన్న మటుకు వాడిని అతి జాగ్రత్తగా చూసుకునే వాళ్లు. తమ కనుసన్నల్లోంచి వాడిని ఎటూ పోనిచ్చేవాళ్ళు కాదు.

ఆరోజు తను ఆఫీసు నుంచి వస్తూ వస్తూ, క్రెష్‌కి వెళ్ళి బిట్టూని ఇంటికి తీసుకొచ్చింది సునంద. వాడికి పాలు…

View original post 589 more words

కరుణా టీచర్ చెప్పిన ఉపాయం– గూడెం చెప్పిన కథలు – సారంగ Dec, 2015

ద్వైతాద్వైతం

* * *

కరుణా టీచర్ చెప్పిన ఉపాయం

సాయంకాలం క్లాసులకి పెద్ద పిల్లలు క్రమంగా మళ్లీ రావడంమొదలు పెట్టేరు. నాకు సంతోషంగా అనిపించింది. ఇంకా కొందరు రావలసి ఉంది. నాకు తెలుసు. రోజూ అటెండెన్స్ తీసుకుంటూ వాళ్లరాక కోసం ఎదురుచూస్తున్నాను.

ఒక వారం తరువాత క్లాసు అయి ఇంటికి బయలు దేరుతుంటే ఒకతను, ’మేష్టరమ్మగారూ , మీతో మాట్లాడాలి’ అన్నాడు. మిగిలిన పిల్లలు ఆసక్తిగా చూస్తుంటే , వాళ్లని పంపించేసి, చెప్పమన్నాను. ఇతన్ని ముందెప్పుడూ చూసిన జ్ఞాపకం లేదు.

‘ మేష్టరమ్మగారూ, నేను ఇక్కడే గూడెంలోనే ఉండేది. లారీ మీద పని,దేశం మొత్తం తిరుగుతూంటాను. నెలకి ఒకటీ రెండు సార్లు ఇంటికి వస్తావుంటాను. మొన్న మీకు దెబ్బలు తగిలేయంటగా, తెలిసింది. ఎవరో పెద్ద క్లాసు సదూతున్న పిలగాళ్లు ఈ పని సేసేరని సెప్పుకుంటున్నారు. మా ఇంట్లో కూడా ఎన్మిది సదూతున్న పిల్లోడున్నాడు. ఈ పని సేసింది వోడు కానీ అయితే సెప్పండి. మా వోడు మాట వినడం లేదని, అల్లరి ఎక్కువైందని మా ఇంటామె సెబుతోందీ మద్దెన.’

‘ మనం ఇంక ఆ సంగతి మర్చిపోదామండి,’అన్నాను ముందుకు కదులుతూ.

‘ నాకు ఒక్క అవకాశమివ్వండి…

View original post 2,917 more words

అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part I

ద్వైతాద్వైతం

* * *

OLYMPUS DIGITAL CAMERA

ఈ సంవత్సరం కూడా ఎటైనా వెళ్లి రావాలని, ఏదైనా క్రొత్త ప్రదేశం చూడాలని ప్రయాణం పెట్టుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నధర్మశాల చూడాలని ఆశ. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి దలైలామా వచ్చి వెళ్లారు. మా ఆశ మరింత బలపడింది. అంత దూరం వెళ్తున్నాం కదా మరోసారి అమృతసర్ కూడా చూద్దామని ముందుగా అక్కడకి బయలుదేరేం. విజయవాడ నుంచి దిల్లీ వరకూ పొద్దున్న 9 గంటల ఫ్లైట్ పట్టుకుని దిల్లీ చేరేసరికి 11.30 అయింది. మార్చి నెల పగటి ఉష్ణోగ్రతలు గట్టిగా ఉన్నాయని చెబుతున్నా, విశాలమైన విమానాశ్రయంలోంచి బయటకొచ్చి నిలబడేసరికి చల్లని గాలి చురుక్కున తగిలింది.

ఐదారేళ్ల క్రితం అక్కడున్న రోజుల్ని తలుచుకుంటూ స్నేహితులతో కాసేపు గడిపి, సాయంత్రం అమృతసర్ వెళ్లే శతాబ్ది అందుకుందుకు న్యూదిల్లీ స్టేషన్ చేరేం. నగరంలో పెద్దగా మార్పు లేదు. అదే ట్రాఫిక్ జామ్, వాహనాలు చేసే శబ్ద కాలుష్యం దిల్లీ ప్రజల అసహనం గురించి చెబుతూ, అక్కడి పొల్యూషన్ ని మరింత పోగుచేస్తోంది. దేశ రాజధాని వాసులు మిగిలిన దేశంలోని ప్రజల కంటే మరింత  విశిష్టమైన వారు కాబోలు మరి. అక్కడ రోడ్ ట్రాఫిక్ నుండి విముక్తి మాత్రం ఒక్క మెట్రో రైలు ప్రయాణమే. కేజ్రీవాల్ పరిపాలన గుర్తు చేసుకుని చుట్టూ పరికించాను.

న్యూదిల్లీ స్టేషన్ లో చెత్తా చెదారం, అశుభ్రం అలాగే ఉంది. రైల్వే వారు నడుపుతున్న భోజన శాల బయట…

View original post 1,204 more words