శాంతి నిండి, నవ్వుముఖాలు పూసే అందాల కాశ్మీరం గురించి కలలు కనే భారతీయులు దానిని కళ్లముందుకు సాక్షాత్కరించుకుందుకు ఇంకెన్నాళ్లు వేచి ఉండాలో!
* * *
ఈ ఆదివారం హిందూ లో ‘ఆషిష్ కౌల్’ రాసిన ‘ది స్టోన్ పెల్టర్స్’ అనే వ్యాసం చదువుతుంటే ఎన్ని ఆలోచనలో! కాశ్మీరు గురించి ఇక్కడ దక్షిణాదిన ఉన్న మనకి ఏమి తెలుస్తుంది? నిజమే. ఈ వ్యాసంలో కొన్ని వాక్యాలు మనసుని గాయపరుస్తున్నాయి. అనంతనాగ్ ప్రాంతాన్ని ఇస్లామాబాద్ గా అక్కడి విధ్వంసకారులు పిలుస్తుండటం, స్కూళ్లు, కాలేజీలు లేకుండా చదువులు ప్రస్తావనే లేని ఎదుగుతున్న పిల్లలు, వాళ్లు ప్రతిరోజూ తెలవారుతూనే ఇంటినుండి బయటకొచ్చి రోడ్లమీద రాళ్లు విసరటాన్ని విధిగా ఆచరించవలసిన చర్యగా అక్కడ సాయుధులైన ప్రభుత్వ వ్యతిరేకవాదుల కనుసన్నల్లో భయం భయంగా బ్రతకటం……….రాత్రి నిద్రకి మళ్లుతూ, రేపు తెల్లవారకూడదని, అమాయకులకు చీకటిలోనే శాంతి, క్షేమం ఉన్నాయని అక్కడివారు నిత్యమూ కోరుకోవటం, అవన్నీ ఈ వ్యాసకర్తకి చెప్పుకోవటం………
ఏమి జరుగుతోంది? ఎవరి స్వార్థం ఈ అమాయకుల జీవితాల్ని చిన్నాభిన్నం చేస్తోంది? వాళ్లదైన జీవితాన్ని జీవించనీయకుండా వారి హక్కుల్ని లాక్కునే అధికారం ఎవరిది? కాశ్మీరీ పండిట్లు తమ ఇళ్లు, వాకిళ్లు వదులుకుని దేశం నలుమూలలా తమవి కాని ప్రాంతాల్లో అపరిచితుల్లా, అక్కడి స్థానికుల అనుమాన దృక్కుల మధ్య అపరాధుల్లా నిరంతరం జీవిక కోసం వెతుకులాడుతూ, పేదరికం, అభద్రతల మధ్య జీవనాన్ని కొనసాగిస్తూ ……………..ఏమిటిదంతా?
50 సంవత్సరాలు పైబడిన ఒక ముస్లిమ్ సోదరుడు తన చిన్నతనపు రోజులు తలుచుకుంటూ హిందువులతో కలిసి ఈద్, దీపావళి పండుగలను ఒకేలాటి ఉత్సాహంతో చేసుకోవటం, ఒకే పళ్లెంలో కలిసి తినటం…
View original post 434 more words