ఢిల్లీ కబుర్లు – ఎనిమిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Dec. 2018

ద్వైతాద్వైతం

* * *

జరిగిన కథ: ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరికి వచ్చాడు. అక్కడ దావీద్, చిట్టి వాడికి స్నేహితులయ్యారు. తాతయ్య దావీద్‌కు చదువు చెప్పిస్తున్నారు.
రచన: అనురాధ నాదెళ్ళ, పోరంకి, కృష్ణాజిల్లా.

తాతమ్మకి నిద్ర వస్తున్నట్టు ఉంది, అయినా కబుర్లు వినాలన్న ఆశతో, ‘ఓ కప్పు కాఫీ ఇవ్వవే మణీ’ అంటూ కోడల్ని పురమాయించింది. ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాల గురించి బిట్టు అనర్గళంగా చెబుతూంటే నోళ్ళు తెరిచి వింటూ ఉండి పోయారు పిల్లలు. తాతమ్మకి కాఫీ, దాంతో పాటు పిల్లలకి కాసిని జంతికలు, రవ్వలడ్లు తెచ్చిపెట్టింది అమ్మమ్మ. బిట్టు ఉత్సాహంగా తన ఊరి విశేషాలు చెబుతున్నాడు. వాడి మాటలు వింటూ “వీడు వచ్చినప్పుడు తెలుగు రానట్లు ఎట్లా ఉన్నాడు, ఈ కొద్ది రోజుల్లోనే ఎంత మారిపోయాడు?! మాతృభాషకు నిజంగానే మనసు లోపల గట్టి ముద్ర ఉంటుందేమో, కాలం ప్రభావం వల్ల ఎంత మరుగు పడ్డా, తగిన సమయం రాగానే అది చకాలున బయటికి వచ్చేస్తుందేమో” అని ఆలోచనలో పడింది అమ్మమ్మ.

ఆలోగా బిట్టు ‘ఇందిరా గాంధీ మ్యూజియం’ గురించి చెప్పసాగాడు: ప్రియదర్శిని చిన్నప్పటి కథల దగ్గరినుండి, ఆవిడ పెద్దయి, హత్యకి గురైన రోజు వరకు అనేక సంగతులు చెప్పాడు వాడు. “ఆవిడ హత్య చేయబడినప్పుడు వేసుకున్న చీరను అలాగే రక్తపు మరకలతో మ్యూజియంలో ఉంచారు తెలుసా?” అని వాడు అడిగితే చిట్టి, దావీదు ఆశ్చర్యంతో నోళ్ళు తెరిచారు. “ఆవిడ…

View original post 744 more words

బిట్టు – దావీదు విచారం – ఏడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం July, 2018

ద్వైతాద్వైతం

* * *

జరిగిన కథ: బిట్టు ఢిల్లీలో ఉంటాడు వాళ్ల అమ్మా నాన్నలతో పాటు. సెలవల్లో వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరికి వచ్చాడు. ఇక్కడ తెలుగు నేర్చుకున్నాడు; దావీద్, చిట్టిలతో స్నేహం చేసాడు; ఆ పిల్లల ఇళ్ళలోని కష్టసుఖాలను తెలుసుకుంటూ ఎదుగుతున్నాడు…
రచన : అనురాధ నాదెళ్ళ, పోరంకి, కృష్ణాజిల్లా.
చిత్రాలు: సుహాసిని, 7వ తరగతి, రాధ స్కూల్‌ ఆఫ్‌ లర్నింగ్‌, అనంతపురం

బిట్టు వచ్చి ఇన్ని రోజులైనా వాడు అమ్మ-నాన్నల గురించి పెద్దగా అడగటం లేదు. నాలుగు రోజులకు ఒకసారి తాతయ్య వాడి చేత అమ్మ-నాన్నలకు ఫోను చేయిస్తున్నారు. ఆ నాలుగు రోజుల్లో జరిగిన కబుర్లన్నీ వరస పెట్టి వాళ్లకి చెప్పేస్తూ ఉంటాడు బిట్టు. ‘ఇన్ని కబుర్లు ఎప్పుడు నేర్చుకున్నాడమ్మా వీడు? ఇంట్లో ఎప్పుడూ ఇంతగా మాట్లాడడు?!’ అన్నది సునంద, తల్లితో.

‘అక్కడ ఇంట్లో ఎవరుంటారమ్మా, వాడి కబుర్లు వినేందుకు? ఇక్కడైతే నలుగురితో కలిసి మెలిసి తిరుగుతాడు. అసలు నీకు తెలీదుగానీ, వాడి పొట్టనిండా కబుర్లే! తాతమ్మకి కొత్త కొత్త కబుర్లు చెబుతాడు; ఢిల్లీ వింతలన్నీ ఇక్కడ వాడి స్నేహితులకి చెబుతాడు..’

తల్లి మాటలు వింటుంటే సునందకి సంతోషం కంటే ఎక్కువ దిగులుగా అనిపించింది- ‘ఇక్కడ తను, శివ ఇద్దరూ ఎప్పుడూ బిజీగా ఉంటారు. వాడు చెప్పేది ఇద్దరూ సరిగ్గా వినరు. ఇంట్లో వాడికి ఒక్క తోడు కూడా లేకుండా ఒంటరిగా పెంచుతున్నారు. ఏదో ఈ సెలవల పుణ్యమా అని…

View original post 738 more words

బిట్టు – తాతయ్య డ్రగ్స్ – ఆరవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Apr, 2018

ద్వైతాద్వైతం

* * *

నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు- అందుకని చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి వాడి స్నేహితులు. ఇక చదవండి…

 
 

 

* * *

అర్థ రాత్రి అవుతుండగా బిట్టుకి మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే అందరూ నిద్రలో ఉన్నారు. వరండాలోకి వెళ్లి చప్పుడు చేయకుండా చూసాడు… రెయిన్బో కనిపించలేదు! “ఏమయ్యాడు వాడు?” అని ఒక్క నిముషం ఖంగారు పడినా, లోపలికి వచ్చి చూస్తే తాతయ్య మంచం క్రింద మరింత ముడుచుకుని పడుకుని ఉన్నాడు వాడు.

This image has an empty alt attribute; its file name is image.png

ఇంతలో ఎవరో దగ్గిన శబ్దం వినిపించింది బిట్టుకి. అందరివైపు చూసాడు. ఎవరూ కదల్లేదు.

తాతమ్మ గదిలోకి వెళ్లి చూసి వచ్చాడు. ఆవిడ నిద్రపోతోంది.. అంతలోనే మళ్ళీ శబ్దం వచ్చింది…బయట వాన శబ్దంలోంచే.. నిద్రపోతున్నవాళ్లకి వినపడకపోయినా, మెల-కువగా ఉన్న బిట్టుకి తెలుస్తోంది.

శబ్దం ఇంటి ప్రక్కన ఉన్న సందులోంచి వస్తున్నట్లుంది… “ఎవరై ఉంటారు? ఏమి చెయ్యాలి?” అని ఆలోచించాడు. “తాతయ్యని కానీ, అమ్మమ్మని కానీ లేపాలా? తనే చూడాలా? లేక దావీదుని లేపాలా?” అని తేల్చుకోకుండానే టార్చి లైటు వేసి వాకిలి ముందు, పెరటి వైపు చూసాడు. ఎవరూ కనిపించలేదు.

“సందులో సన్ షేడ్ లో ఎవరైనా వచ్చి నిలబడ్డారా? అక్కడ చూడాలంటే తలుపులు…

View original post 555 more words

బిట్టు-మట్టివాసన – ఐదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Feb, 2018

ద్వైతాద్వైతం

* * *

నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు కదా, చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఇక ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి. ‘వాళ్ళు చదువుకోవాలి’ అని వీరబాబు కోరిక. ఇక చదవండి..

మొదటి రోజు దావీదు అయిష్టంగానే వచ్చాడు. వాడు వీరబాబుతో చెప్పాడుట, ‘నేను సైకిల్ పని బాగా నేర్చుకుని, పెద్ద కొట్టు పెట్టుకుంటాను, చదువొద్దు’ అని.
‘కానీ చదువు ఎందుకు అవసరం’ అని బిట్టు వాళ్ల తాతయ్య వివరంగా చెప్పారు అందరికీ: “ఏ పని చేసినా కొంచెం చదువు, కొంచెం ఆలోచన ముఖ్యం. ఆ కొంచెం చదువు కూడా లేకపోతే ఆలోచించే శక్తి సరిగ్గా రాదు. అంతేకాదు, ఈ రోజుల్లో చదువుకుంటే మంచి ఉద్యోగం వస్తుంది; జీవితం బావుంటుంది. మరొకరికి సాయం చేసే అవకాశం ఉంటుంది కూడా” అని. పిల్లలు ముగ్గురూ బుద్ధిగా విన్నారు.

తాతయ్య చెబుతుంటే మెల్ల మెల్లగా తెలుగు అక్షరాలు నేర్చుకోవటం మొదలెట్టారు బిట్టు, దావీదు. అప్పటికే చిట్టికి తెలుగు చదవటం, రాయటం వచ్చు బాగానే. అందుకని ఇప్పుడు తను వీళ్ళతోబాటు కూర్చొని ఇంగ్లీషు అక్షరాలు, హిందీ అక్షరాలు మొదలెట్టింది.

కొన్ని రోజులు గడిచే సరికే చాలా మార్పు వచ్చింది. పిల్లలిద్దరికీ కూడా చిన్న చిన్న పదాలు చదవటం వస్తోంది ఇప్పుడు. తాతయ్య రోజూ వాళ్లకి…

View original post 898 more words

తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018

ద్వైతాద్వైతం

* * *

ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. అక్కడ తాతయ్య వాళ్ళ అమ్మ- ‘తాతమ్మ’ కూడా ఉంది. బిట్టుకు తాతమ్మని చూస్తే ఆశ్చర్యం. మరి తాతమ్మ ఎప్పుడూ పళ్ళు తింటుంది!

తాతమ్మ కబుర్లు చెబుతుంది, కానీ బిట్టుకి మటుకు ఆ కబుర్లు అన్నీ అర్థం కావు.

వాడికి చాలా అనుమానాలు: ‘ఆవిడ తాతయ్య దగ్గర చంటిపిల్లలా ప్రవర్తిస్తుందేమిటి? తాతయ్యకి అమ్మ కదా, అయినా అన్ని విషయాలు తాతయ్యనే అడుగుతుంది ఎందుకు? చేతికర్ర ఉన్నది కదా, అయినా తాతయ్య చెయ్యి పట్టుకుని నడుస్తుంది ఎందుకు?

చేతికర్ర ఎప్పుడూ వదలదేమి? చిన్నపిల్లలాగా తప్పటడుగులు వేస్తుంది ఎందుకనో? ఒక్క పన్నూ లేదు; అయినా ఎప్పుడూ నోరు కదుపుతూనే ఉంటుంది- ఏం తింటుంది, అస్తమానూ?’ అని బిట్టుకి ప్రశ్నలు.

అయినా తాతమ్మని అడగలేదు. ‘అడిగితే ఏమనుకుంటుందో!’ అని అనుమానపడ్డాడు వాడు. ‘చిన్నప్పుడు చాలా ఎక్కువ స్వీట్లు తినేసి ఉంటుంది! అమ్మ చెబుతుందిగా, ‘స్వీట్లు ఎక్కువ తింటే పళ్లు పాడైపోతై; ఊడిపోతై’ అని; బహుశ: తాతమ్మకి ఎవ్వరూ చెప్పలేదేమో, ఆ సంగతి!’

ఒక రోజు తాతమ్మ మరీ వింతగా చేసింది. “నాకు అన్నం తినాలని లేదురా, నిద్రవస్తోంది” అని చెప్పేసి, అట్లాగే పడుకొని నిద్రపోయింది. అమ్మమ్మ వచ్చి ఎన్నిసార్లు లేపినా లేవదు! “నన్ను లేపకే మణీ! నాకు ఆకలి వేసినప్పుడు లేచి తింటాను. మీరంతా తినెయ్యండి!’ అనేసి ఒత్తిగిలి, మరోప్రక్కకి తిరిగి, పడుకుంది.

View original post 508 more words

అమ్మమ్మ ఊళ్లో దావీదు (పార్ట్ – 2) – బిట్టు కథలు – మూడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం – Dec, 2017

ద్వైతాద్వైతం

* * *

జరిగిన కథ : ఢిల్లీ లో ఉండే బిట్టు, వాళ్ల అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. దావీదు అనే పిల్లాడు సైకిల్ రిపేరు చేసి, తాతయ్య దగ్గర ఎక్కువ డబ్బులు తీసుకున్నాడు. దాంతో వాడు బిట్టుకి శత్రువైపోయాడు. కానీ అమ్మమ్మకి వాడి గురించి తెలీదు.. ఇక చదవండి, ‘..దావీదు”- రెండో భాగం. “ఆ రోజు తాతయ్యతో వీడు ఎట్లా మాట్లాడాడో తెలుసా, నీకు అసలు?” అని అమ్మమ్మని కోపంగా అడుగుదామనుకు-న్నాడు బిట్టూ. కానీ ‘ఎవరి గురించైనా అట్లా చెడ్డగా చెప్పటం బావుండద’ని ఊరుకున్నాడు.

‘అయినా అమ్మమ్మా, బట్టలు ఉతికేందుకు వాషింగ్ మిషన్ కొనుక్కోవచ్చుగా, వీళ్లతో చేయించుకునేదెందుకు?’ అన్నాడు, అమ్మమ్మకి సులువు చెబుతూ.

‘ఎందుకురా, మనకు ఎన్నో ఏళ్లుగా బట్టలు కమలమ్మే ఉతుకుతోంది. మనం మిషన్ కొనుక్కున్నామంటే మరి ఆవిడ చేతిలో పని పోతుంది కదా!

అయినా, నలుగురూ ఇంటికొచ్చి వెళ్తూంటే ఇల్లంతా సందడిగా బావుంటుంది- ఒట్టి మిషన్లతో ఏం బావుంటుందిరా? మీకైతే, మరి సిటీలో బట్టలు ఉతికే మనుషులు కావాలన్నా దొరకరు; దొరికినా ఇంట్లో కూర్చుని ఉతికించుకునే తీరిక కూడా ఎవరికీ ఉండదు- అందరూ ఉద్యోగాలకి పరుగెడతారు కదా; మరి ఇక్కడైతే అట్లాంటి హడావిడి ఉండదు: చాలామంది నాలాగే బట్టలు ఉతికించుకుంటారు’ అంది అమ్మమ్మ.

“నలుగురూ ఇంటికి వచ్చి వెళ్తుంటే ఇల్లంతా సందడిగా బావుంటుంది” అని అమ్మమ్మ చెప్పింది బిట్టుకి కూడా నచ్చింది..

“నిజమే..దిల్లీలో అయితే ఎవరి ఇంటికి…

View original post 876 more words

దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2019

ద్వైతాద్వైతం

* * *

డిసెంబరు నెల ఆఖరి రోజులు. దిల్లీ చలి గట్టిగానే ఉంది. స్వెట్టర్లు వగైరాలన్నీ మంచి వాడకంలో ఉన్నాయి. తెల్లవారితే హరిద్వార్, రిషికేశ్ ప్రయాణం పెట్టుకున్నాను. స్కూలు సెలవులు. ఇంట్లో చేసేదేమీ లేదు, నాలుగు నెలలుగా ఎందుకో హరిద్వార్ వైపు మళ్లింది మనసు. మధ్య మధ్య సెలవులు రాకపోలేదు. మురళికి తీరిక లేని ఉద్యోగం. ఆదివారం ఒక్కరోజు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వద్దాం అంటే వినడు. బాస్‌కి ఇష్టం ఉండదు, సిటీ దాటి వెళితే… అంటాడు. పనిని పూజించటం నాకూ ఇష్టమే. కానీ జీవితమంటే జీవికకోసం చేసే పనొక్కటేనా?

విసుగొచ్చి రమ్మని అడగటం మానేసేను. హాయిగా టూర్స్ అండ్ ట్రావెల్స్‌లో నా ఒక్కదానికి టికెట్ బుక్ చేసుకున్నాను. ఎవరైనా తోడొస్తే వెళ్ళాలని అనుకోలేదు. వస్తే మురళీ, నేను. లేదా ఇలాటి ప్రయాణం నాకు కొత్త కాదు.

ముందురాత్రి ఆఫీసు నుండి వస్తూనే అయిష్టాన్ని మళ్లీ ప్రకటించాడు.

“నిమ్మీ, నువ్వు అంత అర్జెంటుగా ఒక్కదానివీ ఇప్పుడు హరిద్వార్ వెళ్లాలా?” రొట్టెలు చేస్తున్న నా వెనకాల వచ్చి సీరియస్‌గా అడిగాడు. ‘వెళ్ళాలనే కదూ… అతని అభ్యంతరం ఏమిటో!’

“నాకు కొంచెం పనితీరుబడి అయినపుడు వెళ్దాం అన్నాను కదా. ఒక్కదానివీ, ఆ ట్రావెల్స్‌లో వెళ్లాలా? రోజంతా అపరిచితుల మధ్య నీ యాత్రని ఏం ఎంజాయ్ చెయ్యగలవు?” అసహనంగా అడిగాడు.

“అదేమిటి, అపరిచితులేమిటి? ఒక్క పలకరింపుతో స్నేహితులు కారా?”

“అహా, నీకు స్నేహితులు కాని వాళ్లు…

View original post 2,030 more words