భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part VI

* * * Continued from Part V ఈ రాజభవంతులు, కోటలు చూస్తున్నంతసేపూ మనవికాని జీవితాలని ,ఎప్పుడో ఈ భూమిమీద జరిగిన కథలని చూస్తూ మరొక లోకంలోకి వెళ్లిపోతాం. చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాలు, మనం విన్న రాచరికపు కథలు అప్రయత్నంగానే కళ్లముందుకొస్తాయి. అక్కడ తిరుగుతున్న సమయంలో తెలుగు సినిమా దివంగత నటుడు రాజబాబు తీసిన ‘ ఎవరికి వారే యమునాతీరే' సినిమాలో పాడిన పాట, ఆ పంక్తులు జ్ఞాపకంవచ్చాయి...... "రాజ్యాలను ఏలినారు వేలవేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part VI

Advertisements

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part V

* * * Continued from Part IV నగరమంతా రాజ భవనాలు, కోటలతో ఒక చారిత్రక దృశ్యాన్ని ఆవిష్కరిస్తూ కనిపించింది. వాస్తవంగానే రాజుల కాలంలో ఉన్నామని, ఒక కోటలో తిరుగుతున్నామని భ్రమ కలుగుతుంది. విశాలమైన, అధునాతన మైన , ఇంకా సంపన్నమైన నగరం ఇది. కానీ పేదరికం కూడా ప్రక్క ప్రక్కనే కనపడుతూనే ఉంది. నగరంలోని ప్రధానమైన రోడ్లలో కూడా ఫుట్పాత్ లపైన నివసిస్తున్న జనం కనిపించారు. అందమైన ఈ నగరంలోనూ శుభ్రత పట్ల ప్రజల్లో ఉన్న ఉదాశీనత …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part V

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV

* * * Continued from Part III అహ్మదాబాద్ నుండి అజ్మేర్ చేరుకున్నాం. ఆ రోజు ఈద్ పండుగ కావటంతో వూరంతా ఒక పండుగ సంబరంలో ఉంది. దాదాపు 5 లక్షల జనాభా కలిగి, రాజస్థాన్ లో ఐదవ పెద్ద పట్టణంగా చెప్పబడుతోంది. ఇది భారత దేశపు సాంస్కృతిక సంపద కలిగిన నగరాల్లో ఒకటి గా కేంద్ర పభుత్వంచేత గుర్తించబడింది. అజ్మేర్ 1956  సంవత్సరంలో రాజస్థాన్ లో భాగమైంది. రాష్ట్రంలో నడిబొడ్డున ఉంది ఈ పట్టణం. అజ్మేర్ అంటే …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 – Part IV

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part III

* * * Continued from Part II ద్వారకలో రెండురోజుల మజిలీ తర్వాత మేము సోమనాథ్ కి రోడ్దు దారిలో ప్రయాణమయాం. అది దాదాపు 4-5 గంటల ప్రయాణం. దారి పొడవునా విండ్ మిల్స్ దర్శనమిస్తాయి. రాష్ట్రంలో విద్యుత్తును పుష్కలంగా తయారుచేసేందుకు  ఇవి బాగా తోడ్పడుతున్నాయి. రోడ్డు బావుంది. చుట్టూ విశాలమైన ఖాళీ భూములే కాని ఎక్కడా పంట పొలాలు కన్పించకపోవటం గమనార్హం. సోమనాథ్ వెళుతూ మధ్యలో గాంధీజీ జన్మస్థలమైన పోర్బందరు చూసేం.ఇక్కడ బాపూ పుట్టిన …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part III

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part II

* * * Continued from Part I  భారత దేశంలో ప్రభుత్వం గుర్తించిన 12 సాంస్కృతిక వారసత్వ నగరాల్లో ద్వారక ఒకటి. ద్వారక అంటే (గేట్ వే) ముఖ ద్వారం. ద్వార్ అంటే ద్వారం, క అంటే బ్రహ్మ. ద్వారక అంటే ‘స్వర్గానికి ముఖ ద్వారము’. ఈ గుడిలో కృష్ణభక్తురాలు మీరాబాయి కృష్ణుడిలో ఐక్యం అయిందని చెబుతారు. ద్వారకలోని ప్రధాన ఆలయం ద్వారకాధీషుడి దేవాలయం. దీనిని ‘జగత్ మందిర్’ లేదా ‘నిజ మందిర్’ అనికూడా అంటారు. …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part II

భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I

* * * ఇటీవల కాలంలో అంటే దాదాపు గత పదేళ్లుగా మన దేశంలో పర్యాటకం బాగా అభివృధ్ధి చెందుతోంది. దేశంలోని ఏమూల  ఉన్న పర్యాటక ప్రదేశంలోనైనా ఎక్కువగా మన ఆంధ్రా వాళ్లు కనిపిస్తూ ఉంటారని నా ఉత్తరాది స్నేహితురాలు నన్ను ఆట పట్టిస్తోంది కూడా. నిజమే. ఒక కుటుంబంలోని వారో, లేదా స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి కొన్ని కుటుంబాలుగానో లేదా ప్రభుత్వ పర్యాటక శాఖ కానీ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు నిర్వహించే టూరు ప్రోగ్రాముల్లోకానీ  మన …

Continue reading భిన్నసంస్కృతుల వాయవ్య భారతం – ఆకాశవాణి, 2015 మరియు గ్రంథాలయ సర్వస్వం, 2016 – Part I

ఏ మాసమైతేనేం? – కౌముది Dec, 2014

* * * అవి మాఘ మాసారంభపు రోజులు ! మంచు తెరలు ఒకింత త్వరగా కరిగి మాయమవుతున్నవేళ! తూర్పు వాకిట్లో వెలుగుపువ్వుల ముగ్గులేసేందుకు ప్రకృతి యావత్తూ సమాయత్తమవుతున్న వేళ ! అలవాటైన దారుల వెంట * * *

నువ్వో తత్త్వవేత్తవా నేస్తం? – కౌముది Sept, 2014

* * * రాబోయే రహదారుల వెంట నాకోసం ఏదో అద్భుతం దారి కాచి మరీ వేచి ఉందనే ఆశ నన్ను ప్రతి మలుపులోనూ ఉత్సాహంగా నడిపిస్తుంటే సహ పధికురాలివై కలిసిన నిన్ను కాస్సేపు విన్నాను! ఇవన్నీ ఎప్పుడో విన్నవే నన్నభావం! * * *