పల్లె ముంగిట్లో వాలిన కల

* * * కలలు కనటం నేరం కాదు, కమ్మని దృశ్యాల్ని అమ్మ చీర చెరుగులో కలవరించటం అసలే నేరం కాదు. నిజమే, ఆ కలల్ని సజీవంగా చూసుకుందుకు అహర్నిశం కష్టపడ్డావ్. నిద్రా హారాల్ని మాని యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించావ్. పరంపరగా మెట్టు పైమెట్టు ఎగబ్రాకుతూనే ఉన్నావ్, విజయాలూ, వెన్నంటి ఉండే ఆరాటాలూ, అసహనాలూ, నీ భార్యాబిడ్డల్ని ఓ కుదుపు కుదుపుతూనే ఉన్నాయి. అంబరమంత ఆశయం!! రెండు చేతులూ చాచి, భౌగోళిక సరిహద్దులు చిటికెన వేలితో …

Continue reading పల్లె ముంగిట్లో వాలిన కల

కాసిని కవితా భావనలు

* * * కిటికీ వారగా తెలవారింది నైట్ క్వీన్ నిద్రపోయింది.   సమాంతర రేఖల మీద సమైక్యతా రాగాలు రైలొచ్చింది.   ఆకాశాన తెలిమబ్బు నేలింకిన నదీపాయ, గ్రీష్మం.   బావురుమనే వాకిలి మినుకుమనే ఆశాతోరణం నిరీక్షణ.   ఫాగ్ చలి చుట్టుకున్న ఇండియా గేట్ భవిష్య దర్శనం.   చౌరస్తా బ్రహ్మరథం యాక్సిడెంట్ కేకైంది ట్రాఫిక్ జామ్.   కాలుష్యం ఘనీభవించింది ప్రవహించే జ్ఞాపకం తాజ్ మహల్. * * *

పునరపి – వాకిలి Sept, 2016

* * * నువ్వొస్తున్నావట! ఔను, పాత ఉక్రోషాలన్నీ మర్చేపోయిందీ మనసు! వచ్చేస్తున్నావ్, నాకు తెలుసు. వేల మైళ్ల దూరాన్ని మనో వేగంతో ముందే దాటేస్తావ్, ఇంతలోనే నడి ప్రయాణపు పలకరింపువవుతావు. ఒట్ఠి పిచ్చివాడివి! సమాంతరంగా నీతో ప్రయాణం చేస్తూనే ఉన్నానన్న వాస్తవం మరిచేపోతావ్! ఓహ్,నిజంగా వచ్చావ్. అదే మబ్బుపట్టిన సాయంకాలం, అదే ఎదురుచూపుల వాకిలి! ఆ కాసిని మెట్లూ అధిగమించలేని అలసట నీ అడుగుల్లో! నీ ముఖంలో ఒక దైన్యం! మాటల దొంతరలు పేర్చని ఓ …

Continue reading పునరపి – వాకిలి Sept, 2016

ఒక్క క్షణం ఇలా రా…..- కవిత 39 Aug, 2016

* * * అంతులేని ఉద్వేగాల్ని మూటగట్టుకుని,  నా మీద దాడి చేస్తున్నావని ఆ తొలినాటి సమావేశం చెప్పలేదు ! ప్రపంచం పట్ల అభావంగా ఉన్న మమకారపు చెలమను   ఆ క్షణమే నిశ్శబ్దంగా త్రవ్వి తీస్తున్నావనీ తెలీలేదు ! కమ్ముకుంటున్న చీకటి రొజాయిల మధ్య నువ్వేదో చెబుతున్నట్టే ఉంది ...... వెచ్చని సూర్య కిరణాల్నిచూసి కేరింతలు కొట్టే ఉదయాలు, నిద్రెరుగని కన్నుల్ని విస్తుపోయి చూస్తున్నాయి ! ఇప్పుడు ........ నా ప్రమేయం లేకుండానే ఋతువులు మారుతున్నాయి.......... సముద్ర …

Continue reading ఒక్క క్షణం ఇలా రా…..- కవిత 39 Aug, 2016

బాధ్యతాయుత క్యాబ్ డ్రైవర్లు

* * * కాళ్లల్లో చక్రాలు ఉన్నాయేమో అన్నట్టు ప్రతి నాలుగు నెలలకీ ఒకసారి రైలెక్కి దేశం మీదకి వెళ్లిరావటం అలవాటైపోయిందీ మధ్య. రేపు మనది కాదు కదా అన్నవాస్తవం వెన్ను తడుతున్నట్టూంది. దాని తాలూకూ అభద్రత మొదలైనట్టుంది లోపల్లోపలెక్కడో. మన దేశం వైరుధ్యాలపుట్ట అని తెలిసున్నదే. ముఖాలు ఏప్రాంతాల వారివైనా కొద్దో గొప్పో తేడాలతో మనవాళ్లే అని చెప్పుకోగలం. మన వాళ్లు అంటే మనదేశ ప్రజలని మాత్రమేనండీ, కులాలు, మతాలు కావుసుమా. ఈ వైరుధ్యాల మధ్య …

Continue reading బాధ్యతాయుత క్యాబ్ డ్రైవర్లు

నాందేడ్ – గోదావరి – గురుద్వారా

* * * ఈ మధ్య మహారాష్ట్ర లోని నాందేడ్ లో ఉన్న గురుద్వారా గురించి విని అక్కడికి వెళ్లేం. చాలా పెద్ద పట్టణం. విశాలమైన వీధులు. దాదాపు ఆరు లక్షల పైగా జనాభా ఉంది. ఇది మహారాష్ట్రలో 8వ పెద్ద పట్టణంగా చెబుతారు. నాందేడ్ పట్టణానికి ఉత్తరంగా గోదావరి నది ప్రవహిస్తూ ఉంది. * అన్ని ప్రధాన కూడళ్లలోనూ ‘ సైలెంట్ సిటీ- బెటర్ సిటీ- సే నో టు హార్న్’ అన్న బోర్డులు కనిపించాయి. …

Continue reading నాందేడ్ – గోదావరి – గురుద్వారా