Swachcha Bharat – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Oct. 2021

* * * Original: Anuradha Nadella Translation: Srinivas Banda                                            Swachcha Bharat slogan is reverberating emphatically in the entire country. Clearing up of the weeds and grass that grew in the school compound, along with cleaning of toilets and class rooms has been taken up on war footing, by all of us in the school. …

Continue reading Swachcha Bharat – Gudem cheppina kathalu – Translation – Neccheli Web Magazine, Oct. 2021

కొత్త బడిలో నవీన్ – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Oct. 2021

* * *                                                       మనం ఈ నెల మాట్లాడుకోబోతున్నది ఒక అరుదైన పుస్తకం. పుస్తక శీర్షిక చూసి ఇదేదో పిల్లలకే సంబంధించిన బడి పుస్తకం అనుకోవద్దు. బడి అంటే పిల్లలకే కాదు టీచర్లకు, అమ్మా, నాన్నలకూ అలా మొత్తం సమాజానికి సంబంధించినది కదా. ఈ పుస్తకం ఒక స్నేహితురాలి ద్వారా నన్ను చేరింది. చదువుతున్నంతసేపూ ఒక టీచర్ గా నాకు కొత్త శక్తిని ఇచ్చింది. ఈ పుస్తకంలోని ఆలోచనల్లాటివే నన్ను వేధిస్తుంటాయి. బహుశా నాలాటి …

Continue reading కొత్త బడిలో నవీన్ – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Oct. 2021

కిటికీ పక్క ఆకాశం – ఈమాట Jun, 2017

ద్వైతాద్వైతం

* * *

ఈ కిటికీ పక్క ఆకాశం ఇన్నాళ్లూ నాదే!

ఆకాశం మిద్దె క్రింద అడవిలాటి ఆకుపచ్చకి
మెలకువతో ఉన్న నా క్షణాలన్నీ ఇచ్చేసేను
నిజం చెప్పేస్తున్నా
ఇటుగా ఒంగిన ఆకాశంతో ఎప్పుడో ప్రేమలో పడ్డాను.

ఆ మూలగా గడ్డి చెదిరిన పాకలో రెండు ఆవులు
విలాసంగా మేస్తున్నాయి, అరమూత కళ్లతో
ఆకాశాన్ని చూస్తూ ఆనక నెమరేస్తున్నాయి.

ఎవరెవరో వచ్చారు, ఏవో కొలతలు వేశారు!
ఇసుక లారీలొచ్చాయి
ఇనుప చువ్వలొచ్చాయి
మోడువారిన చెట్లొచ్చాయి.
కరకరమంటూ కంకర నలుగుతోంది
అడవి కరిగి ఆవిరయిపోతోంది.

ఒకటొకటిగా నిటారుగా నిలబడ్డ
అంతస్తుల వరుసలకు అందకుండా
ఆకాశం కనిపించని ఎత్తుకు ఎగిరిపోయింది!

పచ్చదనంతో దోబూచులాడే కువకువలన్నీ
ఎటో వలస పోయాయి
పాకలో ఆవులు నెమరేయటం మరిచిపోయాయి.

లోలోపల ఊపిరాడనితనం.
పున్నమి నాటి ఆకాశం పాత చుట్టరికం కలిపి
నన్ను పలకరించబోతుంది
ఇక్కడి మట్టిహృదయం మాయమైందని తెలియదు పాపం!

ఈ ఆకాశం నాది కాదు! నాది కాదు!

* * *

View original post