విషాద కామరూప – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Jan, 2021

* * *                                                                                 రచనః ఇందిరా గోస్వామి అనువాదంః గంగిశెట్టి లక్ష్మీనారాయణ                                        కేంద్రసాహిత్య అకాడమీ పురస్కారం లభించిన ‘’విషాద కామరూప’’ నవలా రచయిత్రి ఇందిరా గోస్వామి. ఈ నవలను కామరూప మాండలికంలో ‘’ఊనే ఖోవా హౌదా’’ పేరుతో రాయటం జరిగింది. ఈ అస్సామీ మాండలికం ఎక్కువ మందికి తెలియకపోవటం వలన రచయిత్రి స్వయంగా ‘’ఎ సాగా ఆఫ్ సౌత్ కామరూప” పేరుతో తన నవలను ఇంగ్లీషులోకి అనువదించారు. దానిని గంగిశెట్టి లక్ష్మీ నారాయణ …

Continue reading విషాద కామరూప – పుస్తక సమీక్ష, నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Jan, 2021

ద్వైతాద్వైతం – వాకిలి Dec, 2015

ద్వైతాద్వైతం

* * *

అలుపెరుగని దూరాలకు పరుచుకున్న
ఆ ఆరావళీ వరుసలు
ఎప్పటెప్పటి నిశ్శబ్దాన్నీ చుట్టుకున్నట్లున్నాయి !
తమదంటూ ముద్ర వెయ్యకుండానే మాయమయే

మబ్బుదొంతరలు
సముద్రాన్ని ఆవాహన చేసుకుంటూ ఆవులిస్తూ సాగిపోతున్నాయి.
పశ్చిమంగా హద్దుగీస్తున్న
అరేబియా సముద్రం
పరుగెత్తే కాలానికి రేయింబవళ్లు పహరా కాస్తున్నట్లుంది.
తీరాన్ని వదిలి అద్దరికీ ఇద్దరికీ మధ్య
పరుగెత్తే మోటారు లాంచీలు
పరవశంతో ప్రవహించే కూనిరాగాల్ని
కడలి ఒడిలో ఒడుపుగా లాక్కెళుతున్నాయి.
ఆటవిడుపుగా జాతరకి బయలు దేరిన
పల్లెవాసుల పకపకల మాటున
పరిమళించే ముచ్చట్ల సవ్వడులు
అలలై కదులుతున్నాయి.
ఆ వార- బీడుభూములు, ఉప్పు కయ్యల సాక్షిగా
దేవాలయపు గంటల మోతలు నేపథ్య సంగీతమైతే,
ఈ వార- గిరగిర తిరిగే గాలిమరలు తోడురాగా
మట్టిపొత్తిళ్ల నిండా పచ్చదనాలు చిగుళ్లెత్తుతున్నాయి.
గమ్యంవైపు ఆగిసాగే నిస్సహాయపు బరువులతో
ఇసుక సెగల్ని మరింత ఎగదోసే ఎడారి ఓడలు
ఓయాసిస్సుల వెంట గంభీర మౌనముద్రల్ని వదులుతూ
ప్రకృతిలో ద్వైతాద్వైతాల వేదాంతాన్ని నిట్టూర్పుల మధ్య నెమరేస్తున్నాయి.

నిమిత్త మాత్రంగా
నిటారుగా నిలబడిన ఆకాశం
అంతలోనే ఆ క్షితజరేఖ వైపుగా ఒంగిందెందుకని?!

(ద్వారక, గుజరాత్ ప్రాంతంలో తిరుగుతున్నప్పుడు కలిగిన ఆలోచనలు)

* * *

View original post