* * *
పూర్తిగా తెలవారేందుకు ఇంకా సమయమున్నట్లే ఉంది. చుట్టూ ప్రకృతి చిరుచీకటి ముసుగులో నిశ్శబ్దంగా ఉంది. ఆనందరావు తన యాత్ర మొదలు పెట్టేడు. నడుస్తున్నాడు. ఎదురుగా కొన్ని వందల మెట్లు. ఉత్సాహంగా అడుగులు వేస్తున్నాడు. ఇంతేనా, ఈ కాసిని మెట్లేనా అనిపిస్తూంటే నడుస్తూనే ఉన్నాడు. తానింత సులభంగా, సునాయసంగా ఇన్నేసి మెట్లు ఎక్కగలడని తనకే తెలియదు అనుకున్నాడాయన.
ఏకాగ్రతతో నడుస్తున్నవాడు ఉన్నట్టుండి చంటిపిల్లల కేరింతలతో