* * *
వేకువల్నీ, వేదనల్నీ అధిగమించి
నిత్య పథికులమై,
నిరంతరాన్వేషణార్థులమై
ఎటు వెళ్తున్నాం, ఏమై పోతున్నాం?
నిన్నూ, నన్నూ సమస్త ప్రపంచాన్ని ఆవరించిన కాలం
మహా మౌనిలా, లిప్తలు, లిప్తలుగా
కంటి చూపుల వెంట, ఒకటి కాని దారుల వెంట
ప్రయాణమై వెళ్తుంటే నీకేమనిపిస్తోంది?
ఆ నిశ్శబ్దంలో అడుగులు లెక్కెట్టుకుంటూ–
కుడి, ఎడమలమై నువ్వూ నేనూ అనుసరిస్తూనే ఉన్నాం!
గమ్యం అర్థం కాక అయోమయంలో పడుతూనే ఉన్నాం!
Thank u anudeep.
LikeLike
well said on existence 🙂 🙂
LikeLiked by 1 person
Thank u
LikeLike