* * *
అకస్మాత్తుగా వస్తావ్!
అక్షరాల దొంతరవౖ పలకరిస్తావ్!
ఎంతెంత ప్రయాణమై వస్తావ్!
ఎన్ని వేల మైళ్లు పరుగులు దీసి వస్తావ్!
గుండె చప్పుళ్లు విశ్వమంతా ప్రకంపిస్తుంటే
భరించలేని ఉద్వేగాల మధ్య నేనుండగానే నువ్వు నువ్వుగా నా ముందుకొస్తావ్!
వియోగంలో కన్నీరవుతానంటావ్!
చెమర్చే కళ్లమధ్య అంధుణ్ణవుతాను!
ఇక నీ అక్షరాల స్పర్శ నాకు దివ్యత్వాన్నిస్తుంది!