* * * నిజం చెప్తున్నా , ఒక హిజ్రా ఆత్మకథ - ఎ. రేవతి, తెలుగుః పి. సత్యవతి “మనం తరచుగా హక్కుల గురించి మాట్లాడుతూ ఉంటాం. అయితే సమాజపు అంచులలో బతికేవారికి ఈ హక్కులు అందుబాటులో ఉన్నాయా?” అంటూ ఆత్మకథ చెబుతున్న ఎ. రేవతి తన ముందుమాటలో సూటిగా అడిగారు. ఎంతో నిజాయితీగా తను పడిన శారీరక, మానసిక అవమానాలను, బాధలను, తనలాటివారు ఎదుర్కొంటున్న వివక్షను కళ్లకు కట్టినట్టు రాసిన రేవతి అభినందనీయురాలు. …