లైబ్రరీలు కావాలి! – బిట్టు కథలు, పన్నెండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Oct, 2019

జరిగిన కథ : బిట్టు ఢిల్లీ పిల్లవాడు. సెలవల్లో వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరుకు వచ్చాడు. ఎన్నో విషయాలు నేర్చుకొని, నేర్పి, ఇప్పుడు ఇక ఢిల్లీకి తిరిగి వెళ్తున్నాడు… ఈ ధారావాహిక చివరి భాగం‌ ఇది. బిట్టు వాళ్ళ అమ్మ సునంద హడావిడి పడుతూ వచ్చింది ఢిల్లీ నుండి. వస్తూనే, కొంచెం బుగ్గలొచ్చి సంతోషంగా కనిపిస్తున్న కొడుకుని చూసుకుని, మురిసిపోయింది. వాడిని అమ్మమ్మ-తాతయ్యల దగ్గరకి పంపి మంచి పని చేసానని తృప్తి పడింది. ఆ ఒక్క నెలలోనే …

Continue reading లైబ్రరీలు కావాలి! – బిట్టు కథలు, పన్నెండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Oct, 2019

బిట్టు – సెలవులైపోతున్నాయ్, పదకొండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Aug, 2019

* * * జరిగిన కథ: బిట్టు ఢిల్లీ పిల్లాడు. సెలవల్లో అమ్మమ్మ వాళ్ల ఊరు వచ్చాడు. ఇక్కడికొచ్చి చుట్టూ ఉండే విషయాలు చాలా నేర్చుకున్నాడు. స్నేహం చెయ్యటం, పక్షుల్ని జంతువుల్ని ప్రేమించటం, ఇతరులకు సాయం చెయ్యటం లాంటి సంగతుల్ని, తెలుగులో రాయటాన్ని, చదవటాన్ని అన్నిటినీ ఈ కొద్ది కాలంలోనే నేర్చుకున్నాడు. ఇప్పుడింక వెనక్కి వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతున్నది.. ఆరోజు రాత్రి భోజనాలయ్యాక "ఇదిగో, అమ్మతోటీ-నాన్నతోటీ మాట్లాడు" అంటూ ఫోనులో నంబరు కలిపి ఇచ్చారు తాతయ్య. …

Continue reading బిట్టు – సెలవులైపోతున్నాయ్, పదకొండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Aug, 2019

ఆదర్శం – బిట్టు కథ, పదవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Apr, 2019

* * * జరిగిన కథ : బిట్టు ఢిల్లీ కుర్రాడు. వాళ్ళ అమ్మమ్మ వాళ్ల ఊరు పోరంకికి వచ్చాడు, వేసవి సెలవలు గడిపి వెళ్ళేందుకు. ఇక్కడ వాడు రకరకాల సంగతులు నేర్చుకుంటున్నాడు. మొన్న పిచ్చుకలు దొరికాయి వాడికి. అంతకుముందు ఓ కుక్క దొరికింది. దానికి రెయిన్ బో అని పేరు పెట్టుకున్నాడు. పక్కింటి అమ్మమ్మ పేరు జయమ్మమ్మ. ఆవిడే, పిచ్చుకల్ని బయట పడేసింది.. ఇక చదవండి. మర్నాడు జయమ్మమ్మ వచ్చింది- రమ్యనీ, రాహుల్ ని తీసుకుని. …

Continue reading ఆదర్శం – బిట్టు కథ, పదవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Apr, 2019

బిట్టు-పిచ్చుకలు – తొమ్మిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Feb. 2019

* * * ఆరోజు బిట్టు నిద్ర లేచేసరికి ఇంటి ప్రహరీ గోడ మీది నుండి ప్రక్కింటి వాళ్లతో మాట్లాడుతోంది అమ్మమ్మ. బిట్టుకు ఆశ్చర్యం వేసింది. ఆ ఇంట్లో ఎవరుంటారు? తను వచ్చి ఇన్నాళ్ళైంది కదా, ఇప్పటిదాకా ఆ ఇంట్లోవాళ్ళు ఎవ్వరూ తనకు కనిపించనే లేదు! కొద్ది సేపటికి అమ్మమ్మ కబుర్లు పూర్తిచేసుకొని లోపలికి వచ్చింది కదా, అప్పుడు ఆవిడ చేతిలో అరటికాయలు కనిపించాయి బిట్టుకి. 'అవేమిటి? ఎక్కడివి?' అంటూ ప్రశ్నలు వేసాడు అమ్మమ్మని. ‘ప్రక్కింటి జయమ్మమ్మ …

Continue reading బిట్టు-పిచ్చుకలు – తొమ్మిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Feb. 2019

ఢిల్లీ కబుర్లు – ఎనిమిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Dec. 2018

* * * జరిగిన కథ: ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరికి వచ్చాడు. అక్కడ దావీద్, చిట్టి వాడికి స్నేహితులయ్యారు. తాతయ్య దావీద్‌కు చదువు చెప్పిస్తున్నారు.రచన: అనురాధ నాదెళ్ళ, పోరంకి, కృష్ణాజిల్లా. తాతమ్మకి నిద్ర వస్తున్నట్టు ఉంది, అయినా కబుర్లు వినాలన్న ఆశతో, ‘ఓ కప్పు కాఫీ ఇవ్వవే మణీ’ అంటూ కోడల్ని పురమాయించింది. ఢిల్లీలో చూడదగ్గ ప్రదేశాల గురించి బిట్టు అనర్గళంగా చెబుతూంటే నోళ్ళు తెరిచి వింటూ ఉండి పోయారు పిల్లలు. తాతమ్మకి …

Continue reading ఢిల్లీ కబుర్లు – ఎనిమిదవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Dec. 2018

బిట్టు – దావీదు విచారం – ఏడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం July, 2018

* * * జరిగిన కథ: బిట్టు ఢిల్లీలో ఉంటాడు వాళ్ల అమ్మా నాన్నలతో పాటు. సెలవల్లో వాళ్ల అమ్మమ్మ వాళ్ల ఊరికి వచ్చాడు. ఇక్కడ తెలుగు నేర్చుకున్నాడు; దావీద్, చిట్టిలతో స్నేహం చేసాడు; ఆ పిల్లల ఇళ్ళలోని కష్టసుఖాలను తెలుసుకుంటూ ఎదుగుతున్నాడు…రచన : అనురాధ నాదెళ్ళ, పోరంకి, కృష్ణాజిల్లా.చిత్రాలు: సుహాసిని, 7వ తరగతి, రాధ స్కూల్‌ ఆఫ్‌ లర్నింగ్‌, అనంతపురం బిట్టు వచ్చి ఇన్ని రోజులైనా వాడు అమ్మ-నాన్నల గురించి పెద్దగా అడగటం లేదు. నాలుగు …

Continue reading బిట్టు – దావీదు విచారం – ఏడవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం July, 2018

బిట్టు – తాతయ్య డ్రగ్స్ – ఆరవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Apr, 2018

* * * నేపథ్యం : ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. తెలుగు ఇప్పుడిప్పుడే నేర్చుకుంటున్నాడు- అందుకని చాలా అనుమానాలు వస్తుంటాయి వాడికి. ఊళ్లో సైకిల్ రిపెయిర్ షాపు నడిపించే వీరబాబు కూతురి పిల్లలు దావీదు, చిట్టి వాడి స్నేహితులు. ఇక చదవండి...       * * * అర్థ రాత్రి అవుతుండగా బిట్టుకి మెలకువ వచ్చింది. చుట్టూ చూస్తే అందరూ నిద్రలో ఉన్నారు. వరండాలోకి వెళ్లి చప్పుడు …

Continue reading బిట్టు – తాతయ్య డ్రగ్స్ – ఆరవ భాగం – కొత్తపల్లి పిల్లల కథల పుస్తకం Apr, 2018

తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018

* * * ఢిల్లీలో ఉండే బిట్టు సెలవల్లో అమ్మమ్మ ఊరు పోరంకికి వచ్చాడు. అక్కడ తాతయ్య వాళ్ళ అమ్మ- 'తాతమ్మ' కూడా ఉంది. బిట్టుకు తాతమ్మని చూస్తే ఆశ్చర్యం. మరి తాతమ్మ ఎప్పుడూ పళ్ళు తింటుంది! తాతమ్మ కబుర్లు చెబుతుంది, కానీ బిట్టుకి మటుకు ఆ కబుర్లు అన్నీ అర్థం కావు. వాడికి చాలా అనుమానాలు: 'ఆవిడ తాతయ్య దగ్గర చంటిపిల్లలా ప్రవర్తిస్తుందేమిటి? తాతయ్యకి అమ్మ కదా, అయినా అన్ని విషయాలు తాతయ్యనే అడుగుతుంది ఎందుకు? …

Continue reading తాతమ్మ పళ్లు – బిట్టు కథలు – నాలుగవ భాగం – కొత్తపల్లి కథల పుస్తకం – Jan, 2018