రైలుబడి – నెచ్చెలి అంతర్జాలవనితా మాసపత్రిక Oct, 2020

                                  రైలుబడి రచన: టెట్సుకో కురొయనాగి అనువాదం: ఈశ్వరి, ఎన్. వేణుగోపాల్                       మనం మట్లాడుకోబోతున్న పుస్తకం చదువుతున్నంతసేపూ మన పెదవులమీద చిరునవ్వు చెరగనివ్వదు. చదువుతున్న అందరినీ బడికెళ్లే పిల్లలుగా మార్చేస్తుంది. మనల్ని మంత్రించి, బాల్యపు లోకాల్లోకి తీసుకెళ్ళిపోతుంది. ఇప్పటికే ఊహించేసి ఉంటారు కదా, అవును అది “రైలుబడి”. చదివిన ప్రతివారూ ఆ బడిలో తాము కూడా చదువుకుంటే ఎంత బావుణ్ణు అని అనుకోకమానరు.                    1933లో జన్మించిన టెట్సుకో కురొయనాగి ఈ “రైలుబడి” పుస్తకం రచయిత్రి, …

Continue reading రైలుబడి – నెచ్చెలి అంతర్జాలవనితా మాసపత్రిక Oct, 2020

మరల సేద్యానికి – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Aug, 2020

* * * ‘మరల సేద్యానికి’ నవల కన్నడంలో శ్రీ శివరాం కారంత్ 1941 లో ‘మరళి మణ్ణిగె’ పేరుతో రాసారు. శివరాం కారంత్ భారతదేశపు అగ్రశ్రేణి రచయితల్లో ఒకరు. ఆయన సాహిత్యంతో పాటు యక్షగానకళ ఉధ్ధరణకు, వితంతు పునర్వివాహాలకు, పర్యావరణ సంరక్షణకు ఉద్యమాలను నడిపారు. నవలలు, నాటికలు, పిల్లల సాహిత్యం విస్తృతంగా రాసారు. వీరికి సాహిత్య అకాడమీ అవార్డు, జ్ఞానపీఠ అవార్డు, అనేక విశ్వవిద్యాలయాల డాక్టరేట్లు, పద్మభూషణ్ అవార్డ్, సంగీత నాటక అకాడమీ ఫెలోషిప్ వంటి …

Continue reading మరల సేద్యానికి – నెచ్చెలి, అంతర్జాల వనితా మాసపత్రిక Aug, 2020

కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020

* * * ప్రతిభాభారతి వాళ్ల ఇల్లు నేను క్లాసుకొచ్చేదారిలోనే ఉంటుంది. సరిగ్గా నేను బస్సు దిగి వచ్చే సమయానికి రోజూ నవ్వుముఖంతో, చంకన చిన్నతమ్ముడితో ఎదురయ్యేది. స్కూల్లో చదువుకుంటున్న పిల్లే. కిటికీ దగ్గర నుంచుని సాయంత్రం నా క్లాసులో జరిగేదంతా చూస్తుండేది. ఒక్కోసారి గుమ్మంలోకొచ్చి కూర్చునేది. ఇంతలో తల్లి పిలుపుకి పరుగెత్తి వెళ్లిపోయేది. ఆమె పెద్ద తమ్ముడు ప్రైవేటు స్కూల్లో చదువుతాడని, హోమ్ వర్క్ స్కూల్లో చేయించేస్తారని తెలిసింది. తనతో చదివే పిల్లలు చెబుతుండేవారు, “క్లాసులో …

Continue reading కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020

ఏకాంతద్వీపం – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2020

* * * ఇది ఒక ఏకాంతద్వీపం! ఇక్కడ నిశ్శబ్దమే పహరా కాస్తుంటుంది కాస్త చెవి ఒగ్గి వినాలే కానీ ఏవో యంత్రాల ఘోష నీచుట్టూ ఒక ప్రవాహమై కదులుతుంటుంది ఇక్కడ ఆకలిదప్పులే కాదు నిద్ర కూడా నిన్ను పలకరించదు పగలు రాత్రులంటూ భేదమేమీ ఉండదు నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు. పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి గాజు తలుపులు, మెరుపు వెలుగులు నిన్ను పరివేష్టించి ఉంటాయి నీ శరీరభాగాలన్నీ …

Continue reading ఏకాంతద్వీపం – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2020

బిట్టు – సెలవులైపోతున్నాయ్, పదకొండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Aug, 2019

* * * జరిగిన కథ: బిట్టు ఢిల్లీ పిల్లాడు. సెలవల్లో అమ్మమ్మ వాళ్ల ఊరు వచ్చాడు. ఇక్కడికొచ్చి చుట్టూ ఉండే విషయాలు చాలా నేర్చుకున్నాడు. స్నేహం చెయ్యటం, పక్షుల్ని జంతువుల్ని ప్రేమించటం, ఇతరులకు సాయం చెయ్యటం లాంటి సంగతుల్ని, తెలుగులో రాయటాన్ని, చదవటాన్ని అన్నిటినీ ఈ కొద్ది కాలంలోనే నేర్చుకున్నాడు. ఇప్పుడింక వెనక్కి వెళ్ళిపోయే సమయం దగ్గర పడుతున్నది.. ఆరోజు రాత్రి భోజనాలయ్యాక "ఇదిగో, అమ్మతోటీ-నాన్నతోటీ మాట్లాడు" అంటూ ఫోనులో నంబరు కలిపి ఇచ్చారు తాతయ్య. …

Continue reading బిట్టు – సెలవులైపోతున్నాయ్, పదకొండవ భాగం – కొత్తపల్లి తెలుగు పిల్లల ఈ మాసపత్రిక Aug, 2019