తమిళనాట తెలుగునుడి పల్లెకతలు – 1.కుటుంబ కథలు – పుస్తకం.నెట్, 15 Dec 2022

* * *                                              సేకరణ డా. సగిలి సుధారాణి                                    భూగోళమంతా నైసర్గికంగా, రాజకీయంగా, సంస్కృతీ పరంగా, భాషాపరంగా అనేక సమాజాలుగా విడిపోయి చాలాకాలమే అయింది. అయితే ఈ విభజనలు మనుషిని కట్టి పడెయ్యలేకపోయాయి. ఉపాధి, జీవికలకోసమో, వ్యాపార వ్యవహారాల కోసమో మనిషి వలసదారి పడుతూనే ఉన్నాడు. స్వంత ఊరిని, మనుషుల్ని వదిలి వెళ్లినా తనదైన అస్తిత్వానికి పునాదులైన భాషా సంస్కృతుల్ని మాత్రం తన స్వంతమని అక్కున చేర్చుకునే ఉన్నాడు. తరం తర్వాత తరానికి …

Continue reading తమిళనాట తెలుగునుడి పల్లెకతలు – 1.కుటుంబ కథలు – పుస్తకం.నెట్, 15 Dec 2022

అసింట – ఒక అభిప్రాయం – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, ౦9 Dec. 22

* * *                                                                                                  స్పందించే హృదయానికి ఒక సన్నివేశమో, ఒక సందర్భమో, ఒక అనుభవమో ఏది ఎదురైనా ఉన్నపాటున తనను తాను వ్యక్తీకరించుకోకుండా నిలవలేదు. ఆనందమో, విషాదమో, మరే భావోద్వేగమైనా సరే అభివ్యక్తికి తనకు తెలిసిన భాషను వెతుక్కోవలసిందే. ఈ అవసరం కవికి తప్పనిసరవుతుంది.  తీవ్రమైన భావావేశంతో కవి వర్షాకాలపు మేఘమై, జడివానై కురవాల్సిందే.                                                                    అయితే దీనికంతకూ కావలసింది ముందుగా ఒక స్పందన. ఒక అనుభూతి. ఒక ఆస్వాదన. ఒక చెమర్చే …

Continue reading అసింట – ఒక అభిప్రాయం – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, ౦9 Dec. 22

షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Sept. 2022 Part – 3

* * *   Continued from Part 2 పదకొండవ అధ్యాయంలో…  నాలుగు సుఖాంతాలైన నాటకాలను, నాలుగు విషాదాంతాలైన నాటకాలను పరిచయం చేసి వాటి ప్రత్యేకతలను వివరిస్తూ చక్కని విశ్లేషణలను అందించారు శేషమ్మ గారు. వీటిని గురించి ఈ సమీక్షలో చెప్పటం న్యాయం కాదు. పాఠకులు స్వయంగా చదివి ఆనందించాల్సిందే. నాటకాలలోని అద్భుత సంభాషణలను కూడా ఈ అధ్యాయంలో చూడవచ్చు. పన్నెండో అధ్యాయంలో … ఆసక్తికరమైన అంశం ఉంది. షేక్స్పియర్ నాటకాలు ప్రపంచవ్యాప్తంగా ఎన్నో సినిమాలకు ప్రేరణ …

Continue reading షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Sept. 2022 Part – 3

షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, July. 2022 Part – 1

* * *   తెలుగు సాహిత్యంలో కథ, కవిత, నవల, విమర్శ, సాహిత్య వ్యాసాలు, పిల్లల కథలు, ఆత్మ కథలు, జీవిత చరిత్రలు, అనువాదాలు ఇలా ఎన్నో చదువుతుంటాం. ఇటీవల చదివిన “షేక్స్పియర్ ను తెలుసుకుందాం” పుస్తకం ఒక విలక్షణమైన పుస్తకం అని చెప్పాలి. ఈ పుస్తకం గురించి మాట్లాడుకునే ముందు కొన్ని విషయాలు చెప్పాలి. అనగనగా ఒక అమ్మాయి.  చిన్నప్పుడే తండ్రి పుస్తకాలు చదివే అలవాటు చెయ్యటంతో సాహిత్యాభిరుచిని పెంచుకుంది. 11వ తరగతి లో షేక్ …

Continue reading షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, July. 2022 Part – 1

జీవనది ఆరు ఉపనదులు – ఒక తల్లి ఆత్మకథ – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, June. 2022

  * * *                                                                                                                       ఆకెళ్ల మాణిక్యాంబ ఇప్పుడిప్పుడు ఆత్మకథలు మళ్లీ వస్తున్నాయి. ముఖ్యంగా స్త్రీలు రాస్తున్న సమగ్రమైన ఆత్మకథలు.                             చిన్న వయసులోనే పెళ్లిళ్లై, కుటుంబమే ప్రపంచంగా జీవించిన స్త్రీలు రాసిన జీవిత కథలు. అప్పటి సామాజిక పరిస్థితులలో ఆడపిల్లలకు చదువుకునే అవకాశం పెద్దగా లేదు. యుక్తవయస్కురాలవుతూనే కుటుంబ జీవితంలోకి ప్రవేశించే ఆడపిల్లలకు ఎలా ఉండాలన్నది ప్రత్యేకం నేర్పిందేమీ లేదు. చిన్నతనంలో చూసిన తమ కుటుంబ వాతావరణమే వారికి ఎన్నో విషయాల్లో మార్గదర్శి. జీవన ప్రవాహంలోకి …

Continue reading జీవనది ఆరు ఉపనదులు – ఒక తల్లి ఆత్మకథ – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, June. 2022

“#మీ టూ” కథలు – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Apr. 2022

* * *                                                                                                                                                 సంపాదకత్వంః కుప్పిలి పద్మ                                 సమాజంలో అర్థభాగం స్త్రీలదే అయినా ఆమె పట్ల ప్రపంచం చూసే చూపులో ఏదో తేడా ఉంటూనే ఉంది. ఇదొక సంప్రదాయంగా వస్తోంది. చదువుకుని, అన్ని రంగాల్లోకి విజయవంతంగా అడుగులేస్తున్న స్త్రీ ఎదుర్కోవలసిన సవాళ్లు మరిన్ని తయారవుతున్నాయి. అయినా నడక మానలేదు. తానేమిటో నిరూపించుకుంటూనే ఉంది. ఆమె సమస్యలకు, అవమానాలకు, అవహేళనలకు ఒక రంగం, ఒక వర్గం, ఒక ప్రాంతం అంటూ పరిధులు లేవు. ఇలాటి …

Continue reading “#మీ టూ” కథలు – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Apr. 2022

“కొత్తస్వరాలు” దాసరి శిరీష కథలు – పుస్తక సమీక్ష,నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Mar. 2022

* * *             దాదాపు నాలుగు దశాబ్దాల కాలంలో రచయిత్రి శిరీష రాసిన కథలను ఎంపిక చేసి ‘’కొత్త స్వరాలు’’ కథా సంపుటిని 2018 లో తీసుకొచ్చారు.                                        ఇందులో కథలన్నీ మనవీ, మన తోటివారివీ. ఆమె పరిశీలన, సహానుభూతి ఈ కథలను రాయించాయి. చుట్టూ ఉన్న మనుషులని, వాళ్ల చిన్న, పెద్ద సంతోషాలనీ, ఆశలనీ, దుఃఖాలనీ, అసంతృప్తులనీ గమనిస్తూ జీవితం వ్యక్తులు కోరుకున్నట్టు ఎందుకుండదు అని దిగులు పడతారు రచయిత్రి. జీవితంలో ఎదురయ్యే అనేకానేక …

Continue reading “కొత్తస్వరాలు” దాసరి శిరీష కథలు – పుస్తక సమీక్ష,నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Mar. 2022

“టోకెన్ నంబర్ ఎనిమిది” – పుస్తక సమీక్ష,నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Feb. 2022

* * * ఈ నెల మనం మాట్లాడుకోబోతున్న పుస్తకం విలక్షణమైనది. మన ఇంట్లోని అమ్మాయిలా పలకరిస్తూ, అల్లరల్లరిగా తను చెప్పదలచుకున్న కబుర్లను, చెప్పకుండా ఉండలేని కబుర్లను ఆత్మకథాత్మక రూపంలో చెప్పుకొచ్చిన పుస్తకం. పుస్తకం పేరు కూడా విలక్షణంగా ఉంది. ఇందులో ఒక చిన్న అమ్మాయి తన బాల్యానుభవాల్ని చెబుతుంది. ఆ అనుభవాలు తనను ఎలా సంపూర్ణమైన వ్యక్తిగా మలిచాయో కూడా చెబుతుంది. ఆపైన తన వ్యక్తిత్వంపై గాఢమైన ముద్రను వేసిన వారి గురించి ప్రేమతో, ఆర్ద్రతతో …

Continue reading “టోకెన్ నంబర్ ఎనిమిది” – పుస్తక సమీక్ష,నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Feb. 2022

ప్రకృతి ఒడిలో ఒక యాత్రా గీతిక – సంచిక వెబ్ వార పత్రిక, 9th Jan. 2022

                 * * *                                     యాత్ర! ఎంత బావుందీ పదం! మనం ఉన్న పరిసరాలను దాటి కొద్దిపాటి దూరంలోనో, ఇంకాస్త దూరంలోనో ఉన్న ఒక కొత్త ప్రదేశాన్ని చూసేందుకు ఉద్యుక్తులమైనప్ప్పుడు మనసు కుదురుగా ఉంటుందా? ఉండదు. నిలవనీయదు. నిద్రపోనీయదు. అక్కడేదో మనకోసమే ఎదురుచూస్తూ ఉందన్న ఆలోచన! ఓహ్… యాత్ర మనలో ఒక కొత్త తెలివిడిని, ఒక సంతోషాన్ని, ఒక అస్థిమితం చేసే చురుకునీ, ఒక అంతు తెలియని ఉద్వేగాన్ని, సాయంకాలం సూర్యుడు పశ్చిమానికి ఒరుగుతున్నప్పుడు తోచే …

Continue reading ప్రకృతి ఒడిలో ఒక యాత్రా గీతిక – సంచిక వెబ్ వార పత్రిక, 9th Jan. 2022

మా పిల్లల ముచ్చట్లు – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jan. 2022

* * *                             మా పిల్లల ముచ్చట్లు - ఒక టీచర్ అనుభవాలు                                   బడి అంటే పిల్లలప్రపంచం అనుకుంటాం. కానీ బడిలో ఉండేది పిల్లలొక్కరే కాదుగా. ఆ పిల్లల్ని స్వంతం చేసుకుని తమ కుటుంబంగా భావించే టీచర్లుండేది కూడా బడిలోనే. సహనంతో, ప్రేమతో వారి అమాయకత్వాన్ని జీర్ణించుకుంటూ, అక్షరాలను నేర్పి పిల్లల భవిష్యత్తుకు బాటవేసే టీచర్లు సమాజానికి ఎంత విలువైన సంపదో కదా. పసివాళ్లుగా బడిలో ప్రవేశించే పిల్లలు బడి వదిలే సమయానికి భవిష్య …

Continue reading మా పిల్లల ముచ్చట్లు – పుస్తక సమీక్ష, నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jan. 2022