నందు – గూడెం చెప్పిన కథలు

* * * ఆ రోజు స్కూల్లో నందు హోమ్ వర్క్ చెయ్యలేదని చెప్పగానే అసహనాన్ని అణుచుకోలేక పోయేను. చదివే పిల్లవాడు కూడా మిగిలిన వాళ్లతో చేరి చదువు నిర్లక్ష్యం చేస్తున్నాడన్న బాధ, పిల్లలని సరిగా మలుచుకోలేక పోతున్నానన్న ఉక్రోషం ఒక్కసారి నన్నువివశను చేసేయి. వాడిమీద గట్టిగా విసుక్కున్నాను. మరునాడు క్లాసుకే రావద్దన్నాను. పెద్దవాళ్లని తీసుకొస్తేనే రానిస్తానని చెప్పేను. వాడు బిక్కమొహం పెట్టి నిలబడిపోయేడు . జవాబు చెప్పలేదు . మరునాడు ఒక్కడే వచ్చేడు. పెద్దవాళ్లు పనిలోకి …

Continue reading నందు – గూడెం చెప్పిన కథలు

స్వచ్ఛ భారత్ – గూడెం చెప్పిన కథలు

* * * ‘స్వచ్ఛ భారత్’ నినాదం దేశం అంతా మారుమ్రోగిపోతోంది. స్కూల్ కాంపౌండ్ లోపల పెరిగిన పిచ్చిమొక్కలు, గడ్డి తీసివేయించి, టాయిలెట్లు దగ్గరనుంచీ క్లాసురూముల వరకూ శుభ్రం చేసే పనిని యుద్ధ ప్ర్రాతిపదికన మొదలుపెట్టేం స్కూల్లో అందరం. పిల్లలంతా ఉత్సాహంగా పనుల్లోకి జొరబడ్డారు. అన్ని పనులకీ పోటీ పడిన వాళ్లు టాయిలెట్ల దగ్గరకొచ్చేసరికి శుభ్రం చేసేందుకు ఎవరూ ముందుకు రాలేదు. ‘మేం ఇలాటి పని చెయ్యం టీచర్. మా అమ్మకి తెలిస్తే కొడుతుంది. ఆ పని …

Continue reading స్వచ్ఛ భారత్ – గూడెం చెప్పిన కథలు

తలలు పగలగొట్టుకునే జనాల మధ్య…- గూడెం చెప్పిన కథలు – సారంగ Nov, 2015

* * * తలలు పగలగొట్టుకునే జనాల మధ్య… ~ అనూరాధ నాదెళ్ళNOVEMBER 19, 2015 6 COMMENTS        అనూరాధ నాదెళ్ళ  ~ పిల్లల పట్ల ఉన్న ప్రేమ నన్ను టీచర్ని చేసింది.  ప్రస్తుతం మా పోరంకి (విజయవాడ)లో  చదువు అవసరం ఉన్న ఒక గూడెంలో పిల్లలకి సాయంకాలం పాఠాలు చెబుతున్నాను. ఇది కాకుండా  ‘టీచ్ ఫర్ చేంజ్’ అనే స్వచ్చంద సంస్థకు  ఈ మధ్య సభ్యురాలిని అయ్యాను. కథలు, కవితలు అప్పుడప్పుడు రాస్తూ ఉంటాను . రెండు మూడేళ్ల క్రితం ఒక కథల …

Continue reading తలలు పగలగొట్టుకునే జనాల మధ్య…- గూడెం చెప్పిన కథలు – సారంగ Nov, 2015

కరుణా టీచర్ చెప్పిన ఉపాయం– గూడెం చెప్పిన కథలు – సారంగ Dec, 2015

* * * You are here: Home /    గూడెం చెప్పిన కథలు / కరుణా టీచర్ చెప్పిన ఉపాయం కరుణా టీచర్ చెప్పిన ఉపాయం ~ అనురాధ నాదెళ్ళDECEMBER 10, 2015 20 COMMENTS     సాయంకాలం క్లాసులకి పెద్ద పిల్లలు క్రమంగా మళ్లీ రావడంమొదలు పెట్టేరు. నాకు సంతోషంగా అనిపించింది. ఇంకా కొందరు రావలసి ఉంది. నాకు తెలుసు. రోజూ అటెండెన్స్ తీసుకుంటూ వాళ్లరాక కోసం ఎదురుచూస్తున్నాను. ఒక వారం తరువాత క్లాసు అయి ఇంటికి బయలు దేరుతుంటే ఒకతను, …

Continue reading కరుణా టీచర్ చెప్పిన ఉపాయం– గూడెం చెప్పిన కథలు – సారంగ Dec, 2015

అప్పు తీసివేత-చిన్నారి విన్నీ– గూడెం చెప్పిన కథలు – సారంగ Jan, 2016

* * * అప్పు తీసివేత-చిన్నారి విన్నీ ~ అనూరాధ నాదెళ్ళJANUARY 13, 2016 21 COMMENTS   గూడెంలో క్లాసులు మొదలుపెట్టిన తొలి రోజులు. అప్పటికి రోజువారి దాదాపు ఒక ముప్ఫై మంది పిల్లలు క్లాసులకి వస్తున్నారు. ఆ రోజు సాయంత్రం పిల్లలు అప్పుతీసుకునే తీసివేతలు చెప్పమని అడిగేరని బోర్డ్ మీద చెబుతున్నాను. ‘అప్పు తీసుకోవడం అంటే ఏంటి టీచర్ ?’ విన్నీ అడుగుతోంది. ‘అప్పు తీసుకోవడం అంటే నువ్వు పెన్సిలు కొనుక్కుందుకు నీ దగ్గర డబ్బులు లేవనుకో …

Continue reading అప్పు తీసివేత-చిన్నారి విన్నీ– గూడెం చెప్పిన కథలు – సారంగ Jan, 2016

ఇక్కడ…….. రాళ్లు కూడా మాట్లాడతాయి! – గూడెం చెప్పిన కథలు – సారంగ Feb, 2016

* * * FEBRUARY 10, 2016 23 COMMENTS గూడెం పరిసరాలు అలవాటు అవుతున్నాయి. మొదట్లో కుతుహలంగా, ఆరాగా, సంశయంగా నన్ను, నారాకని వెంటాడే చూపులు మెల్లి మెల్లిగా స్నేహంగా, ఎదురుచూస్తున్నట్లుగా ఉంటున్నాయి. నాకు కూడా ఇప్పుడు ఆ పరిసరాలు ఎంతో ఆత్మీయంగా అనిపిస్తున్నాయి. ఆ పిల్లలు చదువుకోవటం కోసం ఏదైనా చెయ్యాలని ఇష్టంగానే మొదలు పెట్టినా నా రాకని అక్కడ ఎంతవరకూ ఆహ్వానిస్తారో అన్న కొద్దిపాటి జంకు మాత్రం మొదట్లో ఉండేది . ఇప్పుడైతే అది …

Continue reading ఇక్కడ…….. రాళ్లు కూడా మాట్లాడతాయి! – గూడెం చెప్పిన కథలు – సారంగ Feb, 2016

వాడు ఆకలిని జయించాడు – గూడెం చెప్పిన కథలు – సారంగ Mar, 2016

* * * MARCH 25, 2016 28 COMMENTS ఆ రోజు సాయంకాలం క్లాసులో వెనుక కూర్చున్న పెద్దపిల్లల దగ్గర ఏదో హడావుడి కనిపిస్తోంది. ముందు కూర్చున్న పిల్లల హోమ్ వర్క్ చూస్తున్నాను.చేతిలో పని ముగించి వెనుక వైపు వరసల్లో ఉన్నసునీల్ని, వాడి చుట్టూ చేరిన గుంపుని విషయం ఏమిటని అడిగేను. జాన్బాబు వెంటనే చెప్పేడు, 'టీచర్, సునీల్ సెల్ ఫోన్ పట్టుకొచ్చేడు. అందులో బోలెడన్ని పాటలున్నాయి'. .నా అనుమానం నిజమే. ఇందాకటినుండి ఎక్కడో సన్నగా విన్పిస్తున్న …

Continue reading వాడు ఆకలిని జయించాడు – గూడెం చెప్పిన కథలు – సారంగ Mar, 2016

బ్యూటీషియన్ – గూడెం చెప్పిన కథలు – సారంగ Apr, 2016

* * * APRIL 14, 2016 14 COMMENTS ఆరోజు క్లాసులో అశోక్ అల్లరి శ్రుతిమించడంతో వాడిని గట్టిగా మందలించేను. ప్రక్క బెంచీలో కూర్చున్న మాలతి తన పుస్తకాలు పదేపదే తీసి దాస్తున్నాడని ఫిర్యాదు చేసింది. చదువులో చురుగ్గా ఉంటాడని వాడి అల్లరిని ఇష్టంగానే భరిస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి అది హద్దులు దాటుతోందనిపిస్తోంది. ‘ చదువుకుందుకు స్కూలుకి రండి, ఇలాటి పిచ్చిపనులు కోసం అయితే స్కూలుకి రావడం అనవసరం. ఇంట్లో అమ్మానాన్నలు మంచి చెడు ఏమీ …

Continue reading బ్యూటీషియన్ – గూడెం చెప్పిన కథలు – సారంగ Apr, 2016

మహేష్ బాబు – గూడెం చెప్పిన కథలు – సారంగ May, 2016

* * * MAY 12, 2016 13 COMMENTS ఆరోజు సాయంకాలం క్లాసుకి వెళ్ళేసరికి రోజూ కంటే క్లాసు ఎక్కువ సందడిగా ఉంది. నాకు అర్థం అయింది, క్లాసులోకి మరో క్రొత్త విద్యార్థి వచ్చిచేరినట్టు. అది మామూలే. ఎవరైనా క్రొత్తగా క్లాసుకి రావటం మొదలుపెడితే అప్పటికే క్లాసుకి వస్తున్న వాళ్లు క్రొత్త వాళ్లని తమలోకి ఆహ్వానిస్తూ, వాళ్లని అనేక ప్రశ్నలతో ఊదరగొట్టేస్తారు. తమ సీనియారిటీని వాళ్లకి అర్థం అయ్యేలా చేసే ప్రయత్నం చేస్తారు. ఒక రకంగా మన …

Continue reading మహేష్ బాబు – గూడెం చెప్పిన కథలు – సారంగ May, 2016

దేవుడు మాస్టారు-మౌనం – గూడెం చెప్పిన కథలు – సారంగ Jun, 2016

* * * JUNE 16, 2016 9 COMMENTS క్లాసులు బాగానే జరుగుతున్నాయి. ఎవరమూ ఊహించని సంఖ్యలో పిల్లలు రావడం మొదలు పెట్టేరు. వాళ్ల ఇంటి చుట్టుప్రక్కల ఉన్న పిల్లల్ని మరికొంతమందిని కూడా తీసుకురావడం మొదలు పెట్టేరు. నా ఆత్మ విశ్వాసం ఆకాశం ఎత్తుకు పెరిగిపోయింది. రోజూ వెళ్లేప్పుడో, వచ్చేప్పుడో దేవుడు మాస్టారు కనిపిస్తూనే ఉన్నారు. నేను నమస్కారం పెట్టంగానే ఆయనా బదులుగా నవ్వుతూ తల ఊపి తన నడక సాగిస్తుంటారు. సాయంకాలాలు నేను వెళ్లే సరికి …

Continue reading దేవుడు మాస్టారు-మౌనం – గూడెం చెప్పిన కథలు – సారంగ Jun, 2016