పరిమళపు అర – కౌముది Jul, 2016, రచన ఇంటింటి పత్రిక Jul, 2017

* * * ప్రొద్దున్నే శారద తయారవుతున్నంతసేపూ ఆరాటంగా ఇల్లంతా తిరుగాడుతున్న సరస్వతమ్మ, ‘వెళ్లొస్తానమ్మా, జాగ్రత్త. భోజనం చేసి కాస్సేపు నిద్రపో. ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి’ అంటూ ఆమె ఆఫీసుకి వెళ్లిపోయాక వరండాలో కాస్సేపు కూర్చుని ఆనాటి దిన పత్రికను చదివే ప్రయత్నం చేసింది. మనసు నిమగ్నం కాలేదు. కొన్నాళ్లుగా ఆవిడకి ఆరోగ్యం బావుండటంలేదు. ఎప్పుడూ కడుపునొప్పనో,కడుపులో మంటనో బాధపడుతోంది. తన పనులు తను చేసుకుందుకు కూడా ఓపిక లేనట్టు తల్లి పడుతున్న అవస్థ శారద చూస్తూనే ఉంది. ఆవిడకి అలవాటైన …

Continue reading పరిమళపు అర – కౌముది Jul, 2016, రచన ఇంటింటి పత్రిక Jul, 2017

ఏ మాసమైతేనేం? – కౌముది Dec, 2014

* * * అవి మాఘ మాసారంభపు రోజులు! మంచు తెరలు ఒకింత త్వరగా కరిగి మాయమవుతున్నవేళ! తూర్పు వాకిట్లో వెలుగుపువ్వుల ముగ్గులేసేందుకు ప్రకృతి యవత్తూ సమాయత్తమవుతున్న వేళ! అలవాటైన దారుల వెంట చిరువెచ్చని కాంతులు నిశ్శబ్ద ప్రవాహాలవుతున్న వేళ! ... ... ... ఎక్కడో దూరంగా వినిపిస్తున్న పాపాయి ఏడుపు! బధ్ధకపు దుప్పట్లో మరింతగా ఒత్తిగిల్లుతున్న నిద్ర మెలకువవుతున్న వేళ! మడతపెట్టేసిన శరీరాన్ని ఒక్కసారి దులిపి పక్క దిగుతున్న వేళ! కిటికీ బయట ప్రహరీ మీదుగా …

Continue reading ఏ మాసమైతేనేం? – కౌముది Dec, 2014

నువ్వో తత్త్వవేత్తవా నేస్తం? – కౌముది Sept, 2014

* * * రాబోయే రహదారుల వెంట నాకోసం ఏదో అద్భుతం దారికాచి మరీ వేచి ఉందనే ఆశ నన్ను ప్రతి మలుపులోనూ ఉత్సాహంగా నడిపిస్తుంటే సహ పధికురాలివై కలిసిన నిన్ను కాస్సేపు విన్నాను! ఇవన్నీ ఎప్పుడో విన్నవేనన్న భావం!   మాట్లాడుతూ మాట్లాడుతూ, చీకటి గుహల్లోకి మాయమైపోతావ్! అంతలోనే అగాధాల్లాంటి సముద్రలోతుల్లోకి మునకలూ వేస్తావ్! కబుర్లకి విశ్లేషణల రెక్కలు తొడిగి, సిధ్ధాంతాల రూపులు దిద్దుతావ్!   నీభాష నాకింగా అలవడలేదు సుమా! అందుకే కాస్త దూరందూరంగానే …

Continue reading నువ్వో తత్త్వవేత్తవా నేస్తం? – కౌముది Sept, 2014

కలల మొలకలు – కౌముది Oct, 2013

* * * కలలు మొలకెత్తిన మొన్నలేవీ ? వాటిని నెమరేసిన నిన్నలేవీ ? మట్టి పెళ్లల వెచ్చని ఒడిలో ఒదిగి చూసే కలల కలవరింతల విత్తులేవీ ? అస్తమయ సూర్యుడితో గుసగుస లాడుతున్నాయా ? నాలుగు దిక్కులా చేతులు చాచి , భూమిని, ఆకాశాన్ని, పులుముకున్న మాయనీ , పలకరించే గాలినీ, ప్రవహించే మబ్బునీ , పరవశం గా చుట్టుకుని, లోవెలుగుల జాడల్ని వెతుక్కుంటున్నాయా ? నిన్న నువ్వూ ఉన్నావ్, నేనూ ఉన్నాను ! నిలువెల్లా …

Continue reading కలల మొలకలు – కౌముది Oct, 2013

పరిమళం – ఆకాశవాణి, కౌముది Aug, 2015

* * * తెల్లవారి లేస్తూనే గుమ్మం ముందు పాల ప్యాకెట్ తీసుకుంటూ, ఇంటి కాంపౌండ్ లోనూ, బయటా అరడజను పైగా స్కూటర్లు ఉండటం గమనించింది శారద. విషయం అర్థం కాలేదు. తలుపు మూసి పనుల్లో పడిన శారద ఆలోచనలు సాగుతూనే ఉన్నాయి.క్రిందపోర్షన్ లో వాళ్లు వచ్చి మూడు నాలుగు నెలలవుతోంది. ఇంటావిడ రాజమ్మమ్మ పధ్ధతిగా ఉండే మనిషి. ఆవిడ పెట్టే రూల్సన్నీ అద్దెకొచ్చేవాళ్లు ఒప్పుకుని తీరవలసిందే. సిటీలో కొడుకు దగ్గర ఉంటూ, అప్పుడప్పుడు వచ్చి కొన్నాళ్ళు …

Continue reading పరిమళం – ఆకాశవాణి, కౌముది Aug, 2015

అద్దం – ఆకాశవాణి 2014, కౌముది April, 2015

* * * సూర్యుడు లోకబాంధవుడు కదూ చుట్టూ ఉన్న లోకంతో తన బాంధవ్యాన్ని మరింత    స్పష్టంగా ప్రదర్శిస్తున్నాడు. వేసవి ఎండ చురచుర లాడుతోంది . ఆధార్ కార్డ్ కోసం నిలుచున్న సావిత్రికి అసహనంగా ఉంది . చుట్టూ రణగొణ ధ్వనులతో నిరంతరాయంగా కదులుతున్న ట్రాఫిక్. క్యూలో నిలబడిన వాళ్లందరూ ఏవేవో మాటల మధ్య ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. వెనక నిలుచున్నవాళ్ల మాటలు వద్దన్నాచెవిన పడుతున్నాయి. 'వదినా,విన్నావా? సుందరమ్మ కీ , కూతురికీ చెడింది. ఇక పుట్టింటికీ,తనకీ రుణం తీరిపోయిందని వెళ్లిపోయిందిట  ఆ పిల్ల.’ ‘ఏమొచ్చిందిటా? ’  విసుక్కుందా వదినగారు. * …

Continue reading అద్దం – ఆకాశవాణి 2014, కౌముది April, 2015

గులాబీల తోట – కౌముది Jan-Dec, 2014

* * * “There have been great societies that did not use the wheel, but there have been no societies that did not tell stories”- Ursula K. Le Guin, American Author. మాన్ సూన్ ఆరంభం అయ్యేందుకు ఇంకొక్క నాలుగు రోజులు సమయం ఉంది. ఎండలతో ఉక్కిరిబిక్కిరైన ముంబై మహా నగరం కమ్ముకొచ్చే మేఘాల కోసం ఎదురు చూస్తోంది. * * *

అతని నవ్వు – కౌముది July, 2013

* * * అతనూ, ఆకాశం నిరంతరం నా వెంట వస్తూనే ఉంటారనుకున్నా, అప్పుడెప్పుడో......... దశాబ్దాల క్రితం అతని చేతిలో చెయ్యేసి నడవటం నేర్చుకున్నా అది మొదలు అలవాటుగా నడుస్తూనే ఉన్నాను. అలుపే తెలియనట్లు నడుస్తూనే ఉన్నాను. కిటికీలోంచి ఉరిమే మేఘం ఝడిపించినా వాకిలి దాటితే వెల్లువెత్తే జనప్రవాహం ఉక్కిరిబిక్కిరి చేసినా ‘భయం నీ ప్రకృతి, అంతే’ అంటూ నవ్వేవాడు! నిజమేనేమో! ఆరోజు అకసాత్తుగా ఒక అస్వస్థత అతన్ని కమ్మినప్పుడు మాత్రం భయం మర్చేపోయాను. ఆ క్షణమే …

Continue reading అతని నవ్వు – కౌముది July, 2013