* * * నువ్వొస్తున్నావట! ఔను, పాత ఉక్రోషాలన్నీ మర్చేపోయిందీ మనసు వచ్చేస్తున్నావ్, నాకు తెలుసు. వేల మైళ్ల దూరాన్ని మనో వేగంతో ముందే దాటేస్తావ్, ఇంతలోనే నడి ప్రయాణపు పలకరింపువవుతావు. ఒట్ఠి పిచ్చివాడివి! సమాంతరంగా నీతో ప్రయాణం చేస్తూనే ఉన్నానన్న వాస్తవం మరిచేపోతావ్ ఓహ్, నిజంగా వచ్చావ్. అదే మబ్బుపట్టిన సాయంకాలం, అదే ఎదురుచూపుల వాకిలి ఆ కాసిని మెట్లూ అధిగమించలేని అలసట నీ అడుగుల్లో నీ ముఖంలో ఒక దైన్యం మాటల దొంతరలు పేర్చని …
Tag: కవిత్వం
ఏకాంతద్వీపం – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2020
* * * ఇది ఒక ఏకాంతద్వీపం! ఇక్కడ నిశ్శబ్దమే పహరా కాస్తుంటుంది కాస్త చెవి ఒగ్గి వినాలే కానీ ఏవో యంత్రాల ఘోష నీచుట్టూ ఒక ప్రవాహమై కదులుతుంటుంది ఇక్కడ ఆకలిదప్పులే కాదు నిద్ర కూడా నిన్ను పలకరించదు పగలు రాత్రులంటూ భేదమేమీ ఉండదు నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు. పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి గాజు తలుపులు, మెరుపు వెలుగులు నిన్ను పరివేష్టించి ఉంటాయి నీ శరీరభాగాలన్నీ …
Continue reading ఏకాంతద్వీపం – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2020
నిశ్శబ్దాన్ని దాటుకుని… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Sept, 2018
* * * నాకు శబ్దం కావాలి ఇలా చెబుతున్నానని నాకు రణగొణధ్వనులంటే ఇష్టం అనుకునేవు! లేదు, లేదు… ఇన్నాళ్లూ నిశ్శబ్దాన్ని ప్రేమించానన్నది నిజమేను! దాన్ని నా చుట్టూరా పరచుకుని పహరా కాసాను కూడా. ఆరుబయలు ఆటస్థలాలు, ఆకుపచ్చని పరిసరాలు, సుతిమెత్తని నీటి ప్రవాహాలు పంచే సందడిని ప్రేమించాను. ఇంట్లో, ప్రయాణాల్లో, సినిమాహాళ్ళలో, అక్కరలేకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఓటి మాటల చప్పుడు జొరబడకుండా కొన్ని పరిధులనూ పెట్టుకున్నాను! కానీ చూస్తున్నంతలో తెల్లవారి వాకిళ్లలో సందడిచేసే కళ్లాపులు ఆధునికత …
Continue reading నిశ్శబ్దాన్ని దాటుకుని… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Sept, 2018
ఒక అబ్బాయి – ఒక అమ్మాయి, అనువాదంః రచన సోమయాజుల
* * * కలత నిద్రలో ఒత్తిగిలితే, పెరట్లో అమ్మ నాటిన గులాబీ కంటిముందుకొచ్చింది చిత్రంగా! ఆ వెనుకే లైబ్రరీ మెట్లమీద నీ చిరునవ్వూ! ఈ చందమామ, ఈ నక్షత్రాలు, ఈ పువ్వులు, ఈ వాన చినుకులు, ఈ ఏడు రంగుల హరివిల్లూ నీ వెనుకే కదూ పుట్టుకొచ్చాయి! నీ అమాయకపు ముఖం చూసి గాలికి కదిలే చిరు మేఘమనుకున్నా, ఉప్పెనై నన్ను కమ్ముకుని ఊపిరాడనివ్వని తుఫానువవుతావనుకోలేదు! వేళకాని వేళ విసిగించే నల్లమబ్బు నీ పరిచయంతో చల్లని …
Continue reading ఒక అబ్బాయి – ఒక అమ్మాయి, అనువాదంః రచన సోమయాజుల
రాత్రి గడిచింది – అడుగు – అంతర్జాల సాహిత్య మాసపత్రిక – Dec, 2017
* * * రాత్రి గడిచింది! దీపపు సెమ్మెల పహరాతో అలసిన అరేబియా బద్ధకంగా ఒత్తిగిల్లింది! అలలెరుగని సముద్రపు వాకిట్లో గోర్వెచ్చని స్పర్శ నగరాన్ని నిద్ర లేపింది! నీటి అంచున ఆటలాడిన ఆకాశహర్మ్యాలు అంతలో అంతర్ముఖమైపోయాయి! శతాబ్దాల విక్టోరియా టెర్మినస్ పేరు మార్చేసుకుంది, సడలని రాచదర్పం నిటారుగా నిలబడే ఉంది! నగరపు అడుగుల కింద పరుగెడుతున్న కాలం, గమ్యం చేరే తొందరలో ప్రవాహ జనం. అగమ్య గోచరమవుతున్నలయ! తోసుకొచ్చే వేలవేల ముఖాలు, తిరిగి చూసే వ్యవధి …
Continue reading రాత్రి గడిచింది – అడుగు – అంతర్జాల సాహిత్య మాసపత్రిక – Dec, 2017
నేను లేని ప్రపంచం – ఈమాట వెబ్ మ్యాగజైన్ – Dec, 2017
* * * ఆమె గడుసైనది! తన పనిని ఎక్కడున్నా ఏ పరిస్థితిలోనైనా నెరవేర్చుకోగల సమర్థురాలు! అలాటి సమర్థత నేనెవరిలోనూ చూడలేదు, నిజం! ఈమధ్య తరచుగా ఇక్కడిక్కడే తిరుగుతోంది అసలు ఇక్కడేమిటి అక్కడేమిటి అన్నిచోట్లకీ వెళుతుంది! ఏవేళలోనైనా వెళ్తుంది! నేను గమనించలేదనుకుంటోంది! వాకిట్లోనూ వంటింటి గుమ్మంలోనూ డాబా మీద పిట్టగోడ దగ్గర ఆరుబయట ఆకాశం క్రింద పడకగది కిటికీ ప్రక్కన, సరేసరి. ఉదయపు నిశ్శబ్దంలో కాఫీకప్పుతో కూర్చుంటే… డైనింగ్ టేబిల్ అంచున నిలబడి నన్నే చూస్తున్నట్లుంటుంది! నా …
Continue reading నేను లేని ప్రపంచం – ఈమాట వెబ్ మ్యాగజైన్ – Dec, 2017
రండి, కుటుంబ గౌరవాలు కాపాడుకుందాం! – చైతన్య మానవి, ఐద్వా – Nov, 2017
* * * కుటుంబం అంటేనే ఒక ‘గౌరవవాచకం’ అయిపోయిందిప్పుడు ! జీవించేందుకున్న పరిస్థితులన్నీ కుటుంబాల విచ్ఛిన్నతకి పనిచేస్తుంటే, కుటుంబం ‘గౌరవవాచకం’ కాక ఇంకేమవుతుంది? అంతేకాదు, కుటుంబానికి తనదైన ‘స్వంత గౌరవం’ అనే అదనపు హోదా కూడా తోడైందిప్పుడు ! ఈ గౌరవాలూ, హోదాలు గురించి …
Continue reading రండి, కుటుంబ గౌరవాలు కాపాడుకుందాం! – చైతన్య మానవి, ఐద్వా – Nov, 2017
సముద్రం – వాకిలి సాహిత్య పత్రిక Nov, 2017
* * * నిన్ను చూడాలని వస్తూ సముద్రాన్ని యథాలాపంగా దాటేసేను. అనంతమైనది కదా, నా నిర్లక్ష్యాన్ని నిబ్బరంగా దాచుకుంది. బొమ్మల దుకాణం ముందు మోకరిల్లిన బాల్యంలా ఈ గుండె నీ సమక్షాన్ని శ్వాసిస్తోంది! మన మధ్య దూరాలూ, కాలాలూ కనుమరుగవుతూ సాగిపోయినపుడు సూర్యుడూ, చంద్రుడూ, నక్షత్ర రాసులూ ఇట్టే కరిగి పోయాయి. కరిగిన ఒక్కో క్షణం ఒక్కో జ్ఞాపకమై బరువెక్కుతుంటే భుజాల్ని విల్లులా వంచి తిరుగు ప్రయాణమయ్యాను! శూన్య హస్తంలా నిలబడిన ఆకాశం స్థితప్రజ్ఞతను ఎప్పుడో నేర్చుకుంది. …
అక్కరలేనితనం – ఈమాట వెబ్ మ్యాగజైన్ – Oct, 2017
మనుషుల మధ్య కొత్తగా చేరుతున్న 'అక్కరలేనితనం' ఒక అవాస్తవికపు ఇరుకుతనం. దాపరికం తెలియని మమతల కూనిరాగాల మధ్య తనకు చోటులేదని ఒప్పుకుతీరవలసిందే.
కిటికీ పక్క ఆకాశం – ఈమాట Jun, 2017
* * * ఈ కిటికీ పక్క ఆకాశం ఇన్నాళ్లూ నాదే! ఆకాశం మిద్దె క్రింద అడవిలాటి ఆకుపచ్చకి మెలకువతో ఉన్న నా క్షణాలన్నీ ఇచ్చేసేను నిజం చెప్పేస్తున్నా ఇటుగా ఒంగిన ఆకాశంతో ఎప్పుడో ప్రేమలో పడ్డాను. ఆ మూలగా గడ్డి చెదిరిన పాకలో రెండు ఆవులు విలాసంగా మేస్తున్నాయి, అరమూత కళ్లతో ఆకాశాన్ని చూస్తూ ఆనక నెమరేస్తున్నాయి. ఎవరెవరో వచ్చారు, ఏవో కొలతలు వేశారు! ఇసుక లారీలొచ్చాయి ఇనుప చువ్వలొచ్చాయి మోడువారిన చెట్లొచ్చాయి. కరకరమంటూ కంకర …