కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020

* * * ప్రతిభాభారతి వాళ్ల ఇల్లు నేను క్లాసుకొచ్చేదారిలోనే ఉంటుంది. సరిగ్గా నేను బస్సు దిగి వచ్చే సమయానికి రోజూ నవ్వుముఖంతో, చంకన చిన్నతమ్ముడితో ఎదురయ్యేది. స్కూల్లో చదువుకుంటున్న పిల్లే. కిటికీ దగ్గర నుంచుని సాయంత్రం నా క్లాసులో జరిగేదంతా చూస్తుండేది. ఒక్కోసారి గుమ్మంలోకొచ్చి కూర్చునేది. ఇంతలో తల్లి పిలుపుకి పరుగెత్తి వెళ్లిపోయేది. ఆమె పెద్ద తమ్ముడు ప్రైవేటు స్కూల్లో చదువుతాడని, హోమ్ వర్క్ స్కూల్లో చేయించేస్తారని తెలిసింది. తనతో చదివే పిల్లలు చెబుతుండేవారు, “క్లాసులో …

Continue reading కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020

నేనూ హాస్టల్ కి వెళ్తా…సారంగ వెబ్ మ్యాగజైన్ July 15, 2020

* * * ఒకరోజు నందుని తరుముతూ ఒకామె క్లాసు వరకు వచ్చింది. అదే మొదటిసారి ఆమెను చూడ్డం. “టీచరుగారూ, ఈడితో ఏగలేకపోతన్నాను. కాస్త బయం చెప్పండి” అంది ఆయాసం తీర్చుకుందుకన్నట్టు గుమ్మంలో నిలబడి. నందు నాకు పరిచయమే. ఈ సంవత్సరమే ఇక్కడ దగ్గర్లోకి ఇల్లు మారి వచ్చారని చెప్పాడు మొదటిరోజు క్లాసుకొచ్చి. నందుకి పదేళ్లుంటాయేమో. రెండేళ్లు మధ్యలో బడికి పంపనేలేదని చెప్పిందామె. ఇంకా మూడులోనే ఉన్నాడు. వాడిచేతిలో సగంసగం తింటున్న జామకాయ ఉంది. వాడు తల్లికి …

Continue reading నేనూ హాస్టల్ కి వెళ్తా…సారంగ వెబ్ మ్యాగజైన్ July 15, 2020

కడుపులో భయం పెట్టుకు బతకాల! – సారంగ వెబ్ మ్యాగజైన్ June 15, 2020

* * * “ఇట్టాటియన్నీ ఇంక జరగవులే టీచరుగారూ” అంది నాకు భరోసా ఇస్తూ.                                                     దసరా సెలవులు పూర్తై పిల్లలంతా క్లాసులకొస్తున్నారు. ఎప్పటిలాగే సెలవులు తర్వాత మొదటిరోజు హాజరు తక్కువగానే ఉంది. క్లాసులో పదిమంది కూడా లేరు. శ్రావ్య వచ్చి …

Continue reading కడుపులో భయం పెట్టుకు బతకాల! – సారంగ వెబ్ మ్యాగజైన్ June 15, 2020

రెండు ప్రపంచాలు – ఈమాట వెబ్ మ్యాగజైన్ May, 2020

* * * పొద్దున్నే చిన్నగా మొదలైన వర్షం అలా పడుతూనే ఉంది. వేసవి కాలం వెళ్లి చాలారోజులే అయింది. రుతువులు ఆరు అని చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నా, సంవత్సరమంతా ఒకటే రుతువు అనిపిస్తోందిప్పుడు. ఏ టి.వి. వార్తల్లోనో ఎక్కడో పడుతున్న వర్షాన్ని చూస్తే సంబరంగా ఉంటుంది. చాలాకాలం తర్వాత మబ్బు పట్టిన ఆకాశాన్ని, చినుకుల్ని చూస్తున్న నాకు ఆఫీసుకి వెళ్లాలనిపించలేదు, హాయిగా ఏ పుస్తకమో పుచ్చుకు కూర్చోవాలని ఉంది. కానీ ఎందుకో ఒక అనీజీనెస్! క్రితం …

Continue reading రెండు ప్రపంచాలు – ఈమాట వెబ్ మ్యాగజైన్ May, 2020

మంచినీళ్ళది ఏ మతం? – సారంగ వెబ్ మ్యాగజైన్ March 1, 2020

* * *                                          స్కూళ్లు మొదలయ్యాయి. కొత్త విద్యా సంవత్సరం. కొత్త యూనిఫారాలు, కొత్త క్లాసులు, కొత్త పాఠాలు. ఓహ్, పిల్లల సంబరం చెప్పనలవికాదు. కొత్తగా చేరే పిల్లలు. కొత్త స్నేహాలు. ప్రతి సంవత్సరం మొదట్లోనూ ఈ సంబరం చూస్తే మనసు చిన్ననాటి రోజుల్లోకి వెళ్లిపోతుంది. సాయంకాలం క్లాసులకి …

Continue reading మంచినీళ్ళది ఏ మతం? – సారంగ వెబ్ మ్యాగజైన్ March 1, 2020

…మాయలు నీవే కప్పి – దునియా, మన తెలంగాణా ఆదివారం పత్రిక, 27 Oct, 2019

  * * * వర్షం ఆగకుండా నిలబడి కురుస్తోంది.ఎందుకో మనసంతా దిగులు దిగులుగా ఉంది.తెలవారిందో లేదో తెలియనీయని చిక్కని మబ్బులు తమ సొద ఏదో చెప్పుకుంటూ ఈ వర్షపు ఉదయయానికి గుబులు పులుముతున్నాయి. బాల్కనీలోకి చిన్నజల్లు కూడా రావటంలేదు.ఉయ్యాలలో మరింత సర్దుకుని కూర్చుంది శైలజ.ఆమెభర్త చంద్ర పనుందంటూ పెందరాళే ఆఫీసుకి బయలుదేరాడు.సంవత్సరం గ్యాప్ తర్వాత ఇంటికి వచ్చిన కొడుకు రాహుల్ రెండురోజులు మురిపించి వెళ్లిపోయాడు.ఒంటరితనం ఒక్కటే బెంగల్ బెంగల్ కి కారణమా? కాదులే,అది కూడా ఒక …

Continue reading …మాయలు నీవే కప్పి – దునియా, మన తెలంగాణా ఆదివారం పత్రిక, 27 Oct, 2019