* * * “సౌమ్యా” అన్న కేక వినిపించి, “అదిగో అమ్మ పిలుస్తోంది. ఇంక వెళ్తాను” అంటూ అయిష్టంగానే లిఫ్ట్ దగ్గరకి పరుగెత్తింది సౌమ్య. స్కూల్ బస్ దిగి స్నేహితులతో కాస్సేపు కబుర్లు చెప్పటం సౌమ్యకి అలవాటే. పిలవకపోతే అలా గంటలు గడిచిపోతాయి. రెండు కిలోమీటర్ల దూరమైనాలేని స్కూల్ కి సైకిల్ మీద వెళ్లమంటే స్నేహితులతో బస్ లోనే వెళ్తుంది. ఎన్నిసార్లు చెప్పినా మెట్లెక్కి రాదు. భార్గవికి కూతురు గురించిన ఈ చిన్న విషయాలే …