రెండు ప్రపంచాలు – ఈమాట వెబ్ మ్యాగజైన్ May, 2020

* * * పొద్దున్నే చిన్నగా మొదలైన వర్షం అలా పడుతూనే ఉంది. వేసవి కాలం వెళ్లి చాలారోజులే అయింది. రుతువులు ఆరు అని చిన్నప్పుడు పాఠాలు చదువుకున్నా, సంవత్సరమంతా ఒకటే రుతువు అనిపిస్తోందిప్పుడు. ఏ టి.వి. వార్తల్లోనో ఎక్కడో పడుతున్న వర్షాన్ని చూస్తే సంబరంగా ఉంటుంది. చాలాకాలం తర్వాత మబ్బు పట్టిన ఆకాశాన్ని, చినుకుల్ని చూస్తున్న నాకు ఆఫీసుకి వెళ్లాలనిపించలేదు, హాయిగా ఏ పుస్తకమో పుచ్చుకు కూర్చోవాలని ఉంది. కానీ ఎందుకో ఒక అనీజీనెస్! క్రితం …

Continue reading రెండు ప్రపంచాలు – ఈమాట వెబ్ మ్యాగజైన్ May, 2020

ఏకాంతద్వీపం – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2020

* * * ఇది ఒక ఏకాంతద్వీపం! ఇక్కడ నిశ్శబ్దమే పహరా కాస్తుంటుంది కాస్త చెవి ఒగ్గి వినాలే కానీ ఏవో యంత్రాల ఘోష నీచుట్టూ ఒక ప్రవాహమై కదులుతుంటుంది ఇక్కడ ఆకలిదప్పులే కాదు నిద్ర కూడా నిన్ను పలకరించదు పగలు రాత్రులంటూ భేదమేమీ ఉండదు నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు. పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి గాజు తలుపులు, మెరుపు వెలుగులు నిన్ను పరివేష్టించి ఉంటాయి నీ శరీరభాగాలన్నీ …

Continue reading ఏకాంతద్వీపం – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2020

దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2019

* * * డిసెంబరు నెల ఆఖరి రోజులు. దిల్లీ చలి గట్టిగానే ఉంది. స్వెట్టర్లు వగైరాలన్నీ మంచి వాడకంలో ఉన్నాయి. తెల్లవారితే హరిద్వార్, రిషికేశ్ ప్రయాణం పెట్టుకున్నాను. స్కూలు సెలవులు. ఇంట్లో చేసేదేమీ లేదు, నాలుగు నెలలుగా ఎందుకో హరిద్వార్ వైపు మళ్లింది మనసు. మధ్య మధ్య సెలవులు రాకపోలేదు. మురళికి తీరిక లేని ఉద్యోగం. ఆదివారం ఒక్కరోజు డ్రైవ్ చేసుకుంటూ వెళ్ళి వద్దాం అంటే వినడు. బాస్‌కి ఇష్టం ఉండదు, సిటీ దాటి వెళితే… …

Continue reading దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2019

నేను లేని ప్రపంచం – ఈమాట వెబ్ మ్యాగజైన్ – Dec, 2017

* * * ఆమె గడుసైనది! తన పనిని ఎక్కడున్నా ఏ పరిస్థితిలోనైనా నెరవేర్చుకోగల సమర్థురాలు! అలాటి సమర్థత నేనెవరిలోనూ చూడలేదు, నిజం! ఈమధ్య తరచుగా ఇక్కడిక్కడే తిరుగుతోంది అసలు ఇక్కడేమిటి అక్కడేమిటి అన్నిచోట్లకీ వెళుతుంది! ఏవేళలోనైనా వెళ్తుంది! నేను గమనించలేదనుకుంటోంది! వాకిట్లోనూ వంటింటి గుమ్మంలోనూ డాబా మీద పిట్టగోడ దగ్గర ఆరుబయట ఆకాశం క్రింద పడకగది కిటికీ ప్రక్కన, సరేసరి. ఉదయపు నిశ్శబ్దంలో కాఫీకప్పుతో కూర్చుంటే… డైనింగ్ టేబిల్ అంచున నిలబడి నన్నే చూస్తున్నట్లుంటుంది! నా …

Continue reading నేను లేని ప్రపంచం – ఈమాట వెబ్ మ్యాగజైన్ – Dec, 2017