ఊర్వశి – పుస్తక సమీక్ష, పుస్తకం. నెట్, Mar. 2023

* * *                                                                                 కాళిదాసు నాటకానికి నవలారూపం                                                                                                      శ్రీమతి వాడ్రేవు వీరలక్ష్మీదేవి                                                            భారతీయ సాహిత్యంలో ముఖ్యంగా సంస్కృతంలో మహాకవి కాళిదాసు రచనల గురించి విననివారుండరు. ముఖ్యంగా దృశ్యరూపంలో రసజ్ఞులను అలరించేందుకు రచించిన అద్భుతమైన నాటకాలు గురించి విన్నప్పటికీ వాటిని సంస్కృతంలో చదవి ఆస్వాదించగలిగే పాఠకులు అరుదే. సాహిత్యాభిమానుల కోసం మాళవికాగ్నిమిత్రం, అభిజ్ఞాన శాకుంతలం ఇప్పటికే తెలుగులో నవలారూపంలోకి తీసుకొచ్చిన అనల్ప ప్రచురణకర్తలు విక్రమోర్వశీయం నాటకానికి కూడా తెలుగు నవలారూపం ఇవ్వాలని సంకల్పించారు. …

Continue reading ఊర్వశి – పుస్తక సమీక్ష, పుస్తకం. నెట్, Mar. 2023

మరపురాని మనీషి – పుస్తక సమీక్ష, పుస్తకం.నెట్, 9 Feb. 2023

* * *                                                 20వ శతాబ్దపు తెలుగు తేజోమూర్తుల అపురూప జీవిత చిత్రాలు                                                                  తిరుమల రామచంద్ర ప్రకృతి అందించిన భౌగోళికమైన ప్రత్యేకతలతో ఒక ప్రాంతం సహజంగా రూపుదిద్దుకుంటుంది. భౌతికమైన అసిత్వాన్ని దాటి తనదైన భాషా, సంస్కృతుల్నిపెంపొందించుకుని క్రమక్రమంగా ఒక విశిష్టమైన గుర్తింపును తెచ్చుకుంటుంది. ఆ విశిష్టతకు కారణమైన ఎందరో మహానుభావుల కృషి, త్యాగాలు ఒక అపురూపమైన వారసత్వాన్ని భావితరాలకి అందిస్తాయి.   ఇప్పుడు మనం మాట్లాడుకునే పుస్తకం ఇలాటి అపురూపమైన …

Continue reading మరపురాని మనీషి – పుస్తక సమీక్ష, పుస్తకం.నెట్, 9 Feb. 2023

ప్రియ శరణార్థీ! నా జీవితం ఇలా నడవనీ…- కవిత్వం (అనువాదం) – సారంగ వెబ్ మ్యాగజైన్, 15 Dec.2022

* * *   నన్నల్లుకున్న వెచ్చని కార్డిగన్, మెత్తని నా అరచేతుల మధ్య పొగలు కక్కే ‘లికరస్’ టీ……… పౌర హక్కుల్ని పగటికలలుగా కనేందుకు ఈ నేపథ్యం సహజంగా లేదూ? నువ్వూ, నేనూ పంచుకున్న ఆకాశం కప్పు క్రింద, నా గది కిటికీ లో నీ వైపు నుంచి తళుక్కుమంటూ నడిచొస్తున్న నక్షత్రాలు! కానీ, దైన్యంతో అలసిన నీ ముఖంలోని కన్నీరు మాత్రం ఈ నేల మీద అగోచరంగానే ఉంది. తల మీద కప్పుకోసం నువ్వు పేర్చుకుంటున్న …

Continue reading ప్రియ శరణార్థీ! నా జీవితం ఇలా నడవనీ…- కవిత్వం (అనువాదం) – సారంగ వెబ్ మ్యాగజైన్, 15 Dec.2022

బడి బయటి పాఠాలు, ఎనిమిదవ ఎపిసోడ్ – కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020 – ఆడియో కథ

* * * మనం బడిలో పాఠాలు నేర్చుకుంటాం కదూ. బడి బయట కూడా పాఠాలు నేర్చుకుంటాం. కాకపోతే బడిలో మనకు తెలిసి పాఠాలు నేర్చుకుంటాం. నిజం! బడి బయట నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలు. వీటిని బడిలో నేర్పరు. మన జీవితాన్ని అందంగా, బయట ప్రపంచానికి, మనకి కూడా ఉపయోగకరంగా మలచుకోవాలంటే ఈ పాఠాలు అవసరం. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటాయి . ఒక …

Continue reading బడి బయటి పాఠాలు, ఎనిమిదవ ఎపిసోడ్ – కాసిని మరమరాలు, కాస్త కోడిగుడ్డు కూర – సారంగ వెబ్ మ్యాగజైన్ Aug 15, 2020 – ఆడియో కథ

బడి బయటి పాఠాలు, ఏడవ ఎపిసోడ్ – నేనూ హాస్టల్ కి వెళ్తా –  సారంగ వెబ్ మ్యాగజైన్ July 15, 2020 – ఆడియో కథ

* * * మనం బడిలో పాఠాలు నేర్చుకుంటాం కదూ. బడి బయట కూడా పాఠాలు నేర్చుకుంటాం. కాకపోతే బడిలో మనకు తెలిసి పాఠాలు నేర్చుకుంటాం. నిజం! బడి బయట నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలు. వీటిని బడిలో నేర్పరు. మన జీవితాన్ని అందంగా, బయట ప్రపంచానికి, మనకి కూడా ఉపయోగకరంగా మలచుకోవాలంటే ఈ పాఠాలు అవసరం. మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటాయి . ఒక …

Continue reading బడి బయటి పాఠాలు, ఏడవ ఎపిసోడ్ – నేనూ హాస్టల్ కి వెళ్తా –  సారంగ వెబ్ మ్యాగజైన్ July 15, 2020 – ఆడియో కథ

లేడీ డాక్టర్స్ – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 10 Aug. 2022

* * *                                 ఒక సమాజం ఆరోగ్యంగా ఉండాలంటే ఎందరెందరి సేవలో అవసరమవుతాయి. అందులో ముందు వరుసలో ఉండేది డాక్టర్స్. ఈ వారం నేను చదివిన “లేడీ డాక్టర్స్“ పుస్తకం స్త్రీలు డాక్టర్ వృత్తిని చేపట్టేందుకు దశాబ్దాల వెనుక ఉన్న సమాజ పరిస్థితులు, పరిమితులు, ఆలోచనలు ఏమిటన్నది చెప్పింది. లేడీ డాక్టర్ అన్న పదం వెనుక ఉన్న కథను ఊహకి అందని వాస్తవాలతో మన ముందుంచింది.   కవితారావు గారు 2021లో ప్రచురించిన “లేడీ డాక్టర్స్” …

Continue reading లేడీ డాక్టర్స్ – పుస్తక సమీక్ష – పుస్తకం. నెట్, 10 Aug. 2022

వివక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక Aug. 2022

* * *                                            వివక్షా? అలాటిదేం లేదే. భారత రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది- కులం, మతం, వర్గం, లింగం, భాష ఇలాటి భేదాలేవీ ఉండవని, అన్నిటా అందరూ సమానమేననీ!                                      అంటే వివక్షలంటూ ఉండవన్నమాట! మరి, ఈ పదం ఎలా పుట్టిందంటారా? భలే సులువు! ఇంట్లోంచి, మనుషుల్లోంచి, ఆలోచనల్లోంచి, అహంకారాల్లోంచి అలా వైనవైనాలై, రాజ్యాంగ నిర్మాతలకు తోచని ఎన్నో మార్గాల్లోంచి పుడుతూనే ఉంది! వారి మేధకు అందని దారుల్లో పెత్తనం చేస్తూనే ఉంది. ముందుగా ఏదైనా ఒక …

Continue reading వివక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక Aug. 2022

షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Aug. 2022 Part – 2

* * *   Continued from Part 1 ఆరవ అధ్యాయంలో, మానవ జీవన విధానానికి స్ఫూర్తిదాతగా షేక్స్పియర్ ను చెపుతారు రచయిత్రి. ఆయన రచనల్లో దేశప్రేమ, జాతీయతా భావాలు పుష్కలంగా ఉంటాయి. ఉదాహరణకి దేశ బహిష్కరణకు గురైన రాజు తిరిగి దేశానికి చేరినపుడు అక్కడి మట్టిని ముద్దాడుతాడు. చదివే వారిలో కూడా అప్రయత్నంగా దేశంపట్ల అనిర్వచనీయమైన భక్తిభావం కలుగుతుంది. షేక్స్పియర్ దృష్టిలో కాలానికున్న విలువ మరి దేనికీ లేదు. రాజులు, రాజ్యాలు, కోటలు, మనుషులు అందరూ …

Continue reading షేక్స్పియర్ ను తెలుసుకుందాం – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Aug. 2022 Part – 2

ఇంగ సెలవా మరి? – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, May. 2022

* * *                                                                 యం. ఆర్. అరుణకుమారి ఒక్క నెల క్రితమే విజయవాణి ప్రిటర్స్ ద్వారా ముద్రణ పొంది అందుబాటులోకి వచ్చిన కొత్త పుస్తకం ఈ నెల మనం మాట్లాడుకోబోయే “ఇంగ సెలవా మరి!”. ఎస్. అన్వర్ ముఖ చిత్రం పుస్తకానికి అందాన్ని, హుందాతనాన్ని ఇచ్చింది. రచయిత్రి యం. ఆర్. అరుణకుమారి గారి పేరు, కథలు పాఠకులకి సుపరిచితమే.                           ముందుమాటలో ప్రముఖ సినీ కథా రచయిత వి. విజయేంద్రప్రసాద్ గారు ఈ కథలన్నీ …

Continue reading ఇంగ సెలవా మరి? – పుస్తక సమీక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, May. 2022