గూడెం – ఒక దశాబ్దకాల పరిచయం! – వ్యాసం – సంచిక వెబ్ మ్యాగజైన్, 18 Dec.2022

  * * *                   2023! కొత్త సంవత్సరం ఒక్క నెల దూరంలో ఉంది. ఎప్పటిలాగే కొత్త సంవత్సరం అంటే ఒక ఉత్సాహం. రేపటిలోకి తొంగిచూసేద్దామన్న ఒక తొందర మనసంతా. ఒక దశాబ్ద కాలం ఎలా గడిచిపోయిందో అని ఆలోచించుకుంటే నా జీవితంలోనే ఒక అతి ముఖ్యమైన సందర్భం ఇప్పుడే, ఇక్కడే జరిగిందని తోచి భలే సంతోషం వేసింది. వెంటనే అదంతా రాసి పెట్టుకోవాలన్న ఆలోచనే ఈ పోస్ట్ ... అవును, ఒక పదేళ్ల క్రితం …

Continue reading గూడెం – ఒక దశాబ్దకాల పరిచయం! – వ్యాసం – సంచిక వెబ్ మ్యాగజైన్, 18 Dec.2022

 అరకు లోయ – ఆదివాసీల స్వర్గం! – యాత్రా సాహిత్యం – సంచిక వెబ్ మ్యాగజైన్, 14Aug.2022

                   * * *                                       విశాఖ నుంచి డ్రైవ్ చేసుకుంటూ అరకు బయలుదేరేం. ప్రయాణమంతా ఆహ్లాదకరమైన దారివెంట నడిచింది. ఎన్నాళ్లుగానో కలలుగన్న అరకులోయ చూడటం ఇప్పటికి కుదిరింది. ప్రకృతి చూపును తిప్పుకోనివ్వదు. ఒక హాయి ఏదో మనల్ని చుట్టేస్తుంది. రంగులు, కొండలు, లోయలు, పచ్చని చెట్లలోంచి వినవచ్చే కమ్మని రాగాలు, ఆకాశం నుంచి స్వేచ్ఛగా దూసుకొచ్చే సూర్యకాంతులు... ఎన్నింటినని కాచుకోగలం?! ప్రకృతిమధ్య మనం ఎంత చిన్నవాళ్లమో మరీమరీ అర్థమవుతుంది. ఏదో తెలియని ఒక తాత్త్వికత మనలోకి …

Continue reading  అరకు లోయ – ఆదివాసీల స్వర్గం! – యాత్రా సాహిత్యం – సంచిక వెబ్ మ్యాగజైన్, 14Aug.2022

భారత దేశ పక్షాన | The Case For India By Will Durant | Book Launch By Hon’ble Vice President Of India

https://youtu.be/KXEMEIuCsvs   For more details, here are the event details. CLICK HERE. ▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬▬▬▬▬▬ ▬▬▬▬▬▬▬▬▬▬ VIDEO Credit: Channel: I&PR DEIE VIJAYAWADA Video: Hon'ble Vice President of India M.Venkaiah Naidu Garu Launching the Telugu Translation of Book "Case For India" at Swarna Bharathi Trust, Atkuru on 02-03-2022 News Article Related To Event: https://www.thehansindia.com/andhra-pradesh/every-stranded-indian-in-ukraine-will-be-brought-back-vice-president-731590?infinitescroll=1 For more stories, …

Continue reading భారత దేశ పక్షాన | The Case For India By Will Durant | Book Launch By Hon’ble Vice President Of India

తొమ్మిది దశాబ్దాల సామాజిక చైతన్యం నంబూరి పరిపూర్ణ! – వ్యాసం, Jun.2022

 * * *          అవును, తొమ్మిది దశాబ్దాల సామాజిక చైతన్యం ఆమె!                                ‘’వెలుగు దారులలో…’’ అంటూ తన ఆత్మకథను మనకందించిన పరిపూర్ణ గారి జీవితం పుట్టినప్పటినుంచీ సమాజంతో ముడిపడి ఉంది. తన పెద్ద కుటుంబ బాధ్యతలే కాక చుట్టుపక్కలున్న వారి మంచిచెడ్డలను తనవిగా భావించి అందరికీ సాయపడే తల్లి లక్ష్మమ్మ గారు, దేశభక్తి, సోషలిష్టు భావాలతో దేశ స్వాతంత్రోద్యమంలో జైళ్లకెళ్లిన అన్నయ్యలు చిన్నతనంలోనే పరిపూర్ణ గారి మీద గాఢమైన ముద్రను వేసారు. జీవితం తనకోసం మాత్రమే …

Continue reading తొమ్మిది దశాబ్దాల సామాజిక చైతన్యం నంబూరి పరిపూర్ణ! – వ్యాసం, Jun.2022

హరివిల్లుల మెరుపుల్లో అనంతపురం – వ్యాసం – సంచిక వెబ్ మ్యాగజైన్, 1Apr. 2022

* * *                                   వర్షపు చినుకు కోసం సంవత్సరాలు ఎదురుచూసే అనంతపురంలో హరివిల్లులు ఎక్కడివని అనుకుంటున్నారా? రండి రండి చూద్దాం అవి ఏమిటో…                                  రాయలసీమ ప్రాంతంలో నీటి సమస్యలు, రైతుల ఆత్మహత్యలు వంటివి నిత్యం మనకు కనిపించే వార్తలు. అనంతపురం ఈ సీమ ప్రాంతంలోని పట్టణమే. ఈ ప్రాంతం నుంచి అనేకమంది గొప్ప రచయితలున్నారు. ఎందరో సుప్రసిద్ధ రాజకీయ నాయకులున్నారు. ఉన్నత విద్యాసంస్థలున్నాయి. పట్టణ నడిబొడ్డులో గడియారం స్తంభం ఉంది చరిత్ర, వర్తమానాలను భవిష్యత్తుకు …

Continue reading హరివిల్లుల మెరుపుల్లో అనంతపురం – వ్యాసం – సంచిక వెబ్ మ్యాగజైన్, 1Apr. 2022

శిరీష, శిరీష కోమలం సంకలనం – వ్యాసం, Dec.2021

* * *                                                                                               కమ్మగా కూనిరాగాలు తీస్తుంది, అందమైన కథలూ రాస్తుంది. కానీ భావోద్వేగాల్ని మాత్రం తన గాంభీర్యం మాటున దాచుకుంటుంది. అంత నిండుగా ఉండటం ఎలా సాధ్యం అంటే మాత్రం చిరునవ్వే సమాధానం. పేరు ఎంత సున్నితమో అంతే సున్నితమైన వ్యక్తి ఆమె. తనను ఒక్కమాటలో నిర్వచించమంటే ‘’స్నేహం’’ అని చెబుతాను.                                 ఆమె ప్రపంచం విశాలమైంది. ఆమె సంభాషణలో ఎందరెందరి ప్రస్తావనలో వస్తుండేవి. వారి సమస్యలు, వారి సుఖదుఃఖాలు అన్నీ ఆమెవే. …

Continue reading శిరీష, శిరీష కోమలం సంకలనం – వ్యాసం, Dec.2021

పిల్లలకి పుస్తకప్రపంచాన్ని పరిచయం చేస్తే…        

  * * *                                           పిల్లల్లో పుస్తకాలు చదవాలన్న కుతూహలం ఎంతవరకు ఉంటోంది? ఎలాటి పుస్తకాలు చదవాలనుకుంటున్నారు? ఇప్పటి పాఠశాల చదువులు చాలా ఒత్తిడిని కలగజేస్తున్నాయి. పోటీతత్త్వం పెరగటంతో ఎక్కువ గంటలు క్లాసు పుస్తకాలతోనే గడపవలసి ఉంటోంది. అలాటప్పుడు ఇంకా వేరే పుస్తకాలు చదవాలనే ఆసక్తి ఉంటుందా అంటే, …

Continue reading పిల్లలకి పుస్తకప్రపంచాన్ని పరిచయం చేస్తే…        

కథా మినార్ – పుస్తక సమీక్ష – సారంగ వెబ్ మ్యాగజైన్ 1st Jan, 2019

* * * బుక్ కార్నర్సంచిక: 1 జనవరి 2019 మనకి తెలియని మనవాళ్ళ కథలు! మంచి, చెడు అనేవి మనిషి లక్షణాలైనప్పుడు వాటిని మతానికి ఆపాదించటమెంతవరకు సబబు?  ఇటీవల వచ్చిన ‘కథా మినార్’ కథా సంకలనం చదవటం ఒక ప్రత్యేక అనుభవం. మనతో కలిసి, మన మధ్య జీవించేవారిని గురించి మరింత తెలుసుకోవటం నిజంగా బావుంటుంది. ఒక కుటుంబంలోని సభ్యులు నిర్లక్ష్యానికి, అన్యాయానికి గురవుతున్నపుడు మౌనంగా ఉండిపోతే వారు అనుభవిస్తున్న దుఃఖం ఇతరులకి తెలిసే అవకాశం లేదు. వారు మౌనం వీడవలసిందే. సమాజంలో వస్తున్న అస్తిత్వవాదాలన్నీ అలా …

Continue reading కథా మినార్ – పుస్తక సమీక్ష – సారంగ వెబ్ మ్యాగజైన్ 1st Jan, 2019

అశోకమిత్రన్ కథల సంపుటి – నాన్నగారి స్నేహితుడు – పుస్తక సమీక్ష – గ్రంథాలయ సర్వస్వం మాసపత్రిక

* * * అశోక మిత్రన్ గారి కథల సంపుటి ‘నాన్నగారి స్నేహితుడు’ గురించి చెప్పుకుందాం. ఈ పుస్తకం 1991లో ‘అప్పావిన్ స్నేగిదర్’ అనే పేరుతో తమిళంలో వచ్చింది. సాహిత్యంతో పరిచయమున్న పాఠకులంతా ‘అశోక మిత్రన్’ పేరు వినే ఉంటారు. తమిళ సాహిత్యంలో ప్రముఖ కథా రచయితల్లో వీరు ఒకరు. వీరి రచనలు అతి సరళమైన శైలిలో, సున్నితమైన మనో విశ్లేషణతో ఉంటాయి. వీరి కథల్లోని పాత్రలు ఎక్కణ్ణుంచో ఊడిపడ్డట్టు కాక అతి సహజంగా సాధారణ మునుష్యులను, …

Continue reading అశోకమిత్రన్ కథల సంపుటి – నాన్నగారి స్నేహితుడు – పుస్తక సమీక్ష – గ్రంథాలయ సర్వస్వం మాసపత్రిక