అరకు లోయ – ఆదివాసీల స్వర్గం! – యాత్రా సాహిత్యం – సంచిక వెబ్ మ్యాగజైన్, 14Aug.2022

                   * * *                                       విశాఖ నుంచి డ్రైవ్ చేసుకుంటూ అరకు బయలుదేరేం. ప్రయాణమంతా ఆహ్లాదకరమైన దారివెంట నడిచింది. ఎన్నాళ్లుగానో కలలుగన్న అరకులోయ చూడటం ఇప్పటికి కుదిరింది. ప్రకృతి చూపును తిప్పుకోనివ్వదు. ఒక హాయి ఏదో మనల్ని చుట్టేస్తుంది. రంగులు, కొండలు, లోయలు, పచ్చని చెట్లలోంచి వినవచ్చే కమ్మని రాగాలు, ఆకాశం నుంచి స్వేచ్ఛగా దూసుకొచ్చే సూర్యకాంతులు... ఎన్నింటినని కాచుకోగలం?! ప్రకృతిమధ్య మనం ఎంత చిన్నవాళ్లమో మరీమరీ అర్థమవుతుంది. ఏదో తెలియని ఒక తాత్త్వికత మనలోకి …

Continue reading  అరకు లోయ – ఆదివాసీల స్వర్గం! – యాత్రా సాహిత్యం – సంచిక వెబ్ మ్యాగజైన్, 14Aug.2022

బెనారస్ లో ఒక సాయంకాలం – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jul. 2021

* * *                                                                        రొటీన్ లోంచి కాస్త మార్పు తెచ్చుకుని, జీవితం పట్ల మళ్లీ ఉత్సాహం కలిగించుకుందుకు దేశం నలుమూలలకీ వెళ్లి రకరకాల అనుభవాల్ని మూటగట్టుకుని తెచ్చుకోవటం అలవాటు చేసుకున్నాను. ఇప్పుడు వారం రోజులుగా ఈ అమృతయాత్రలో ఉన్నాను. చిన్ననాడు భూగోళ పాఠాల్లో చదువుకుని, చూడాలని కలలుగన్న ప్రాంతం ఇది. వచ్చివెళ్లిన అనుభవం, మళ్లీ వచ్చివెళ్లిన జ్ఞాపకమూ ఉన్నా మరోసారి వెళ్దామంటూ మనసు మారాం చేస్తూనే ఉంటుంది. తీరని దాహంలా తయారైంది ఈ ప్రాంతం పట్ల …

Continue reading బెనారస్ లో ఒక సాయంకాలం – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక, Jul. 2021

జమా మసీదు – దిల్లీ, నైనితాల్, బరేలి, తాజ్ యాత్రా విశేషాలు – Apr, 2019

* * * ఎప్పటిలాగే దేశంలో మరో క్రొత్త ప్రదేశాన్ని చూసేందుకు బయలుదేరాలనుకుంటుంటే ఒక పంజాబీ మిత్రుడు తాను స్థిరపడిన బరేలీ రమ్మని ఆహ్వానించారు. ఎన్నాళ్లుగానో వాయిదా వేస్తున్న ప్రయాణానికి వేసవి విడిది నైనితాల్ ని కూడా కలుపుకుని నాలుగు రోజులు యాత్రని సిధ్ధం చేసుకున్నాం. ముందుగా విజయవాడ నుంచి ఆకాశదారిలో దిల్లీ  చేరి, అక్కడొక రోజు మజిలీ చేసేం. ఏప్రిల్ నెల మూడో వారం దిల్లీ నగరమింకా వేసవి వేడిని ఆహ్వానించినట్టులేదు. వాతావరణం బావుంది. ఆ …

Continue reading జమా మసీదు – దిల్లీ, నైనితాల్, బరేలి, తాజ్ యాత్రా విశేషాలు – Apr, 2019

ఒడిషా రాష్ట్రం మూడురోజుల్లో…చూడవలసింది చాలా ఉంది!

* * *భారతదేశం లోని వైవిధ్యాన్ని కళ్లారా చూసేందుకు తరచూ వివిధ ప్రాంతాలకు ప్రయాణమవుతూనే ఉన్నాం. నైసిర్గక స్థితిగతులు, ఉష్ణోగ్రతలు, భాష, భోజనం, దుస్తులూ ఇలా ఎన్ని వైరుధ్యాలున్నా, దేశంలో ఎక్కడైనా మన భారతీయత కొట్టొచ్చినట్టు కనిపిస్తూనే ఉంటుంది. ఎవరిని చూసినా మనకు పరిచయం ఉన్నట్టే ఒక దగ్గరితనం అనిపిస్తుంటుంది. ఒడిషా మన ఆంధ్రప్రదేశ్ పక్కనే ఉన్నాకూడా ఇన్నాళ్లూ చూడనేలేదు. ఒడిషా అంటే బంగాళాఖాతం ఒడ్డున ఉన్న చిన్నరాష్ట్రం, తరచూ తుఫానులకి ఒణుకుతో కష్ట, నష్టాలకు గురవుతున్న …

Continue reading ఒడిషా రాష్ట్రం మూడురోజుల్లో…చూడవలసింది చాలా ఉంది!

కోటప్ప కొండ, కొండవీడు కోట – గుంటూరు జిల్లా

* * * విజయవాడ నుండి గుంటూరు జిల్లాలోని కోటప్పకొండకు చక్కని రోడ్డు మార్గం ఉంది. ఎన్. ఎచ్. 16 మీద ప్రయాణం చేసి చిలకలూరిపేట వద్ద ప్రక్కకు తిరిగి దాదాపు రెండు గంటల్లో చేరతాము. ఎన్నాళ్లుగానో చూడాలనుకున్న కోటప్పకొండకు మిత్రులతో కలిసి బయలుదేరాము. మధ్యలో ఒక టోల్ గేట్ ఉంది. ఈ కొండదాదాపు 1600 అడుగుల ఎత్తున ఉంది. దీనిని చేరేందుకు మెట్లమార్గం, రోడ్డుమార్గం కూడా ఉన్నాయి. 1761 సంవత్సరంలో ఈ ప్రాంతాన్ని పరిపాలించిన గుండ …

Continue reading కోటప్ప కొండ, కొండవీడు కోట – గుంటూరు జిల్లా

అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part II

* * * అమృతసర్ నుండి రోడ్డు దారిలో ఒక వెహికల్ తీసుకుని హిమాచల్ ప్రదేశ్ లో ఉన్న ధర్మశాలకు బయలుదేరాం. ఇది 200 కిలోమీటర్ల దూరం. నాలుగైదు గంటల ప్రయాణం బావుంటుంది. నేషనల్ హైవే 54, 154 మీదుగా ప్రయాణం చేశాం. 1971 సంవత్సరంలో భారతదేశపు 18 వరాష్ట్రంగా హిమాచల్ ప్రదేశ్ ఏర్పడింది. భారత దేశ పటంలో పశ్చిమ హిమాలయ శ్రేణుల్లో దౌలధర్ పర్వత పాదాల చెంత ఉన్నచిన్నరాష్ట్రం హిమాచల్ ప్రదేశ్. దీనికి ఉత్తరంగా జమ్ము, …

Continue reading అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part II

అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part I

* * * ఈ సంవత్సరం కూడా ఎటైనా వెళ్లి రావాలని, ఏదైనా క్రొత్త ప్రదేశం చూడాలని ప్రయాణం పెట్టుకున్నాం. హిమాచల్ ప్రదేశ్ లో ఉన్నధర్మశాల చూడాలని ఆశ. ఈ మధ్యనే ఆంధ్రప్రదేశ్ రాజధానికి దలైలామా వచ్చి వెళ్లారు. మా ఆశ మరింత బలపడింది. అంత దూరం వెళ్తున్నాం కదా మరోసారి అమృతసర్ కూడా చూద్దామని ముందుగా అక్కడకి బయలుదేరేం. విజయవాడ నుంచి దిల్లీ వరకూ పొద్దున్న 9 గంటల ఫ్లైట్ పట్టుకుని దిల్లీ చేరేసరికి 11.30 …

Continue reading అమృత సరస్సు, దలైలామా తో పాటు టిబెటన్లు నడయాడే ధర్మశాల యాత్ర – March, 2017 – Part I

దిండి రిసార్ట్ – గోదావరి జిల్లాలు

* * * ఆంధ్ర ప్రదేశ్ లో కోనసీమ ప్రాంతం ప్రకృతి అందాలకి పేరు పెట్టిందని మనందరికీ తెలిసున్నదే. ఏప్రిల్ నెలలో మహారాష్ట్రలో స్థిరపడిన స్నేహితులు విజయవాడ వచ్చి  ఆంధ్ర లో అందమైన, ప్రత్యేకమైన ప్రాంతాన్ని వీలైతే పంచారామాల్లాటి యాత్రని చేయించమని అడిగినపుడు 'దిండి' రిసార్ట్ మనసులో మెదిలింది. ఎన్నాళ్లుగానో చూడాలనుకుంటున్న ఈ రిసార్ట్ ని చూబించాలని బయలుదేరేం. అయితే ఈ ప్రాంతాలు క్రొత్తేమీ కాకపోయినా మా వాళ్లకి చూబించి, రెండు రోజుల పాటు ఆ భూతల …

Continue reading దిండి రిసార్ట్ – గోదావరి జిల్లాలు

సూర్యలంక బీచ్ రిసార్ట్ – గుంటూరు జిల్లా

* * * విజయవాడ నుంచి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలో బాపట్ల మండలంలో సూర్యలంక బీచ్ గురించి తెలుసుకుందామని బయలుదేరేం. దాదాపు రెండున్నర గంటల్లో సూర్యలంక బీచ్ ఒడ్డున ఉన్న హరిత రిసార్ట్ చేరుకున్నాం. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖవారిది. విశాలమైన ఆవరణలో బోలెడంత పార్కింగ్ ఏరియా ఉంది. వీకెండ్ కి చుట్టు ప్రక్కల ఉన్న కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు వస్తుంటారని అర్థం అయింది. ఇక్కడ ఎ.సి. మరియు నాన్ …

Continue reading సూర్యలంక బీచ్ రిసార్ట్ – గుంటూరు జిల్లా

భవానీ ద్వీపం – విజయవాడ నగరానికి ఒక అలంకారం

* * * భవానీ ద్వీపం పేరు మీరు వినే ఉంటారు. విజయవాడ సమీపంలో కృష్ణానదిలో ఉంది ఇది. పెద్ద పెద్ద నదీ ద్వీపాల్లో భవానీ ద్వీపం ఒకటి. విజయవాడ లాటి ఊళ్లో ప్రజలకి ఒక పిక్నిక్ లాటిది జరుపుకుందుకు ఎలాటి బహిరంగ ప్రదేశం లేదనే వారికి ఇది చక్కని ఆటవిడుపు. దశాబ్దం క్రితం అభివృధ్ధి చేసినా ప్రజలకి అంతగా దీనిపట్ల అవగాహన లేదని చెప్పవచ్చు. * ఒక మూడు సంవత్సరాల క్రితం  కార్తీక మాసం వనభోజనం …

Continue reading భవానీ ద్వీపం – విజయవాడ నగరానికి ఒక అలంకారం