* * * నన్నల్లుకున్న వెచ్చని కార్డిగన్, మెత్తని నా అరచేతుల మధ్య పొగలు కక్కే ‘లికరస్’ టీ……… పౌర హక్కుల్ని పగటికలలుగా కనేందుకు ఈ నేపథ్యం సహజంగా లేదూ? నువ్వూ, నేనూ పంచుకున్న ఆకాశం కప్పు క్రింద, నా గది కిటికీ లో నీ వైపు నుంచి తళుక్కుమంటూ నడిచొస్తున్న నక్షత్రాలు! కానీ, దైన్యంతో అలసిన నీ ముఖంలోని కన్నీరు మాత్రం ఈ నేల మీద అగోచరంగానే ఉంది. తల మీద కప్పుకోసం నువ్వు పేర్చుకుంటున్న …
Category: కవిత్వం
వివక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక Aug. 2022
* * * వివక్షా? అలాటిదేం లేదే. భారత రాజ్యాంగం ఎప్పుడో చెప్పింది- కులం, మతం, వర్గం, లింగం, భాష ఇలాటి భేదాలేవీ ఉండవని, అన్నిటా అందరూ సమానమేననీ! అంటే వివక్షలంటూ ఉండవన్నమాట! మరి, ఈ పదం ఎలా పుట్టిందంటారా? భలే సులువు! ఇంట్లోంచి, మనుషుల్లోంచి, ఆలోచనల్లోంచి, అహంకారాల్లోంచి అలా వైనవైనాలై, రాజ్యాంగ నిర్మాతలకు తోచని ఎన్నో మార్గాల్లోంచి పుడుతూనే ఉంది! వారి మేధకు అందని దారుల్లో పెత్తనం చేస్తూనే ఉంది. ముందుగా ఏదైనా ఒక …
Continue reading వివక్ష – నెచ్చెలి అంతర్జాల వనితా మాసపత్రిక Aug. 2022
రెండు ఆకాశాల కింద – సంచిక వెబ్ మ్యాగజైన్ – 8 May, 2022
* * * బిడ్డల్ని ప్రయోజకుల్ని చేసి,తమ పట్ల తమకే ఏర్పడిన నమ్మకం-శారీరక బలహీనతల్ని అధిగమిస్తుంటే,మనవణ్ణి పెంచేందుకు సన్నద్ధమైనఅమ్మమ్మింట్లో నేనేనాడూ ఏడ్చిన జ్ఞాపకమే లేదు! ఆ ఆకాశం కింద...తప్పటడుగుల సవ్వడికి ఎంత పనిలోనూపరుగెత్తుకొచ్చి హత్తుకునే 'ఆమె'!ఏ భాషకీ అందని ఏ శబ్దం నోరు జారినాఅంతులేని ఆనందంతో చేతుల్లోకి తీసుకునే 'ఆమె'! నా అల్లరిక్కూడా అలంకారాలు పూసిమురిసిపోయిన 'ఆమె''ఆమె' నాకు తెలిసిన మొదటి అమ్మ! “మూడేళ్లు నిండుతాయి, వాణ్ని స్కూలుకి సిద్ధం చెయ్యాలి పట్రమ్మంటూ”నా ప్రపంచంలోకి పిలుపు ఇచ్చిన'అసలు …
Continue reading రెండు ఆకాశాల కింద – సంచిక వెబ్ మ్యాగజైన్ – 8 May, 2022
వర్షగీతి – సహరి సమగ్ర అంతర్జాల వారపత్రిక, 17th Dec.2021
* * * మాదొక ఆకుపచ్చని సమూహం! అవును, అరణ్యమనే అనండి! నిటారుగా నిలబడి ఆకాశపు అంచులకు పహరా కాస్తుంటాం, అయినా, మట్టి పొత్తిళ్లలో పసిపాపలమై ఒదిగిపోతాం! మా గుండెల్లోంచి గుండెల్లోకి శ్వాసని నింపుతుంటాం! నిరంతరం హర్షాతిరేకంతో ఆనంద నృత్యం చేస్తుంటాం! మా ఒడిలోకి చేరే కువకువల్ని మనసారా పొదువుకుంటాం. ఇన్నింటి మధ్యా, ఋతువుల్ని లెక్కెట్టుకుంటూనే ఉంటాం. ఇష్టమైన ఋతువొకటుంది! పరిమళమై వెల్లువెత్తే ఋతువు! కాపుకాచి, ఆషాఢపు అల్లరి మబ్బుల్ని తేలిగ్గా తరిమికొడతాం. కాటుక సింగారంతో మరింత …
Continue reading వర్షగీతి – సహరి సమగ్ర అంతర్జాల వారపత్రిక, 17th Dec.2021
పునరపి – వాకిలి సాహిత్య పత్రిక Sept. 2016
* * * నువ్వొస్తున్నావట! ఔను, పాత ఉక్రోషాలన్నీ మర్చేపోయిందీ మనసు వచ్చేస్తున్నావ్, నాకు తెలుసు. వేల మైళ్ల దూరాన్ని మనో వేగంతో ముందే దాటేస్తావ్, ఇంతలోనే నడి ప్రయాణపు పలకరింపువవుతావు. ఒట్ఠి పిచ్చివాడివి! సమాంతరంగా నీతో ప్రయాణం చేస్తూనే ఉన్నానన్న వాస్తవం మరిచేపోతావ్ ఓహ్, నిజంగా వచ్చావ్. అదే మబ్బుపట్టిన సాయంకాలం, అదే ఎదురుచూపుల వాకిలి ఆ కాసిని మెట్లూ అధిగమించలేని అలసట నీ అడుగుల్లో నీ ముఖంలో ఒక దైన్యం మాటల దొంతరలు పేర్చని …
ఏకాంతద్వీపం – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2020
* * * ఇది ఒక ఏకాంతద్వీపం! ఇక్కడ నిశ్శబ్దమే పహరా కాస్తుంటుంది కాస్త చెవి ఒగ్గి వినాలే కానీ ఏవో యంత్రాల ఘోష నీచుట్టూ ఒక ప్రవాహమై కదులుతుంటుంది ఇక్కడ ఆకలిదప్పులే కాదు నిద్ర కూడా నిన్ను పలకరించదు పగలు రాత్రులంటూ భేదమేమీ ఉండదు నిన్నంటిపెట్టుకున్న మెత్తని పడక నిన్ను మరింకేమీ ఆలోచించనివ్వదు. పాలనురుగు వస్త్రాల మరబొమ్మలు నీ కోసమేదో హడావుడి పడుతుంటాయి గాజు తలుపులు, మెరుపు వెలుగులు నిన్ను పరివేష్టించి ఉంటాయి నీ శరీరభాగాలన్నీ …
Continue reading ఏకాంతద్వీపం – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2020
నిశ్శబ్దాన్ని దాటుకుని… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Sept, 2018
* * * నాకు శబ్దం కావాలి ఇలా చెబుతున్నానని నాకు రణగొణధ్వనులంటే ఇష్టం అనుకునేవు! లేదు, లేదు… ఇన్నాళ్లూ నిశ్శబ్దాన్ని ప్రేమించానన్నది నిజమేను! దాన్ని నా చుట్టూరా పరచుకుని పహరా కాసాను కూడా. ఆరుబయలు ఆటస్థలాలు, ఆకుపచ్చని పరిసరాలు, సుతిమెత్తని నీటి ప్రవాహాలు పంచే సందడిని ప్రేమించాను. ఇంట్లో, ప్రయాణాల్లో, సినిమాహాళ్ళలో, అక్కరలేకుండా ఉక్కిరిబిక్కిరి చేసే ఓటి మాటల చప్పుడు జొరబడకుండా కొన్ని పరిధులనూ పెట్టుకున్నాను! కానీ చూస్తున్నంతలో తెల్లవారి వాకిళ్లలో సందడిచేసే కళ్లాపులు ఆధునికత …
Continue reading నిశ్శబ్దాన్ని దాటుకుని… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Sept, 2018
ఒక అబ్బాయి – ఒక అమ్మాయి, అనువాదంః రచన సోమయాజుల
* * * కలత నిద్రలో ఒత్తిగిలితే, పెరట్లో అమ్మ నాటిన గులాబీ కంటిముందుకొచ్చింది చిత్రంగా! ఆ వెనుకే లైబ్రరీ మెట్లమీద నీ చిరునవ్వూ! ఈ చందమామ, ఈ నక్షత్రాలు, ఈ పువ్వులు, ఈ వాన చినుకులు, ఈ ఏడు రంగుల హరివిల్లూ నీ వెనుకే కదూ పుట్టుకొచ్చాయి! నీ అమాయకపు ముఖం చూసి గాలికి కదిలే చిరు మేఘమనుకున్నా, ఉప్పెనై నన్ను కమ్ముకుని ఊపిరాడనివ్వని తుఫానువవుతావనుకోలేదు! వేళకాని వేళ విసిగించే నల్లమబ్బు నీ పరిచయంతో చల్లని …
Continue reading ఒక అబ్బాయి – ఒక అమ్మాయి, అనువాదంః రచన సోమయాజుల