ఒక అబ్బాయి – ఒక అమ్మాయి, అనువాదంః రచన సోమయాజుల

* * * కలత నిద్రలో ఒత్తిగిలితే, పెరట్లో అమ్మ నాటిన గులాబీ కంటిముందుకొచ్చింది చిత్రంగా! ఆ వెనుకే లైబ్రరీ మెట్లమీద నీ చిరునవ్వూ! ఈ చందమామ, ఈ నక్షత్రాలు, ఈ పువ్వులు, ఈ వాన చినుకులు, ఈ ఏడు రంగుల హరివిల్లూ నీ వెనుకే కదూ పుట్టుకొచ్చాయి! నీ అమాయకపు ముఖం చూసి గాలికి కదిలే చిరు మేఘమనుకున్నా, ఉప్పెనై నన్ను కమ్ముకుని ఊపిరాడనివ్వని తుఫానువవుతావనుకోలేదు! వేళకాని వేళ విసిగించే నల్లమబ్బు నీ పరిచయంతో చల్లని …

Continue reading ఒక అబ్బాయి – ఒక అమ్మాయి, అనువాదంః రచన సోమయాజుల

జాన్ జాక్ రూసో ‘సామాజిక ఒడంబడిక’ అనువాదం – అలకనంద ప్రచురణలు – Jan, 2018

* * * రూసో 18 వ శతాబ్దంలో రాసిన సోషల్ కాంట్రాక్ట్ పుస్తకం అనువదించే అవకాశం నాకు చాలా థ్రిల్లిచ్చింది. కాలేజీ రోజుల్లో చదువుకున్న రాజనీతి శాస్త్ర పాఠాలు జ్ఞాపకానికొచ్చాయి. ‘మనిషి పుట్టుకతో స్వేచ్చాజీవి అయినా సర్వత్రా సంకెళ్ల మధ్య జీవిస్తున్నాడన్న’ రూసో ప్రతిపాదన అప్పటి సమాజాన్ని ఒక కుదుపు కుదిపింది. స్వేచ్ఛ, సమానత్వం, సౌభ్రాతృత్వం వంటి సూత్రాల ఆధారంగా ఏర్పడిన ఫ్రెంచి విప్లవాన్ని ఇది అమితంగా ప్రభావితం చేసింది. స్వేచ్ఛ వ్యక్తికి ప్రాణవాయువు. సమాజంలోని …

Continue reading జాన్ జాక్ రూసో ‘సామాజిక ఒడంబడిక’ అనువాదం – అలకనంద ప్రచురణలు – Jan, 2018

నిష్క్రమణ – కౌముది Jun, 2013 అనువాదంః రచన సోమయాజుల

* * * ఆ వేసవి సాయంకాలం అకస్మాత్తుగా అతిథుల్లా వచ్చిన వర్షపు చినుకుల మధ్య, నువ్వూ నేనూ అపరిచితులమై ఆకాశం కింద నిలబడినప్పుడు ఎందుకో అర్థంకాని దిగులు అమ్మ మీద యౌవనారంభం నుండి తరచూ వచ్చిపోయే అలక ఒక ఒంటరితనపు దుఃఖం! ఎవరు నువ్వు? ఇంద్రధనుస్సు రంగుల్ని ఒక్కోటిగా నీలోంచి, నీచుట్టూ చూస్తూ నిలబడిన నన్ను కమ్మిన అచేతనత్వం! కలుస్తూ విడిపోతున్న క్రొత్తదనపు చూపుల మధ్య అభావంగా ఉన్న నీ ఉనికి! చెల్లాచెదరవుతున్న ఏడేడు రంగుల్ని …

Continue reading నిష్క్రమణ – కౌముది Jun, 2013 అనువాదంః రచన సోమయాజుల