* * *
మనం బడిలో పాఠాలు నేర్చుకుంటాం కదూ. బడి బయట కూడా పాఠాలు నేర్చుకుంటాం. కాకపోతే బడిలో మనకు తెలిసి పాఠాలు నేర్చుకుంటాం. నిజం! బడి బయట నేర్చుకునేవన్నీ జీవిత పాఠాలు. వీటిని బడిలో నేర్పరు. మన జీవితాన్ని అందంగా, బయట ప్రపంచానికి, మనకి కూడా ఉపయోగకరంగా మలచుకోవాలంటే ఈ పాఠాలు అవసరం.
మనం చేసే ప్రతి పని, మనం వేసే ప్రతి అడుగు మనకి ఎన్నెన్నో పాఠాలు నేర్పుతూనే ఉంటాయి . ఒక ఉదాహరణ చూద్దామా? అమ్మ ఎప్పుడైనా పిలిచి ఏదైనా తినేది పెట్టబోతే వెంటనే చెల్లికి అంటూ అడిగేస్తాం. అమ్మ ఇచ్చేవరకు ఆగం. ఎందుకని? మనకి ఎవరు నేర్పారు అలా అడగాలని? ఎందుకంటే, ఇంట్లో ఏదైనా కుటుంబ సభ్యులు అంతా పంచుకు తినడం చూసి మనం ఈ విషయాన్ని నేర్చుకుంటాం. ఇలా ఎన్నో నేర్చుకుంటూనే ఉంటాం. ఇవి, ఇలాంటివి బడి బయట పాఠాలన్నీ.
ఈ కథను క్రింది లింక్ లో చదవవచ్చు.
* * *