* * *
మన సమాజంలో కుటుంబ వ్యవస్థ బలమైనది, భద్రమైనది అన్న విశ్వాసం చాలా కాలంగా ఉంది పితృ స్వామ్య సమాజం కుటుంబానికి పెద్దగా రక్షకుడిగా భర్తనే గుర్తించింది. ఇల్లు, పిల్లల బాధ్యతలకే భార్య స్థానాన్ని పరిమితం చేసింది. అయినా అనేక చోట్ల, అనేక సార్లు తన పెద్దరికాన్ని గాలికి వదిలేసి నిష్పూచీ గా బతికేస్తున్న భర్తలు ఎదురవుతూనే ఉన్నారు. అలాంటి సందర్భాల్లో మౌనంగా ఆ బాధ్యతను కూడా తలకెత్తుకుని హుందాగా జీవించి చూపిన స్త్రీలను మర్చిపోలేము వారి కష్టాన్ని దాని తాలూకు ఫలితాన్ని కూడా తమ గొప్పతనంగా చెప్పుకుంటూ తిరిగే భర్తల్ని మర్చిపోలేము.
ఇప్పుడు వినబోయే “పరిమళం” కథలో శివయ్య అలాటి ఒక భర్త.
* * *