* * *
మన విశ్వాసాలకు అనుగుణంగా జీవిస్తూ, మనం పాటించే జీవిత విలువలు ఉదాత్తమైనవి అనుకుంటాము. ఎదుటివారి విశ్వాసాల్ని అర్థం చేసుకునే ప్రయత్నం చెయ్యకుండానే ప్రశ్నిస్తూ ఉంటాం, విమర్శిస్తూ ఉంటాం. కానీ ఎవరికి వారు తమ విశ్వాసాలకు నిబద్ధులై జీవిస్తున్నారు అన్న వాస్తవం అర్థం చేసుకున్నప్పుడు మాత్రమే మన హృదయాన్ని మరింత విశాలం చేసుకోవటం జరుగుతుంది.
గడచిన వేసవిలో నా అమెరికా యాత్రలో పరిచయమైన సిడ్నీ, స్టీవ్ నిజంగానే నన్ను కొంత ప్రభావితంచేశారు. వాళ్లకి భారతీయత, గంగానది, హిమాలయాలు, ఆధ్యాత్మికత పట్ల ఉన్న అచంచలమైన నమ్మకం, ప్రేమ విస్మయాన్ని కలిగించింది. వదిలి వచ్చిన తర్వాత కూడా వాళ్ల ఆలోచనలు నన్ను వదలక ఈ కథని రాయించాయి.
ఈ కథను చదవాలంటే క్రింది లింక్ లో చదవచ్చు.
* * *
Pingback: దిల్లీ నుంచి హరిద్వార్ వరకు… – ఈమాట వెబ్ మ్యాగజైన్ Feb, 2019 – ద్వైతాద్వైతం