* * *
ఆంధ్ర ప్రదేశ్ లో కోనసీమ ప్రాంతం ప్రకృతి అందాలకి పేరు పెట్టిందని మనందరికీ తెలిసున్నదే. ఏప్రిల్ నెలలో మహారాష్ట్రలో స్థిరపడిన స్నేహితులు విజయవాడ వచ్చి ఆంధ్ర లో అందమైన, ప్రత్యేకమైన ప్రాంతాన్ని వీలైతే పంచారామాల్లాటి యాత్రని చేయించమని అడిగినపుడు ‘దిండి’ రిసార్ట్ మనసులో మెదిలింది. ఎన్నాళ్లుగానో చూడాలనుకుంటున్న ఈ రిసార్ట్ ని చూబించాలని బయలుదేరేం. అయితే ఈ ప్రాంతాలు క్రొత్తేమీ కాకపోయినా మా వాళ్లకి చూబించి, రెండు రోజుల పాటు ఆ భూతల స్వర్గంలో ఉండే అవకాశం వచ్చిందని సంబరపడ్డాం.
*
విజయవాడ నుంచి ఒక మూడు గంటల ప్రయాణం చేసి, దాదాపు 150 కిలో మీటర్ల దూరంలో ఉన్న దిండి చేరేం. అందమైన రోడ్డు ప్రయాణం సౌకర్యవంతంగా ఉంది. ఈ దిండి కోనసీమలో ఒక అందమైన గ్రామం. దిండి, రాజోలు, నర్సాపూర్, చించినాడ, యలమంచలి లంక, దొడ్డిపట్ల గ్రామాలను ఒరుసుకుని గోదావరి ఉపనది వశిష్ట ప్రవహిస్తూంది. ఈ రిసార్టుల నుంచి పేరుపాలెం బీచ్ కి, పంచారామాల యాత్రకి చాలా వీలుగా ఉంటుంది.
ఈ ప్రాంతంలో ఆంధ్ర ప్రదేశ్ పర్యాటక శాఖవారి దిండి రిసార్ట్ ‘కోకోనట్ కంట్రీ రిసార్ట్’ ఒక ఎనిమిదేళ్లుగా ఉంది. బయట ప్రపంచానికి ఇప్పుడిప్పుడే తెలుస్తున్న ఈ దిండి, చుట్టుప్రక్కల అందాలను చూసేందుకు ఎక్కువగా హైదరాబాద్, విశాఖ ల నుంచి వస్తారని చెప్పారు.
*
ఇక్కడే పల్లవి రిసార్ట్, స్టెర్లింగ్ హాలిడే రిసార్ట్ వంటి…
View original post 511 more words