* * * మళయాళీ మూలంః భాస్కరన్ ఆంగ్లానువాదంః ఎన్. రవిశంకర్ తెలుగు అనువాదంః పి. సత్యవతి ఇదొక అసాధారణమైన కథ. నిరక్ష్యరాస్యురాలైన ఒక ఆదివాసీ మహిళ తన ప్రజల కోసం ధైర్యంగా చేస్తున్న పోరాటం ఈ ఆత్మకథ. సి.కె. జాను ఈ కథానాయకురాలు. ఈ పుస్తకం ముందుమాటలో రచయిత రవిశంకర్ చెప్పినట్లుగా జాను పుట్టి, పెరిగిన రాష్ట్రానికి అనేక ప్రత్యేకతలున్నాయి. ప్రపంచంలోని పది ఉత్తమ సందర్శనీయ స్థలాలలో ఒకటిగా చెప్పుకునే కేరళలో …
Month: July 2021
అస్తిత్వపు ఆనవాళ్లు – ఈమాట వెబ్ మ్యాగజైన్, Jul.2021
* * * “అమ్మా, నేను మతం మారిపోతాను.” భోజనం ముగించి లేస్తూ అన్న నవ్య మాటలకి ఉలిక్కిపడ్డాను. పదోక్లాసు పరీక్షలు రాయబోతున్న నవ్య చాలా విషయాలు సులువుగానే అర్థం చేసుకుంటుంది. నా సమాధానానికి ఎదురుచూడలేదు. తన నిర్ణయం చెప్పి గదిలోకి వెళ్లిపోయింది. బోర్డ్ ఎగ్జామ్స్ నాలుగురోజుల్లోకి వచ్చాయి. తన చదువు గురించిన దిగుల్లేదు కానీ అకస్మాత్తుగా ఈ ప్రస్తావనే కాస్త ఆశ్చర్యం కలిగించింది. వాళ్ల నాన్న ఉన్నా ఇలాగే చెబుతుంది ఏ విషయమైనా. నవ్య అలాగే …
Continue reading అస్తిత్వపు ఆనవాళ్లు – ఈమాట వెబ్ మ్యాగజైన్, Jul.2021
పల్లె ముంగిట్లో వాలిన కల
* * *
కలలు కనటం నేరం కాదు,
కమ్మని దృశ్యాల్ని అమ్మ చీర చెరుగులో కలవరించటం అసలే నేరం కాదు.
నిజమే, ఆ కలల్ని సజీవంగా చూసుకుందుకు అహర్నిశం కష్టపడ్డావ్.
నిద్రా హారాల్ని మాని యూనివర్సిటీ గోల్డ్ మెడల్ సాధించావ్.
పరంపరగా మెట్టు పైమెట్టు ఎగబ్రాకుతూనే ఉన్నావ్,
విజయాలూ, వెన్నంటి ఉండే ఆరాటాలూ, అసహనాలూ,
నీ భార్యాబిడ్డల్ని ఓ కుదుపు కుదుపుతూనే ఉన్నాయి.
అంబరమంత ఆశయం!!
రెండు చేతులూ చాచి,
భౌగోళిక సరిహద్దులు చిటికెన వేలితో తోసి,
కనపడే మబ్బుల్ని ఆవలెక్కడో విసిరేసేవ్.
ఎక్కడికో పరుగులు..గమ్యం లేదనిపించేలా,
నీ నీడల్లా వాళ్లు!…..
దూరం తరగదేమని విస్తుబోయి చూస్తున్నారు.
ఎన్నాళ్లు? ఎన్నేళ్లు? ఇంకా ఎందాకా?
నిన్నొక్క క్షణం అయినా నిలబెట్టలేని ప్రశ్నలయ్యాయి.
గెలిచే తీరాలన్న నీ పంతం నిన్ను మరింత వ్యాపార వేత్తలా మారుస్తోంది.
అంతూ దరీ లేని పోటీ అభద్రతా ప్రపంచంలోకి లాక్కెళుతోంది.
డబ్బు లెక్కల్ని చెప్పే కాలిక్యులేటర్ నిద్రలేని రాత్రుల్ని లెక్కిస్తోంది.
నిన్ను నీవు నిరూపించుకోవాలి!!
ఇంత దూరాన ఉన్నా నా మనో నేత్రం ముందు కదులుతూనే ఉన్నావ్.
చెబితే ఈ క్షణాన నమ్మవు కానీ…..
మనసులో ఒక నమ్మకం స్పష్టంగా !
ఆ రోజు వస్తుంది,
ఇన్నేళ్లుగా గుప్పెట బంధించిన గుండెలతో,
నిన్ననుసరిస్తున్న నీడల్ని వెంటేసుకుని మరీ
తల్లి ఒడిలో పసివాడి వయ్యే క్షణం…
ఆ అపురూప దృశ్యం…
భూగోళమంతా చుట్టివచ్చి భుజాల బరువులకెత్తుకొచ్చిన నీ విజయాల్ని
నీ…
View original post 23 more words
నువ్వో తత్త్వవేత్తవా నేస్తం? – కౌముది Sept, 2014
* * *
రాబోయే రహదారుల వెంట నాకోసం ఏదో అద్భుతం
దారికాచి మరీ వేచి ఉందనే ఆశ
నన్ను ప్రతి మలుపులోనూ ఉత్సాహంగా నడిపిస్తుంటే
సహ పధికురాలివై కలిసిన నిన్ను కాస్సేపు విన్నాను!
ఇవన్నీ ఎప్పుడో విన్నవేనన్న భావం!
మాట్లాడుతూ మాట్లాడుతూ,
చీకటి గుహల్లోకి మాయమైపోతావ్!
అంతలోనే అగాధాల్లాంటి సముద్రలోతుల్లోకి మునకలూ వేస్తావ్!
కబుర్లకి విశ్లేషణల రెక్కలు తొడిగి,
సిధ్ధాంతాల రూపులు దిద్దుతావ్!
నీభాష నాకింగా అలవడలేదు సుమా!
అందుకే కాస్త దూరందూరంగానే తచ్చాడుతున్నానేమో!
అయినా నీ పలకరింపులో చిక్కదనం
నన్నో పరిమళమై అల్లుకుపోయిందన్నది వాస్తవం!!
* * *
నువ్వో తత్త్వవేత్తవా నేస్తం? – కౌముది Sept, 2014
* * *
రాబోయే రహదారుల వెంట నాకోసం ఏదో అద్భుతం
దారికాచి మరీ వేచి ఉందనే ఆశ
నన్ను ప్రతి మలుపులోనూ ఉత్సాహంగా నడిపిస్తుంటే
సహ పధికురాలివై కలిసిన నిన్ను కాస్సేపు విన్నాను!
ఇవన్నీ ఎప్పుడో విన్నవేనన్న భావం!
మాట్లాడుతూ మాట్లాడుతూ,
చీకటి గుహల్లోకి మాయమైపోతావ్!
అంతలోనే అగాధాల్లాంటి సముద్రలోతుల్లోకి మునకలూ వేస్తావ్!
కబుర్లకి విశ్లేషణల రెక్కలు తొడిగి,
సిధ్ధాంతాల రూపులు దిద్దుతావ్!
నీభాష నాకింగా అలవడలేదు సుమా!
అందుకే కాస్త దూరందూరంగానే తచ్చాడుతున్నానేమో!
అయినా నీ పలకరింపులో చిక్కదనం
నన్నో పరిమళమై అల్లుకుపోయిందన్నది వాస్తవం!!
* * *
పరిమళపు అర – కౌముది Jul, 2016, రచన ఇంటింటి పత్రిక Jul, 2017
* * *
ప్రొద్దున్నే శారద తయారవుతున్నంతసేపూ ఆరాటంగా ఇల్లంతా తిరుగాడుతున్న సరస్వతమ్మ, ‘వెళ్లొస్తానమ్మా, జాగ్రత్త. భోజనం చేసి కాస్సేపు నిద్రపో. ఏదైనా అవసరం అయితే ఫోన్ చెయ్యి’ అంటూ ఆమె ఆఫీసుకి వెళ్లిపోయాక వరండాలో కాస్సేపు కూర్చుని ఆనాటి దిన పత్రికను చదివే ప్రయత్నం చేసింది. మనసు నిమగ్నం కాలేదు.
కొన్నాళ్లుగా ఆవిడకి ఆరోగ్యం బావుండటంలేదు. ఎప్పుడూ కడుపునొప్పనో,కడుపులో మంటనో బాధపడుతోంది. తన పనులు తను చేసుకుందుకు కూడా ఓపిక లేనట్టు తల్లి పడుతున్న అవస్థ శారద చూస్తూనే ఉంది. ఆవిడకి అలవాటైన డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి అన్నిపరీక్షలూ చేయించింది. ఎక్కడా ఏ సమస్యా లేదని చెప్పి, ఆకలి వెయ్యటానికి, నిద్రపట్టటానికీ మందులు ఇచ్చేడు ఆయన. సరస్వతమ్మకి డాక్టర్ మీద నమ్మకం పోయింది. తను పడుతున్న బాధ ఏమిటో ఆయన పట్టుకోలేకపోయాడు అనుకుంది.
శారద ఏం చెయ్యాలో తోచక తల్లి ఆరోగ్య పరిస్థితి గురించి ఢిల్లీలో ఉన్న అన్నగారితోనూ, హైదరాబాదులో ఉన్న అక్కయ్యలతోనూ ఫోన్ లో మాట్లాడింది.
‘ ఆవిడ బాధ పడుతుంటే ఇన్నాళ్లు ఆలస్యం చేసేవెందుకు శారదా, వెంటనే డాక్టర్ దగ్గరకి తీసుకెళ్లి చూబించు.’
‘ తీసుకెళ్లానన్నయ్యా, డాక్టర్ దగ్గరకి వెళ్దాం అంటే వద్దంటుంది. ఆయన సరిగా చూడట్లేదు అంటుంది. పోనీ మరొకరి
దగ్గరకి వెళ్దాం అంటే రాదు. తిండి బాగా తగ్గించేసింది. నీరసపడిపోయింది. తెల్లవార్లూ నిద్రపట్టదంటుంది.
* * *
భవానీ ద్వీపం – విజయవాడ నగరానికి ఒక అలంకారం
* * *
భవానీ ద్వీపం పేరు మీరు వినే ఉంటారు. విజయవాడ సమీపంలో కృష్ణానదిలో ఉంది ఇది. పెద్ద పెద్ద నదీ ద్వీపాల్లో భవానీ ద్వీపం ఒకటి. విజయవాడ లాటి ఊళ్లో ప్రజలకి ఒక పిక్నిక్ లాటిది జరుపుకుందుకు ఎలాటి బహిరంగ ప్రదేశం లేదనే వారికి ఇది చక్కని ఆటవిడుపు. దశాబ్దం క్రితం అభివృధ్ధి చేసినా ప్రజలకి అంతగా దీనిపట్ల అవగాహన లేదని చెప్పవచ్చు.
*
ఒక మూడు సంవత్సరాల క్రితం కార్తీక మాసం వనభోజనం పేరుతో వెళ్లినప్పుడు అక్కడ జనం చాలా పలుచగా ఉన్నారు. చుట్టూ పచ్చదనం, పిల్లలకి, పెద్దలకి అవసరమైన అనేక క్రీడలకు అనువైన ఏర్పాట్లు ఉన్నాయి, కాని జనం మాత్రం లేరు.
*
భవానీ ద్వీపం 133 ఎకరాల విస్తీర్ణంలో ఉంది. వసతి నిమిత్తం ఎ.సి., నాన్ ఎ.సి. కాటేజీలు ఉన్నాయి. ట్రీ టాప్ కాటేజీలు ఆకర్షణీయంగా ఉన్నాయి. రెండు, మూడు వేల ధరలో కాటేజీలు దొరుకుతున్నాయి. బఫే బ్రేక్ ఫాస్ట్ కాటేజీ ధరలో ఉచితంగా దొరుకుతుంది. ద్వీపం చేరేందుకు చేసే పడవ ప్రయాణానికి కాటేజీ బుక్ చేసుకున్నవారు రుసుము చెల్లించవలసిన అవసరం లేదు.
24 గంటలూ చెకిన్ అయ్యే సౌకర్యం ఉంది. భోజనం , సర్వీస్ విషయంలో మరింత ప్రమాణాల్ని పాటించవలసిన అవసరం ఉంది. భద్రత విషయంలో సమస్య లేదు. అవసరమైన చిన్న చిన్న వస్తువులు సబ్బులు లేదా పిల్లలకి కావలసిన బిస్కెట్లు లాటివి అమ్మే…
View original post 225 more words