* * *
విజయవాడ నుంచి దాదాపు తొంభై కిలోమీటర్ల దూరంలో గుంటూరు జిల్లాలో బాపట్ల మండలంలో సూర్యలంక బీచ్ గురించి తెలుసుకుందామని బయలుదేరేం. దాదాపు రెండున్నర గంటల్లో సూర్యలంక బీచ్ ఒడ్డున ఉన్న హరిత రిసార్ట్ చేరుకున్నాం. ఇది ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర పర్యాటక శాఖవారిది. విశాలమైన ఆవరణలో బోలెడంత పార్కింగ్ ఏరియా ఉంది. వీకెండ్ కి చుట్టు ప్రక్కల ఉన్న కాలేజీ విద్యార్థులు, విద్యార్థినులు వస్తుంటారని అర్థం అయింది. ఇక్కడ ఎ.సి. మరియు నాన్ ఎ.సి. కాటేజీలు దొరుకుతాయి. వీటి ధర వారాంతంలో మామూలు రోజులకంటే ఎక్కువ ఉంటుంది. రెండు వరసల్లో ఉన్న ఈ కాటేజీలు ప్రామాణికత విషయంలో గొప్పగా ఉన్నాయని చెప్పలేం. కొన్ని ముందు వరసలో ఉన్న కాటేజీలు కాస్త ఎత్తు మీద కట్టబడి ఉన్నాయి. వెనుక వరుసలో ఉన్న కాటేజీలు కూడా వరండాలో కూర్చుంటే సముద్రాన్ని స్పష్టంగా, దగ్గరగా చూబిస్తాయి.
*
మేము వెళ్లినది వారాంతంలో కాబట్టి దాదాపు అక్కడున్న పాతిక కాటేజీలు నిండిపోయి ఉన్నాయి. ఇక్కడ సముద్రం మన ఇంటి ముందు ఉన్నట్టు ఉంటుంది. విశాలంగా పరుచుకుని ఉన్నబీచ్ వాతావరణం మరికొంత పోషణ కోరుకుంటోంది. రిసార్ట్ లో రెస్టొరెంట్ ఒకటి, బార్ ఒకటి ఉన్నాయి. ఇడ్లీ, దోసె లాటి ఫలహారాలు, కాఫీ, టీ లాటి పానీయాలు సమృధ్ధిగా దొరుకుతాయి. సర్వీస్ ఫరవాలేదనిపించేలా ఉంది. భోజనం కూడా అంతే. అక్కడి ఉద్యోగులు వచ్చిన వాళ్లకి తమకి అవకాశమున్నంతలో…
View original post 204 more words