* * *
తూర్పుగోదావరి జిల్లాలో రాజోలు తాలూకాలో ఉన్న ఆదుర్రు గ్రామం అతి నిశ్శబ్దంగా కనిపిస్తుంది. అక్కడ బౌధ్ధ మతానికి చెందిన అత్యంత విలువైన నిర్మాణాలున్నాయని ప్రపంచానికి తెలియవలసిన అవసరం ఉంది. ఈ విషయంలో ప్రభుత్వం ఎలాటి శ్రధ్ధ చూపకపోవటంతో అక్కడి విలువైన బౌధ్ధ స్థూపం అలా ఎదురుచూస్తోంది. అది పదిహేడు అడుగుల వ్యాసం కలిగి జెయింట్ వీల్ ఆకారంలో నిర్మించబడింది. చుట్టూ వేదిక, ఆయకాలు నిర్మించబడి ఉన్నాయి. దీనిని మహాక్షేత్రం అంటారు.
*
మొదటిసారిగా 1923లో ఆర్కిలాజికల్ సర్వే వారు చేసిన త్రవ్వకాల్లో ఈ బౌధ్ధ నిర్మాణాలు బయటపడ్డాయి. ఆ తర్వాత 1953 లోజరిపిన త్రవ్వకాల్లో ఇక్కడి స్థూపాలు, చైత్యాలు, విహారాలు బయల్పడ్డాయి.అంతేకాక ఎర్రని మట్టి కుండలు, పాత్రలు వెలుగు చూసాయి. 1955 సంవత్స్స్రంలో ఈ ప్రాంతాన్ని ఆర్కిలాజికల్ సర్వే వారు రక్షిత ప్రదేశంగా ప్రకటించారు.
*
ఆదుర్రు ను ‘దుబరాజు దిబ్బ’ లేదా ‘దుబరాజు గుడి’ అని కూడా అక్కడి వారు పిలుస్తారు.ఇది గోదావరి నదికి ఉపనది అయిన వైనతేయ నదికి పశ్చిమంగా ఉంది. మామిడికుదురు లోని బంగాళాఖాతానికి కేవలం పది కిలోమీటర్ల దూరంలో ఉంది. ఈ గ్రామంలో ఓ.ఎన్.జి.సి. వారు వేసిన రోడ్లు ఉన్నాయి. కులవ్యవస్థను అనుసరించి గ్రామంలో ఇళ్లు ఉండటం గమనించవచ్చు.
*
ఇక్కడ బౌధ్ధ మతానికి చెందిన అతి ముఖ్యమైన మూలాలు ఉన్నాయి. ప్రపంచంలోని మూడు ప్రఖ్యాత స్థూపాల్లో మొదటిది ఆదుర్రులో ఉంది. రెండవది…
View original post 150 more words