* * *
ఆ వేసవి సాయంకాలం
అకస్మాత్తుగా అతిథుల్లా వచ్చిన వర్షపు చినుకుల మధ్య,
నువ్వూ నేనూ అపరిచితులమై ఆకాశం కింద నిలబడినప్పుడు
ఎందుకో అర్థంకాని దిగులు
అమ్మ మీద యౌవనారంభం నుండి తరచూ వచ్చిపోయే అలక
ఒక ఒంటరితనపు దుఃఖం!
ఎవరు నువ్వు?
ఇంద్రధనుస్సు రంగుల్ని ఒక్కోటిగా నీలోంచి,
నీచుట్టూ చూస్తూ నిలబడిన నన్ను కమ్మిన అచేతనత్వం!
కలుస్తూ విడిపోతున్న క్రొత్తదనపు చూపుల మధ్య
అభావంగా ఉన్న నీ ఉనికి!
చెల్లాచెదరవుతున్న ఏడేడు రంగుల్ని పట్టూకోలేక ఓడిపోతూ
నీనుండి చూపులు మరల్చుకున్న వైనం!
ఆ క్షణాలు ఏదో అలౌకిక తీరాలమధ్య కదులుతున్నట్లు
మరింత అయోమయంగా నిస్సహాయంగా నిన్నల్లుకున్న చూపులు!
నీ అందమైన కన్నులు నిండిన విస్మయం!
నా గుండెల్నిండా వెర్రిగా గుబులు రేపుతుంటే
చటుక్కున మెట్లు దిగి వెళ్లిపోయాను!
ఇప్పుడు…
ఇన్నాళ్ల సహచర్యం, ఇన్ని గుసగుసల తాత్పర్యం, ఇన్నిన్ని కోపాల నేపథ్యం,
మరెన్నో ఆవేశాల మాధుర్యం!
నా చైతన్యాన్ని నానుండి లాక్కుని,
నన్నొంటరిని చేసి ఇప్పుడే వస్తానంటూ వెళ్లిన నీ అడుగులు!
నన్నో జడుడిని చేస్తున్నావో,
నన్నో తపస్విని కమ్మని శపిస్తున్నావో?!
ఈ తపస్సులో నన్ను సజీవ సమాధిని చేస్తున్నావు సుమా!
పరుగున వచ్చి గడ్డ కట్టిన శైతల్యాన్ని పగులకొట్టి
వెచ్చని చిగురువై నన్నలంకరించవూ?
View original post 98 more words