* * *
ఈ రాజభవంతులు, కోటలు చూస్తున్నంతసేపూ మనవికాని జీవితాలని ,ఎప్పుడో ఈ భూమిమీద జరిగిన కథలని చూస్తూ మరొక లోకంలోకి వెళ్లిపోతాం. చిన్నప్పుడు చదువుకున్న చరిత్ర పాఠాలు, మనం విన్న రాచరికపు కథలు అప్రయత్నంగానే కళ్లముందుకొస్తాయి. అక్కడ తిరుగుతున్న సమయంలో తెలుగు సినిమా దివంగత నటుడు రాజబాబు తీసిన ‘ ఎవరికి వారే యమునాతీరే’ సినిమాలో పాడిన పాట, ఆ పంక్తులు జ్ఞాపకంవచ్చాయి…… “రాజ్యాలను ఏలినారు వేలవేల రాజులు, చివరికెవరు ఉంచినారు కులసతులకు గాజులు? కట్టుకున్న కోటలన్ని మిగిలిపోయెను, కట్టించిన మహరాజులు తరలిపోయెను”. అమర్ కోట నుండి ‘కనక వ్రిందావనం’ అని రాధాకృష్ణుల మందిరం చూసేం. అది బిర్లా వారి కట్టడం. ఆ టూరులో ఆఖరుగా బిర్లా ప్లానిటోరియమ్ చూబించవలసి ఉంది. కాని అప్పటికే సాయంకాలం 6.30 కావొస్తోంది. అందువలన అక్కడికి వెళ్లటం కుదర లేదు. సర్వ సాధారణంగా ప్లానిటోరియమ్ ను చూబించటం జరగనే జరగదని చెప్పేరు. రాజస్థాన్ లో మరెన్నో చూడదగిన ప్రదేశాలున్నాయి. ఉదాహరణకి ఉదయపూర్, జోధ్పూర్, జైసల్మీర్,రనథంబోర్, బికనీర్ వంటివి. వాటిని చూసేందుకు మరింత ప్లానింగ్, సమయం అవసరం.జైపూర్ లో మరొక రోజు మేము ఒక క్రొత్త అనుభవాన్ని చూడాలనుకున్నాం. అది ఒక రాజస్థానీ గ్రామీణజీవితాన్ని, సంస్కృతినీ ప్రతిబింబించే ఒక యాత్రా స్థలం. అది జైపూర్ స్టేషన్ నుండి 20 కిలోమీటార్ల దూరంలో ఉంది. జైపూర్ లో రాజస్థాని…
View original post 1,256 more words