* * *
Continued from Part III
అహ్మదాబాద్ నుండి అజ్మేర్ చేరుకున్నాం. ఆ రోజు ఈద్ పండుగ కావటంతో వూరంతా ఒక పండుగ సంబరంలో ఉంది. దాదాపు 5 లక్షల జనాభా కలిగి, రాజస్థాన్ లో ఐదవ పెద్ద పట్టణంగా చెప్పబడుతోంది. ఇది భారత దేశపు సాంస్కృతిక సంపద కలిగిన నగరాల్లో ఒకటి గా కేంద్ర పభుత్వంచేత గుర్తించబడింది. అజ్మేర్ 1956 సంవత్సరంలో రాజస్థాన్ లో భాగమైంది. రాష్ట్రంలో నడిబొడ్డున ఉంది ఈ పట్టణం. అజ్మేర్ అంటే సంస్కృతంలో అజయ మేరు. దానిని ఇంగ్లీషులో ఇన్విన్సిబుల్ మౌన్ టెయిన్ గా చెబుతారు. అజ్మేరు లో సంవత్సరం పొడవునా అధిక ఉష్ణోగ్రతలు నమోదు అవుతాయి. జూన్ నుండి సెప్టెంబరు వరకూ వర్షాకాలం. నవంబరు నుండి ఫిబ్రవరి వరకూ చలికాలం. ఇది సందర్శకులకి అనువైన కాలం.ఈ సమయంలో ఉష్ణోగ్రతలు తక్కువగా ఉండి, ఆహ్లాదకరమైన వాతావరణం, అప్పుడప్పుడు విపరీతమైన చలి గాలులు కూడా ఉంటాయి. అజ్మేరు దగ్గరగా ఉన్న కిషన్ గఢ్ లో 2013 సంవత్సరంలో అప్పటి ప్రధాని మన్మోహన్ సింగ్ ఎయిర్ పోర్ట్ కు ప్రారంభోత్సవం చేసారు. అది 2016 నాటికి సిధ్ధం అవుతుందని అంచనా. ప్రస్తుతం ఇక్కడికి సమీపంలో ఉన్న ఎయిర్ పోర్ట్ జైపూర్ లో ఉంది.
ఇక్కడ ప్రపంచ ప్రఖ్యాతి గాంచిన ‘అజ్మేర్ దర్గా’ తారాగఢ్ పర్వత పాదాల వద్ద ఉంది. సూఫీ మత గురువు ఖ్వాజా మొయినుద్దీన్ చిష్టీ 1192…
View original post 1,291 more words