* * *
Continued from Part I
భారత దేశంలో ప్రభుత్వం గుర్తించిన 12 సాంస్కృతిక వారసత్వ నగరాల్లో ద్వారక ఒకటి. ద్వారక అంటే (గేట్ వే) ముఖ ద్వారం. ద్వార్ అంటే ద్వారం, క అంటే బ్రహ్మ. ద్వారక అంటే ‘స్వర్గానికి ముఖ ద్వారము’. ఈ గుడిలో కృష్ణభక్తురాలు మీరాబాయి కృష్ణుడిలో ఐక్యం అయిందని చెబుతారు. ద్వారకలోని ప్రధాన ఆలయం ద్వారకాధీషుడి దేవాలయం. దీనిని ‘జగత్ మందిర్’ లేదా ‘నిజ మందిర్’ అనికూడా అంటారు. అంటే ప్రపంచానికే దేవాలయం. ఇది అతి ప్రాచీన వైష్ణవ ఆలయం. ఈ గుడి మొదటగా 2,500 సంవత్సరాలు క్రితం కట్టబడింది. కాని దండయత్రలతో పూర్తిగా ధ్వంసమైపోయింది. తిరిగి 16వ శతాబ్దంలో కట్టబడింది. 72 స్థంభాల మీద కట్టబడిన ఐదు అంతస్థుల కట్టడం ఇది. ఈ దేవాలయానికి మోక్ష ద్వారమని పిలిచే ముఖ్యద్వారము, స్వర్గద్వారమని పిలిచే మరొక ద్వారము ఉన్నాయి. మోక్షద్వారం గుండా దేవాలయం లోపలికి వెళ్లి, స్వర్గ ద్వారం గుండా బయటకు రావలసి ఉంటుంది. స్వర్గద్వారం నుండి మరొకవైపుగా 56 మెట్లు దిగి గోమతి నది ఒడ్డుకు చేరవచ్చు. ముఖ్యద్వారం నుండి దేవాలయం బయటకు వచ్చినట్లైతే అది పట్టణంలోని మార్కెట్టుకు దారితీస్తుంది.
ఈ దేవాలయం 256 అడుగుల ఎత్తు కలిగిన నిర్మాణం. ఇది ఈ ప్రాంతాల్లో విస్తారంగా దొరికే సున్నపురాయి, ఇసుకలను ఎక్కువగా ఉపయోగించి నిర్మించబడింది. దేవాలయం శిఖరం పైన సూర్యుడు, చంద్రుడు గుర్తులుగా…
View original post 1,115 more words