* * *
ఇటీవల కాలంలో అంటే దాదాపు గత పదేళ్లుగా మన దేశంలో పర్యాటకం బాగా అభివృధ్ధి చెందుతోంది. దేశంలోని ఏమూల ఉన్న పర్యాటక ప్రదేశంలోనైనా ఎక్కువగా మన ఆంధ్రా వాళ్లు కనిపిస్తూ ఉంటారని నా ఉత్తరాది స్నేహితురాలు నన్ను ఆట పట్టిస్తోంది కూడా. నిజమే. ఒక కుటుంబంలోని వారో, లేదా స్నేహితులతోనో, బంధువులతోనో కలిసి కొన్ని కుటుంబాలుగానో లేదా ప్రభుత్వ పర్యాటక శాఖ కానీ ప్రైవేటు సంస్థలు, వ్యక్తులు నిర్వహించే టూరు ప్రోగ్రాముల్లోకానీ మన వాళ్లు ఎక్కువగానే పర్యాటకాన్ని ప్రోత్సహిస్తున్నారని చెప్పచ్చు. ఇదివరకటిలా ఉన్న చోటికే పరిమితమవకుండా ఇలాటి యాత్రలు చేస్తున్నారన్నది నిజంగా గర్వించదగ్గ విషయం. ఇది అభిలషణీయమైన మార్పు. ఎందుకంటే యాత్ర చేసిన వారికి ఎనలేని ప్రపంచానుభవాన్ని అందించటంతో పాటు, ఈ యాత్రలు ప్రభుత్వాలకి, ఆయా ప్రాంతాల్లోని స్థానికులకి ఆదాయాన్ని సంపాదించి పెడతాయి.
ఒక ఉపఖండంగా పిలిచే మనదేశం భిన్న సంస్కృతులకి కూడలి. దేశం గురించిన ఎన్నో వార్తలు, విశేషాలు రేడియో ద్వారానో, టి.వి. లేదా ఇంటర్నెట్ ద్వారానో నిత్యం మనకు తెలుస్తూనే ఉంటాయి. కానీ స్వయంగా చూసి రావడం వలన ఆయా ప్రాంతాల్లోని జీవన వైవిధ్యం తెలుస్తుంది. ప్రపంచం ఒక గ్లోబల్ విలేజీగా మారిపోయిందనుకునే ఈ సమయంలో ఇలాటి పర్యటనలు మరింత అవసరం, సులభం కూడా. వీటి వలన దైనందిన జీవితాల్లోని యాంత్రికతను వదిలించుకోవచ్చు.
ఇప్పుడు వాయవ్య భారతం కబుర్లు చెప్పుకుందాం. యాత్ర గురించిన కబుర్లు మీతో…
View original post 1,093 more words