* * *
Continued from Part II
షిల్లాంగ్ నుండి 90 కిలోమీటర్ల దూరంలో మాలినాంగ్ అనే చిన్న గ్రామం ఉంది. ఇది 2003 లో ఆసియాలోనే అతి శుభ్రమైన గ్రామం గా, 2005 సంవత్సరంలో భారత దేశంలో అతి శుభ్రమైన గ్రామంగా పేరుకెక్కింది .ఇది గాడ్స్ ఓన్ గార్డెన్ గా పేరు పొందింది.
ఇక్కడ రివర్ వ్యాలీ ఇకోపార్క్ 2014, డిసెంబరులో ఏర్పాటైంది. దీనిని చూడటం ఒక అద్భుతమైన అనుభవం. ప్రక్కనే నడక దూరంలో ఉన్న రివాయ్ గ్రామంలో లివింగ్ రూట్ బ్రిడ్జిలు ఉన్నాయి. మేఘాలయలోని ఈ లివింగ్ రూట్ బ్రిడ్జిలు డబుల్ డెక్కర్ బ్రిడ్జిలు, సింగిల్ డెక్కర్ బ్రిడ్జిల రూపంలో ప్రపంచంలోనే ప్రత్యేకతను సంతరించుకున్నాయి. చిరపుంజి నుండి లివింగ్ రూట్ బ్రిడ్జి చేరేందుకు ట్రెక్కింగ్ చెయ్యటం ఒక సాహసం. దీనికి ధైర్యం, శక్తి రెండూ అవసరమే. ట్రెక్కింగ్ ద్వారా వెళ్లలేనివారు కొండమార్గంలో ప్రయాణించి ఇక్కడికి చేరవచ్చు.ఈ లివింగ్ రూట్ బ్రిడ్జిలు ప్రకృతిలోనే సహజంగా బలమైన వేళ్లు పెనవేసుకునిపోయి (బ్రిడ్జి) వంతెనల రూపాన్ని సంతరించుకుని ఇక్కడి వాగులు పైన ఏర్పడ్డాయి.
కొన్ని బ్రిడ్జిలు సుమారు 100 అడుగుల పొడవు కలిగి ఉంటాయి. ఇంత పొడవు కలిగిన (బ్రిడ్జి)వంతెన పూర్తిగా తయారయేందుకు పదిహేనేళ్ల దాకా పడుతుంది. ఒకసారి పూర్తిగా తయారైన (బ్రిడ్జి)వంతెన ఒకేసారి దాదాపు యాభై మంది బరువును తట్టుకోగలిగిన శక్తిని కలిగి ఉంటుంది. ఈ వేళ్లు జీవశక్తితో నిరంతరం పెరుగుతూనే…
View original post 560 more words