* * *
Continued from Part I
గౌహతిలో గడిపిన సమయంలో ఒక అస్సామీ స్నేహితురాలు నీషాడేకా ని కలిసాను. ఆమె ఒక గాయని. మధ్య తరగతి మహిళ. ఆమె భర్త ప్రభుత్వ రంగంలో ఒక పెద్ద హోదాలో ఉన్న వ్యక్తి. మనవైపు ప్రాంతాల్లో అలాటి హోదాలో ఉండే వ్యక్తులకంటే చాలా సాదా సీదాగా కనిపించారాయన. అది వ్యక్తిగతమనే కాక అక్కడివారి జీవన విధానాన్నిసూచిస్తోందనిపించింది.
నేను చూసిన దాదాపు పది స్థానిక కుటుంబాల్లో ఒక్కరే సంతానం. అబ్బాయి లేదా అమ్మాయి ఎవరో ఒకరే. ఎవరైనా సరే బాగా చదివించుకోవాలన్న ఆలోచన ఉంది. పిల్లల్ని పెద్ద చదువుల కోసం, ఉద్యోగాలకోసం దూరంగా పెద్ద,పెద్ద నగరాలకి పంపించే ఆలోచనలో ఉన్న తల్లితండ్రులు చాలామందే కనిపించారు. అక్కడి స్థిరత్వంలేని వాతావరణం దీనికి కొంత కారణం అనిపించింది.
నీషా ని నేను కలిసినప్పుడు మొదటిసారిగా అడిగిన ప్రశ్న ‘ఆడపిల్లకి అక్కడ సమాజం ఎలాటి అవకాశాల్ని స్థానాన్ని కలిపిస్తోంది’ అని.
నీషా వాళ్ల అమ్మమ్మ కాలంలో ఆడపిల్లకి చదువులు లేవని, బాల్య వివాహాలు ఉండేవని, ఇప్పుడు మాత్రం తల్లిదండ్రులు ఆడపిల్లకి చక్కని చదువు, కెరియర్ ని అందిస్తున్నారని, ఆతర్వాతే పెళ్లి అని చెప్పిందామె.
‘2015 జనవరి నెలలో అస్సాం ముఖ్యమంత్రి ఆడపిల్లలకి ప్రోత్సాహకాల్ని ప్రకటించారు కదా, అలాంటిది ఎందువల్ల అవసరం అయిందని’, అడిగినప్పుడు , గౌహతి నగరం కాక మారుమూల ప్రాంతాల్లో,గిరిజనుల్లోని వివిధ తెగల్లో అవిద్య ఎక్కువగా ఉందని…
View original post 1,506 more words