* * *
దైనందిన జీవితాల్లోంచి బయటకు వచ్చి మనం నివసించే ప్ర్రాంతానికి దూరంగానో, దగ్గరగానో ఉన్న క్రొత్త ప్రదేశాలను చూసేందుకు మనలో చాలామంది ఆసక్తితో ఉంటాం. ఆ ప్రయాణాలు మొదలుపెట్టినప్పటినుండి తిరిగి ఇల్లు చేరేవరకు అనేక సంఘటనలు, సన్నివేశాలు ,అనేకానేక క్రొత్త వ్యక్తులు మనకు ఎదురై జీవితానికి క్రొత్త శక్తిని, ఉత్సాహాన్నిఇస్తాయి. అలాటి ఒక యాత్రలో ప్రకృతి ఒడిలోకి నేరుగా వెళ్లగలిగినప్పుడు ఆ యాత్ర పొడవునా మనం మనం కాకుండా పోతాం, తిరిగొచ్చేక మనజీవితం మనకళ్లకి కొత్త అందాలతో కనిపిస్తుంది.క్రొత్త అర్థాలను చెబుతుంది కూడా. ఇవన్నీ ఏ ఒక్కరికో పరిమితమైన భావనలు కావు. మనమంతా ఎప్పుడో ఒకప్పుడు ఇలాటి అనుభవాన్ని, అనుభూతులను పొందే ఉంటాం.
అలాటి విలువైన అనుభవాన్ని ఇచ్చిన ఒక యాత్ర గురించి ఇప్పుడు చెబుతాను. ఈ ప్రాంతం మనదేశంలోనే చాలా చాలా ప్రత్యేకమైనది. భారతదేశ ఈశాన్య రాష్ట్రాలను మొదటిసారిగా చూసేందుకు వెళ్తూ వారానికి ఒకసారి నడిచే చెన్నై-గౌహతి ఎక్స్ప్రెస్ లో ప్రయాణాన్ని ప్లాన్ చేసుకున్నాం. అది ఎయిర్ కన్డీషన్డ్ రైలు. పాంట్రీ కారు కూడా ఉంది . ప్రయాణంలో చదువుకుందుకు ఇష్టమైన పుస్తకాలు ఉన్నాయి. సుదీర్ఘమైన రైలు ప్రయాణాలు అంటే మరింత ఇష్టం ఉంది. ఇక ప్రయాణం ఎంత సౌకర్యవంతంగా ఉంటుందో చెప్పక్కర్లేదుకదా.
ఈశాన్య రాష్ట్రాల వైపు బయలు దేరుతున్నామని చెప్పినప్పుడు కొందరు స్నేహితులు భద్రతా కారణాల దృష్ట్యా అక్కడికి వెళ్లటం సాహసం అవుతుందని, ఆ ప్రాంతాల్లో చేతిలో…
View original post 1,115 more words