* * *
APRIL 14, 2016 14 COMMENTS
ఆరోజు క్లాసులో అశోక్ అల్లరి శ్రుతిమించడంతో వాడిని గట్టిగా మందలించేను. ప్రక్క బెంచీలో కూర్చున్న మాలతి తన పుస్తకాలు పదేపదే తీసి దాస్తున్నాడని ఫిర్యాదు చేసింది. చదువులో చురుగ్గా ఉంటాడని వాడి అల్లరిని ఇష్టంగానే భరిస్తూ ఉంటాను. కానీ ఒక్కోసారి అది హద్దులు దాటుతోందనిపిస్తోంది.
‘ చదువుకుందుకు స్కూలుకి రండి, ఇలాటి పిచ్చిపనులు కోసం అయితే స్కూలుకి రావడం అనవసరం. ఇంట్లో అమ్మానాన్నలు మంచి చెడు ఏమీ చెప్పరా మీకు’ కోపంగా అన్నాను. ఏమనుకున్నాడో వాడు తలవంచుకుని నిలబడ్డాడు కాని మాట్లాడలేదు. తెలివైన వాడు, వాడిని సరైన దారిలోకి మళ్లించాలి.
స్టాఫ్ రూమ్లో అశోక్ ప్రస్తావన తెస్తే, వాడి గురించి ఎంత తక్కువ పట్టించుకుంటే అంత మంచిది అని చెప్పేరు. వాడికి ఇంట్లో చెప్పేవాళ్లు ఎవరూ లేరు, వాడు చేసే అల్లరికి హద్దూ లేదు. వాడిని ఎవ్వరూ బాగు చెయ్యలేరని, ఏడాదిగా వాడు ఆ స్కూల్లో జేరిందగ్గర నుంచి వాడి ఇంటినుండి ఇప్పటి వరకూ ఎవ్వరూ వచ్చి వాడి మంచిచెడ్డలు అడగలేదని అందరూ ఏకగ్రీవంగా చెప్పేసేరు. వాడంతట వాడే ఎలాగూ స్కూలు మానేసేరోజు ఒకటి వస్తుందని తేల్చేసేరు. వాడి ఇంటికి వెళ్లి పెద్దవాళ్లతో మాట్లాడాలని అనుకున్నాను .
సాయంకాలం గూడెంలో క్లాసు ముగించి వస్తుంటే మేరీ ఎదురైంది. పలకరింపుగా నవ్వాను. ఆమెను అప్పుడప్పుడు అక్కడ చూస్తూనే ఉంటాను. నాతో ఏదో…
View original post 1,217 more words